వేయించుకు తినండి..అదిరిపోయే రుచి! | [Crispy Veg, Chilli Paneer & Chicken Majestic Recipes – Chef Govardhan’s Tips | Sakshi
Sakshi News home page

వేయించుకు తినండి..అదిరిపోయే రుచి!

Oct 11 2025 2:35 PM | Updated on Oct 11 2025 3:05 PM

tip of the day crispy veg and chicekn recipes

స్నాక్స్‌గానూ, భోజనంలోనూ రెండు విధాలుగా ఉపయోగపడే వంటకాలు కొన్ని ఉంటాయి.  వాటిలో ఇంటిల్లిదినీ మెప్పించే క్రిస్సీ వెజ్, చికెన్‌ మెజిస్టిక్, చిల్లీ గార్లిక్‌.. ఇవాల్టీ టిప్‌ ఆఫ్‌ ది డేలో భాగంగా  చెఫ్‌ గోవర్ధన్‌ ఇచ్చిన వంటకాలను  చూద్దాం. 

 

క్రిస్పీ వెజ్‌
కావలసినవి: క్యారెట్‌ – 100 గ్రా.; బీ¯Œ ్స – 50 గ్రా; రెడ్‌ క్యాప్సికం – 50 గ్రా; యెల్లో క్యాప్సికం – 50 గ్రా; గ్రీన్‌ క్యాప్సికం – 50 గ్రా.; క్యాబేజీ – 100 గ్రా.;
పిండి మిశ్రమానికి... కార్న్‌ ఫ్లోర్‌ – 3 టేబుల్‌ స్పూన్లు; మైదా – 3 టేబుల్‌ స్పూన్లు; బియ్యప్పిండి – 3 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత; కచ్చాపచ్చాగా దంచిన మిరియాల పొడి – టీ స్పూన్‌ సన్నగా తరిగిన వెల్లుల్లి – రెండు స్పూన్లు; సన్నగా తరిగిన అల్లం – టేబుల్‌ స్పూన్‌; నీళ్లు – అవసరమైనంత.

తయారి:  ∙పిండి మిశ్రమం కోసం తీసుకున్న పదార్థాలన్నీ ఒక వెడల్పాటి గిన్నెలో వేసి నీరు కలిపి మృదువైన మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి ∙కూరగాయలన్నీ పొడవాటి సన్నని ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి  కూరగాయ ముక్కలను పిండి మిశ్రమంలో ముంచి, అన్ని వైపులా పిండి పట్టేలా ఉంచాలి ∙స్టౌ పై కడాయి పెట్టి, నూనె పోసి, వేడయ్యాక, అందులో సిద్ధం చేసుకున్న కూరగాయల ముక్కలను వేసి, బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి ∙చట్నీ లేదా సాస్‌తో వేడిగా సర్వ్‌ చేయాలి.

చిల్లీ పనీర్‌
 కావలసినవి:  పిండి మిశ్రమానికి... పనీర్‌ – 500 గ్రా. (డైమండ్‌ షేప్‌లో కట్‌ చేయాలి); కార్న్‌ ఫ్లోర్‌ – 40 గ్రా.; మైదా – 40 గ్రా.; ఉప్పు – టీ స్పూన్‌; మిరియాల పొడి – టీ స్పూన్‌; సన్నగా తరిగిన వెల్లుల్లి – టేబుల్‌ స్పూన్‌; నీరు – అవసరమైనంత.
సాస్‌ కోసం... నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; సన్నగా తరిగిన వెల్లుల్లి – 2 టేబుల్‌ స్పూన్లు; సన్నగా తరిగిన అల్లం – టీ స్పూన్‌ పచ్చిమిర్చి (డైమండ్‌ కట్‌) – 8; గ్రీన్‌  క్యాప్సికం – ఒకటి (సన్నగా తరగాలి); ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరగాలి); ఉప్పు – తగినంత; చక్కెర – టీ స్పూన్‌ టొమాటో సాస్‌ – టేబుల్‌ స్పూన్‌ వెనిగర్‌ – టీ స్పూన్‌; సోయా సాస్‌ – టేబుల్‌ స్పూన్‌ ; గ్రీన్‌ చిల్లీ సాస్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; రెడ్‌ చిల్లీ పొడి – టీ స్పూన్‌; నీళ్లు – 150 మి.లీ.
తయారి:  ∙పై పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసి, కలిపి, మిశ్రమం తయారు చేయాలి. పనీర్‌ ముక్కలను మిశ్రమంలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి, బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.  ∙సాస్‌ తయారీకి.. పాన్‌ లో నూనె పోసి, వేడయ్యాక వెల్లుల్లి–అల్లం వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, క్యాప్సికం, ఉల్లిపాయ వేసి, వేపాలి ∙ఉప్పు, చక్కెర, టొమాటో సాస్, వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్, కారం  పొడి వేసి, నీళ్లు కలిపి చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి ∙వేయించిన పనీర్‌ ముక్కలను ఈ సాస్‌లో వేసి బాగా కలపాలి ∙కొత్తిమీర లేదా గుండ్రంగా తరిగిన ఉల్లిపాయ స్లైసులతో అలంకరించి వేడిగా సర్వ్‌ చేయాలి. 

( కిలోల కొద్దీ వెండి, బంగారం, నగదు, లగ్జరీ కార్లు, 17 టన్నుల తేనె)

చికెన్‌ మెజెస్టిక్‌
కావలసినవి: చికెన్‌  మ్యారినేట్‌ చేయడానికి... బోన్లెస్‌ చికెన్‌ – 500 గ్రా.; చిక్కటి మజ్జిగ– గ్లాసుడు; అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – టేబుల్‌ స్పూన్‌పసుపు – టీ స్పూన్‌; కారం – టేబుల్‌ స్పూన్‌ఉప్పు – టీ స్పూన్‌  కార్న్‌ ఫ్లోర్‌ – టేబుల్‌ స్పూన్‌ ; మైదా – టేబుల్‌ స్పూన్‌
సాస్‌ కోసం...  నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; సన్నగా తరిగిన వెల్లుల్లి – రెండు స్పూన్లు; పచ్చిమిర్చి – నాలుగైదు; కరివేపాకు – ఒక రెమ్మ; పుదీనా ఆకులు – అర కప్పు; సోయా సాస్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; ఎండు మిరపకాయలు – 6; గరం మసాలా – టీ స్పూన్‌; పెరుగు – 6 టేబుల్‌ స్పూన్లు; నీరు – 50 మి.లీ.
తయారి:  ∙చికెన్‌ ను అన్ని పదార్థాలతో కలిపి, కనీసం 30 నిమిషాలు మ్యారినేట్‌ చేయాలి ∙బాణలిలో నూనెపోసి, మ్యారినేట్‌ చేసిన చికెన్‌ పీసులను బంగారు రంగు వచ్చేవరకు వేయించి, తీయాలి.

ఇదీ చదవండి :హ్యాపీగా ఏసీ కోచ్‌లో తిష్ట, చూశారా ఈవిడ డబల్‌ యాక్షన్‌!

సాస్‌ తయారీ:  పాలో నూనె వేసి వెల్లుల్లి, మిర్చి, కరివే΄ాకు, పుదీనా ఆకులు వేసి వేయించాలి. తర్వాత సోయా సాస్, ఎండు మిరపకాయలు, గరం మసాలా, పెరుగు, నీరు వేసి చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి. వేయించిన చికెన్‌ను ఈ సాస్‌లో వేసి బాగా కలపాలి. ∙పుదీనా లేదా కొత్తిమీరతో అలంకరించి వేడిగా సర్వ్‌ చేయాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement