breaking news
TTC
-
హ్యాపీగా ఏసీ కోచ్‌లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్!
ప్రయాణాల్లో అనేక వింత ఘటనలు చూస్తూ ఉంటాం. కొంతమంది తప్పు తమది అయినా విడ్డూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. టికెట్ లేకుండా ప్రయాణించడమే కాకుండా, అనుచితంగా ప్రవర్తించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.బిహార్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయిని టికెట్ లేకుండానే రైల్లో ప్రయాణిస్తోంది. అదీ ఏసీ కోచ్‌లో టికెట్ లేకుండా ప్రయాణిస్తు న్నప్పుడు తనిఖీ అధికారి టీటికి ట్టుబడింది. అయితే తప్పు ఒప్పుకొని జరిమానా చెల్లించాల్సింది పోయి, ఎదురు దాడికి దిగింది. తాను ప్రభుత్వ టీచర్ననీ, ఇబ్బంది పెడుతున్నావు... కావాలనే, ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నావు అంటూ అతనిపై మండిపడింది. దానికి "ఇది ఇబ్బంది పెట్టడం కాదు. మీ దగ్గర టిక్కెట్లేదు, గతంలో కూడా ఇలానే టికెట్ లేకుండా ప్రయాణించారని సమాధానం చెప్పాడు టీటీ. అయినా ఆమె ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అబద్ధం చెబుతున్నావంటూ ఆయన మీద ఎగిరిపడింది. దీంతో ఈ తతంగాన్నంతా తన మొబైల్లో వీడియో తీయడం మొదలు పెట్టడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియో రికార్డింగ్ ఆపేయాలంటూ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించింది. తన విధులకు ఆటంకం కలగించొద్దు అంటూ ఆయన మళ్లీ మందలించాడు. దీంతో నన్ను వేధిస్తున్నారు అంటూ చివరి అస్త్రం ప్రయోగించింది. ఆతరువాత అక్కడినుంచి మెల్లగా జారుకుంంటూ నువ్వు వేస్ట్ ఫెలోవి అంటూ నోరు పారేసుకుంది. ఇదంతా వీడియోలో రికార్డైంది. Victim Genderpic.twitter.com/CbiKB63sd7— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) October 7, 2025ఈ వీడియో ఆన్లైన్లో చర్చకు దారితీసింది, చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆ మహిళ "విక్టిమ్ కార్డు" వాడిందని విమర్శించారు. ప్రభుత్వ టీచర్ అయి ఉండా కూడా టికెట్ లేకుండా ప్రయాణించడం, ముఖ్యంగా తన పని తాను చేసుకుంటున్న టికెట్ ఎగ్జామినర్‌పై మండిపడటం సరికాదని కొందరు విమర్శించారు. -
10న టీటీసీ పరీక్ష
అనంతపురం ఎడ్యుకేషన్: టెక్నికల్ ట్రైనింగ్ సర్టిఫికెట్(టీసీసీ) థియరీ పరీక్ష ఈనెల 10న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ మంగళవారం సమీక్షించారు. ఒకే రోజు మూడు విడతలుగా పరీక్షలుంటాయని పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు పేపర్–2, తిరిగి 3.30 నుంచి 4.30 గంటల వరకు పేపర్–3 పరీక్ష„ ఉంటుందన్నారు. నగరంలోని రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏ, బీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే హాల్‌టికెట్లు వెబ్సైట్లో ఉంచామన్నారు. ఎవరికైనా డౌన్లోడ్కాకపోతే నేరుగా పరీక్ష కేంద్రాల్లో తీసుకోవచ్చన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి 533 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. -
టీటీసీ లోయర్ థియరీ పరీక్షా ఫలితాల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్ : టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ (టీటీసీ) లోయర్ థియరీ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు డీఈఓ అంజయ్య, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
టీటీసీ పరీక్షకు హాల్‌టికెట్లు డౌన్లోడు చేసుకోవాలి
విద్యారణ్యపురి: టీటీసీ లోయర్, థియరీ పరీక్షలు ఈనెల 16న జరగనున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షల కోసం వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో నాలుగు సెంటర్లు ఎంపిక చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. టీటీసీ పరీక్ష రాయబోతున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డబ్లూడబ్లూడబ్లూ.బీఎస్ఇ తెలంగాణ.ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా 14వ తేదీవరకు డౌన్లోడు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.