10న టీటీసీ పరీక్ష | TCT test on 10th | Sakshi
Sakshi News home page

10న టీటీసీ పరీక్ష

Aug 8 2017 11:02 PM | Updated on Jun 1 2018 8:36 PM

టెక్నికల్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌(టీసీసీ) థియరీ పరీక్ష ఈనెల 10న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులతో ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందునాయక్‌ మంగళవారం సమీక్షించారు. ఒకే రోజు మూడు విడతలుగా పరీక్షలుంటాయని పేర్కొన్నారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌:

టెక్నికల్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌(టీసీసీ) థియరీ పరీక్ష ఈనెల 10న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులతో ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందునాయక్‌ మంగళవారం సమీక్షించారు.  ఒకే రోజు మూడు విడతలుగా పరీక్షలుంటాయని పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు  పేపర్‌–1, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు పేపర్‌–2, తిరిగి 3.30 నుంచి 4.30 గంటల వరకు పేపర్‌–3 పరీక్ష„ ఉంటుందన్నారు. నగరంలోని రాజేంద్ర నగరపాలక ఉన్నత  పాఠశాలలో ఏ, బీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇప్పటికే హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. ఎవరికైనా డౌన్‌లోడ్‌కాకపోతే నేరుగా పరీక్ష కేంద్రాల్లో తీసుకోవచ్చన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి 533 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement