గత సంవత్సరం ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో పూసల దండలు అమ్ముకునే మోనాలిసా సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ అయింది. చివరికి సినిమాల్లో కూడా ఆమెకు అవకాశాలు వచ్చాయి. తాజా విషయానికి వస్తే... ప్రయాగ్‌రాజ్ మాఘమేళా 2026లో మరో మోనాలిసా తెర మీదికి వచ్చింది. ఈ అమ్మాయి పేరు అఫ్సాన పవార్. ఈమె కూడా పూసల దండలు అమ్ముతుంది. అందువల్ల ఆ మోనాలిసాకు, ఈ అఫ్సానాకు మధ్య ఉన్న సారూప్యతల గురించి పోస్ట్‌లు పెడుతున్నారు నెటిజనులు. మరీ ముఖ్యంగా... ఆకట్టుకునే వారి కళ్ల గురించి ప్రస్తావిస్తున్నారు.
పవార్ పూసల దండలు అమ్ముతున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో, మాఘమేళాకు వచ్చిన వారిలో కొందరు ఆమెతో సెల్ఫీలు దిగుతూ కనిపించారు.‘నేను ప్రతి మేళాకు వెళుతుంటాను. ఇక్కడ నెలరోజులు ఉంటాను. ఎంతోమంది నన్ను మోనాలిసాతో ΄ోల్చుతూ ఆమెలాగే నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది’
అంటుంది పవార్.‘భవిష్యత్తులో కూడా ఇలాగే దండలు అమ్ముకుంటారా? ఆ మోనాలిసా మాదిరిగా సినిమాలలో నటించే అవకాశం ఏమైనా ఉందా?’ అనే ప్రశ్నకు....అందమైన నవ్వులతో పవార్ చెప్పిన జవాబు అందరినీ ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే...
‘అందరి ఆశీస్సులు, సహకారం ఉంటే తప్పకుండా నేను కూడా ఫిల్మ్‌స్టార్ అవుతాను’ అని!


