మజిల్‌ మమ్మీ | Explanation of muscle mommy | Sakshi
Sakshi News home page

మజిల్‌ మమ్మీ

Feb 24 2026 5:48 AM | Updated on Feb 24 2026 5:48 AM

Explanation of muscle mommy

ట్రెండ్‌

మహిళలకు సంబంధించి సోషల్‌ మీడియాలో తాజా ట్రెండ్‌.. మజిల్‌ మమ్మీ. ‘బాగా సన్నబడాలి... మెరుపు తీగలా కనిపించాలి’ అనుకునే ట్రెండ్‌లు ఎన్నో వచ్చాయి. వాటికి భిన్నమైన ట్రెండ్‌ ఇది. వెల్నెస్‌ సంస్కృతికి సంబంధించిన పాత స్టీరియోటైప్‌లను తోసిరాజని మహిళల శక్తి, ఫిట్‌నెస్‌ను పునర్నిర్వచిస్తున్న ట్రెండ్‌ ఇది. గత ఫిట్‌నెస్‌ ట్రెండ్‌ల మాదిరిగా కాకుండా ‘మజిల్‌ మమ్మీ’  కండరాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. 

ఈ ట్రెండ్‌ ప్రధాన సందేశం...బలం బలంలాగే కనిపించాలి. బరువు తగ్గడం మాత్రమే ఫిట్‌నెస్‌ కాదు. స్త్రీలు సన్నగా కనిపించాలి, బరువులు ఎత్తవద్దు, స్ట్రెంత్‌ ట్రైనింగ్‌ మనకు సంబంధించింది కాదు, నాజూకుగా కనిపించాలంటే మజిల్‌ అక్కర్లేదు...ఇలాంటి సంప్రదాయ సౌందర్య ప్రమాణాలను నేటి తరం మహిళలలో చాలామంది తిరస్కరిస్తున్నారు. 

కండరాలపై దృష్టి సారించే ఈ ఫిట్‌నెస్‌ ట్రెండ్‌ ఊపందుకోవడానికి మరో ప్రధాన కారణం...దీర్ఘకాలిక ఆరోగ్యం గురించి అవగాహన పెరగడం. మెరుగైన ఎముక సాంద్రత(బోన్‌ డెన్సిటీ), హార్మోన్ల సమతుల్యత...మొదలైవాటికి ప్రాధాన్యతన పెరిగింది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి ΄్లాట్‌ఫామ్‌లలో ‘మజిల్‌ మమ్మీ’ ట్రెండ్‌ ఎక్కువగా  కనిపిస్తోంది. ‘అసలు సిసలు ఫిట్‌నెస్‌ అంటే ఏమిటి?’ అనే కాప్షన్‌తో జనాదరణ పొందిన డెడ్‌లిఫ్ట్‌లు, స్క్వాట్‌లు, రెసిస్టెంట్స్‌ వర్క్‌కు సంబధించిన వీడియో  క్లిప్‌లకు, ఆఫ్‌బీట్‌ మ్యూజిక్, జోక్స్‌ జోడించి పోస్ట్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement