
ప్రయాణాల్లో అనేక వింత ఘటనలు చూస్తూ ఉంటాం. కొంతమంది తప్పు తమది అయినా విడ్డూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. టికెట్ లేకుండా ప్రయాణించడమే కాకుండా, అనుచితంగా ప్రవర్తించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.
బిహార్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయిన టికెట్ లేకుండానే రైల్లో ప్రయాణిస్తోంది. అదీ ఏసీ కోచ్‌లో టికెట్ లేకుండా ప్రయాణిస్తు న్నప్పుడు తనిఖీ అధికారి టీటీఈ వచ్చినపుడు పట్టుబడింది. అయితే తప్పు ఒప్పుకొని జరిమానా చెల్లించాల్సింది పోయి. ఎదురు దాడికి దిగింది. తాను ప్రభుత్వంలో టీచర్‌ననీ, ఇబ్బంది పెడుతున్నావు. అవసరంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నావు అంటూ అతనిపై మండిపడింది.
దానికి "ఇది ఇబ్బంది పెట్టడం కాదు. మీ దగ్గర టిక్కెట్‌లేదు, గతంలో కూడా ఇలానే టికెట్ లేకుండా ప్రయాణించారని సమాధానం చెప్పాడు టీటీ అయినా ఆమె ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అబద్ధం చెబుతున్నావంటూ ఆయన మీద ఎగిరిపడింది. దీంతో ఈ తతంగాన్నంతా తన మొబైల్‌లో వీడియో తీయడం మొదలు పెట్టడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియో రికార్డింగ్ ఆపేయాలంటూ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించింది. తన విధులకు ఆటంకం కలగించొద్దు అంటూ ఆయన మందలించాడు. దీంతో నన్ను వేధిస్తున్నారు అంటూ చివరి అస్త్రం ప్రయోగించింది. ఆతరువాత అక్కడినుంచి మెల్లగా జారుకుంంటూ నువ్వు వేస్ట్ ఫెలోవి అంటూ నోరు పారేసుకుంది. ఇదంతా వీడియోలో రికార్డైంది.
Victim Genderpic.twitter.com/CbiKB63sd7
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) October 7, 2025
ఈ వీడియో ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది, చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆ మహిళ "బాధిత కార్డు" వాడిందని విమర్శించారు. ప్రభుత్వ టీచర్ అయి ఉండా కూడా టికెట్ లేకుండా ప్రయాణించడం, ముఖ్యంగా తన పని తాను చేసుకుంటున్న టికెట్ ఎగ్జామినర్‌పై మండిపడటం సరికాదని కొందరు విమర్శించారు.