Yoga ఉత్కటాసనం ప్రయోజనాలు అమోఘం, ఈ జాగ్రత్తలు మస్ట్‌ | Amazing Healh benefits chair Pose Utkattasanacheck how to do | Sakshi
Sakshi News home page

Yoga ఉత్కటాసనం ప్రయోజనాలు అమోఘం, ఈ జాగ్రత్తలు మస్ట్‌

Feb 28 2026 12:41 PM | Updated on Feb 28 2026 12:46 PM

Amazing Healh benefits chair Pose Utkattasanacheck how to do

Yoga రోజూ ఎకువసేపు కూర్చుని పనిచేసేవారిని క్రమంగా నడుం నొప్పులు వెంటాడుతుంటాయి. ఈ నొప్పి నుంచి ఉపశమనం అందించే ఆసనాల్లో సాధన చేయదగిన ముఖ్యమైన శ్రేణిలో నిలిచే ఆసనం ఉత్కటాసనం. ‘ఉత్కట’ అంటే శక్తిమంతమైన/తీవ్రమైన అని అర్థం. ఈ ఆసనం శరీరానికి బలాన్ని, స్థైర్యాన్నీ ఇస్తుంది.

ఉత్కటాసనం ప్రయోజనాలు...

కాళ్ల కండరాలు, తొడలు కండరాలు బలపడతాయి. రక్తప్రసరణ, శ్వాసక్రియ మెరుగుపడతాయి. శరీరంలో మెటబాలిజం పెరిగి అధికబరువు సమస్య తగ్గు ముఖం పడుతుంది. కోర్‌ స్ట్రెంగ్త్‌ పెరుగుతుంది.  పొట్ట భాగం, వెన్నెముకకు సపోర్ట్‌ పెరుగుతుంది. 

బ్యాలెన్స్‌– స్టెబిలిటీ మెరుగు పడుతుంది. శరీర సమతుల్యత పెంపొందుతుంది. మెటబాలిజం ఉత్తేమవు తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తప్రసరణ మెరుగు పడుతుంది, శరీరానికి ఉత్సాహం వస్తుంది. మనసుకు ఏకాగ్రత ఫోకస్‌ పెరుగుతాయి.

ఇదీ చదవండి: పట్టపగలే భార్య ప్రియుడి హత్య, భార్యకు వార్నింగ్‌,షాకింగ్‌ వీడియో

జాగ్రత్తలు...
మోకాళ్ల నొప్పి/ వెన్నునొప్పి / డిస్క్‌ సమస్య ఉన్నవారు డాక్టర్‌ లేదా యోగా గురువు పర్యవేక్షణలో చేయాలి. బీపీ లేదా హార్ట్‌   ప్రాబ్లమ్‌ ఉన్నవారు ఎక్కువసేపు హోల్డ్‌ చేయొద్దు. 
మోకాళ్లు పాదాల వేళ్లకు ముందుకు వెళ్లకూడదు.  వెన్నెముక నిటారుగా ఉంచాలి – వంగిపోవద్దు. 
గర్భిణులు తప్పనిసరిగా గైడెన్స్‌తో మాత్రమే చేయాలి. ∙మొదట 10–20 సెకండ్లు హోల్డ్‌ చేయండి. తర్వాత 3–5 రిపిటేషన్స్‌ చేయాలి. శ్వాస నెమ్మదిగా, సమంగా ఉంచాలి. - పాతర్ల అనిత, యోగా ట్రైనర్‌ 

ఇదీ చదవండి: తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?

శక్తిని ఇచ్చే ఉత్కటాసనం చేసే విధానం..
ముందుగా నిటారుగా నిలబడాలి. పాదాలు రెండూ దగ్గరగా ఉంచి, చేతులను పైకి ఎత్తాలి. కుర్చీలో కూర్చున్నట్టు మోకాళ్లను ముడుచుకుని కిందకు వంగాలి. మోకాళ్లు ముందుకు పడకుండా జాగ్రత్త పడాలి. చేతులను నమస్కార భంగిమలో ఉంచాలి.  ఈ స్థితిలో  పొట్ట భాగాన్ని లోపలికి తీసుకుంటూ, వెన్నెముకను నిటారుగా ఉంచాలి.  దృష్టి నాసికా పుటాలపై లేదా ముందు ఉన్న ఒక బిందువుపై కేంద్రీకరించాలి. ∙5 నుంచి 6 సార్లు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్‌ చేయడం ద్వారా కండరాలు  బలపడతాయి.

Advertisement
 
Advertisement
Advertisement