breaking news
Tip of the Day
-
ముడతలు లేకుండా అందంగా.. ఆకర్షణీయంగా మెరిసిపోవాలంటే..!
అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అయితే యంగ్ లుక్ కోసం, ఆరోగ్యకరమైన జీవనశైలి, చర్మ సంరక్షణ, సరైన ఆహారం తీసుకోవడంం చాలా ముఖ్యం. ఇవాల్టీ టిప్ ఆఫ్ ది డేలో భాగంగా యవ్వనంగా కనిపించడానికి కొన్ని చిట్కాలలను చూద్దాం.అందంగా కనిపించడం అంటే ఆరోగ్యంగా, చురుగ్గా ఉండటమే. దీనికి ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా తీసుకోవాలి. కొవ్వు , చక్కెర అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ,చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడికి దూరంగా ఉండాలి. యోగా మరియు ధ్యానం వంటి పద్ధతుల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. పుష్కలంగా నీరు త్రాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. ముఖంపై తొందరగా ముడతలు రావు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఇవి చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.ప్రతి రోజు 7-8 గంటలు నిద్రపోవడం ముఖ్యం. అలాగే ప్రతిరోజూ SPF ఉన్న సన్‌స్క్రీన్ ఉపయోగించాలి. సూర్యుడి హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవచ్చు.ఇదీ చదవండి: జిమ్‌కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్‌లుక్ వైరల్మన స్కిన్ బట్టి క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్,ఎక్స్‌ఫోలియేటింగ్ లాంటి పద్ధతులను ప్రయత్నించవచ్చు. వయసు పెరుగుతున్న క్రమంలో వృద్ధాప్య ఛాయలను తగ్గించుకునేలా, నిపుణుల సలహా మేరకు కొన్ని యాంటీ ఏజింగ్ క్రీములు వాడవచ్చు.బెల్లం ఫేస్ వాష్ బెల్లంతో తయారు చేసిన ఫేస్‌వాష్ యాంటీ ఏజింగ్‌గా పనిచేసి ముడతలను కనిపించ నియ్యదు.చిన్న బెల్లం ముక్క తీసుకుని ఒక గిన్నెలో వేసి, టీస్పూను నీళ్లు పోసి ఉంచాలి. బెల్లం కరిగిన తరువాత టీస్పూను శనగపిండి, మజ్జిగవేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఏడు నిమిషాల పాటు వలయాకారంలో మర్దన చేయాలి. ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయాలి. ముఖాన్ని పొడిగా తుడుచుకుని మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ రాసుకోవాలి. చదవండి: Vidhu Ishiqa: మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ కిరీటంతో చరిత్ర సృష్టించింది!ఈ ఫేస్‌వాష్‌ను వాడడం వల్ల ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది. వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా వాడడం వల్ల ముఖం మీద ముడతలు తగ్గుముఖం పడతాయి. -
వర్షాకాలంలో హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కావాలంటే..!
వర్షాకాలంలో ముఖ సౌందర్యం కోసం, జుట్టు రక్షణ చర్మంలోని తేమను నియంత్రించడం జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యంగా వాతావరణానికి అనుగుణంగా చర్మ రక్షణ పద్దతులు పాటించాలి. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా వర్షాకాలంలో అందాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం.వానా వానా వందనం అనుకుంటూ.. వేడి వేడి బజ్జీలు లాగించేస్తూ చర్మ సంరక్షణను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. గాలిలోని ఆర్ద్రత, వర్షం వల్ల.. చర్మం జిడ్డుగా, లేదంటే పొడిగా మారే అవకాశం ఉంది. అందుకే రెయిన్ సీజన్లోనూ కూడా చర్మం, జుట్టు సంరక్షణలో సులభమైన, సహజమైన బ్యూటీ టిప్స్ పాటించాల్సిందే.వర్షాకాలం పాటించాల్సిన సౌందర్య చిట్కాలు మాయిశ్చరైజర్: వాతావరణం తేమగా ఉంటుంది కనుక చర్మరంధ్రాలు మూసుకోకుండా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి తేలికపాటి మాయిశ్చరైజర్‌ని వాడాలి.ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్‌లు లేదా మార్కెట్లో లభించే సురక్షితమైన ఫేస్ మాస్క్‌లను ఉపయోగించడం వల్ల చర్మం తాజాగా ఉంటుందిమేఘావృతమైన రోజులలో కూడా, సూర్యుని యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది. అందుకే కనీస SPF 30 ఉన్న సన్‌స్క్రీన్‌ని ఉపయోగించాలి.చర్మంలోని సహజ నూనెలను తొలగించే కఠినమైన ఉత్పత్తులకు బదులుగా మీ చర్మానికి తగినట్టుగా, సున్నితమైన, నూనె లేని సువాసన లేని క్లెన్సర్‌ను ఎంచుకోండి.వర్షాకాలంలో మొటిమలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, మొటిమలను నివారించడానికి, చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంపిక చేసిన ఉత్పత్తులను ఉపయోగించాలి.వర్షాకాలంలో హెవీ మేకప్ కాకుండా, తేలికపాటి, వాటర్ ప్రూఫ్ లైట్ మేకప్ ఎంచుకోవాలి. ఫౌండేషన్, కన్సీలర్ను సెట్ చేయడానికి సెట్టింగ్ స్ప్రే వాడితే బెటర్. వర్షాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పటికీ, సన్‌స్క్రీన్ ఉపయోగించడం ముఖ్యం. ఇది చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుండి రక్షిస్తుంది. పండ్లు, కూరగాయలు మరియు ఇతర పోషకమైన ఆహారాలను తీసుకోవడం ద్వారా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి, చర్మాన్ని లోపలినుంచి ఆరోగ్యంగా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగాలి.మన జుట్టుకు తగిన షాంపూ మరియు కండీషనర్ ఎంచుకోవాలి. వర్షంలో తడిచిన తడి జుట్టును అలాగే వదిలేయకుండా సహజంగా ఆరేలా చూసుకోవడం. తప్పదు అనుకుంటే డ్రైయ్యర్ వాడాలి. జుట్టు చిట్లిపోకుండా ఉండటానికి కండీషనర్ లేదా హెయిర్ సీరమ్‌ని ఉపయోగించండి.జిడ్డు చర్మం ఉన్నట్లయితే, టోనర్ ఉపయోగించడం మంచిది. కాఫీ, చార్కోల్, ఆల్కహాల్, గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్‌లు ఉన్న టోనర్లను వాడటం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. మురికి , బ్యాక్టీరియా బదిలీ కాకుండా ఉండటానికి ముఖాన్ని ఊరికే టచ్ చేస్తూ ఉండడం మానుకోండి.వీటితో పాటు రోగ నిరోధశక్తిని కాపాడుకునేందుకు పౌష్టికాహారం తీసుకోవాలి. ఎందుకంటే వానాకాలంలో జలుబు, దగ్గు, వైరల్, సీజనల్ ఫీవర్లు ముసురే అవకాశాలెక్కువ. తాజా పండ్లు, ఆకుకూరలు తీసుకోవడంతోపాటు విటమిన్ సికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది యాంటీఆక్సిడెంట్, చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్ నష్టం నుండి కాపాడుతుంది. అలాగే కనీసం వ్యాయామం కూడా చాలా అవసరం. -
TodayRecepies బనానాతో ఇలాంటి వెరైటీలు ఎప్పుడైనా ట్రై చేశారా?
అరటి చెట్టు ఇంటికి అందం. అరటి ఆకు భోజనానికి ఆరోగ్యం, అరటి కూరలు వంటికి చాలామంచిది అరటికాయతో అనేక రుచికరమైన వంటకాలు చేయవచ్చు. అరటికాయ వేపుడు, అరటికాయ పచ్చడి, అరటికాయ పులుసు, అరటికాయ కూర, అరటికాయ బజ్జీలు, అరటికాయతో హల్వా, అరటికాయతో చిప్స్, అరటికాయతో స్నాక్స్ వంటివి. వీటిని వివిధ రకాలుగా తయారుచేసి తినవచ్చు. మనకు విరివిగా దొరికే అరటి పండ్లతో చేసుకునే మరికొన్ని రుచులను ఎపుడైన ప్రయత్నించారా? చిన్నా పెద్దా అంతా ఇష్టంగా ఆరగిస్తారు. ఇవాల్టి టిప్ ఆఫ్ దిడే లో భాగంగా కొన్నింటిని చూద్దాం. !చాక్లెట్ బనానా హల్వాకావలసినవి: పండిన అరటి పండ్లు – 4; నెయ్యి – 5 టేబుల్ స్పూన్లు; పంచదార – అర కప్పు (లేదా రుచికి సరిపడా); ఏలకుల పొడి – అర టీ స్పూన్; జీడిపప్పు, బాదం పప్పు-కొన్ని (సన్నగా తరిగినవి, నేతిలో వేయించుకోవాలి); చాక్లెట్పౌడర్ – అర కప్పు (అభిరుచిని బట్టి);తయారీ: అరటి పండ్లను మెత్తగా చిదుముకోవాలి. ఒక పాన్‌లో నెయ్యి వేడి చేసి, అరటి పండు ముద్దను వేసి మధ్యస్థ మంట మీద, బాగా కలపాలి. అరటిపండు ముద్ద రంగు మారిన తర్వాత పంచదార, చాక్లెట్ పౌడర్ వేసి బాగా కలపాపాలి. పంచదార కరిగి, హల్వా దగ్గర పడ్డాక ఏలకుల పొడి వేసి మరోసారి కలపాలి. చివరగా, నెయ్యిలో వేయించిన జీడిపప్పు, బాదం పప్పులతో కలిపి, సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఘీ రోస్ట్ కావలసినవి: అరటిపండ్లు – 3 (మరీ పండినవి కాకుండా, కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకుని ముక్కలు చేసి పెట్టుకోవాలి); పంచదార – సరిపడా; ఏలకుల పొడి – అర టీస్పూన్; నెయ్యి (ఘీ)– సరిపడా.తయారీ: ముందుగా పాన్‌లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని, వేడి చేసుకోవాలి. ఆ నేతిలో అరటిపండు ముక్కలను పాన్ మొత్తం పరచుకోవాలి. చిన్న మంట మీద వేయించుకుంటూ పంచదారను అరటిపండు ముక్కలపై జల్లుకుని, దోరగా వేయించుకుంటూ ఇరువైపులా తిప్పుకుంటూ ఉండాలి. అవసరం అయితే నెయ్యి, పంచదార మరికాస్త వేసుకోవచ్చు. చివరిగా ఏలకుల పొడి జల్లుకోవాలి. అరటిపండు ముక్కలు దోరగా వేగి, పంచదార కరిగి పాకం– ముక్కలకు పట్టిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు.బనానా-ఓట్ స్మూతీ రెసిపీకావలసినవి: పండిన అరటి పండు – ఒకటి; ఓట్స్ – 2 టేబుల్ స్పూన్లుపాలు – ఒక కప్పు (ఆవుపాలు లేదా బాదంపాలు); తేనె – 2 టీ స్పూన్లు (లేదా రుచికి సరిపడా); చియా సీడ్స్ – ఒక టీ స్పూన్; ఐస్ క్యూబ్స్ – కొన్ని.తయారీ: ఓట్స్ ను 5 నిమిషాల పాటు పాలలో నానబెట్టాలి. ఒక మిక్సీజార్‌లో నానిన ఓట్స్, అరటి పండు, పాలు, తేనె, చియా సీడ్స్, ఐస్ క్యూబ్స్ వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టుకుని, నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. -
సూపర్ టిప్స్ : ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!
బరువు తగ్గాలంటే ఆహార అలవాట్లను మార్చుకోవాలి. వ్యాయామం చేయాలి. వీటన్నింటి కంటే ముందు అసలు మనం ఎందుకు బరువు ఎక్కువగా ఉన్నాయో విశ్లేషించుకోవాలి. అంతర్లీనంగా ఏవైనా ఆరోగ్యసమస్యలున్నాయేమో అనేది వైద్య నిపుణుల ద్వారా చెక్ చేసుకోవాలి. అప్పుడు వ్యాయామం, ఆహారంమీద దృష్టిపెట్టాలి. అయితే ఎక్స్‌ర్‌సైజ్ చేయడానికి టైం లేదబ్బా.. ఇది అందరూ చెప్పేమాట. మరి దీనికి పరిష్కారమేంటి? బిజీ షెడ్యూల్‌తో సతమతయ్యేవారు, అస్సలు టైం ఉండటం లేదు అని బాధపడే వారు ఏం చేయాలి? ఇవాల్టి ‘ టిప్ ఆఫ్ ది డే’ లో తెలుసుకుందాం.బిజీ బిజీ జీవితాల్లో బరువు తగ్గడంపై దృష్టి పెట్టేందుకు సమయం దొరకడం కష్టంగా అనిపించవచ్చు. కానీ మన కోసం, మన ఆరోగ్యం కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయించడం చాలా అవసరం. అలాంటి కొన్ని చిట్కాలు చూద్దాం. స్మార్ట్‌గా మన షెడ్యూల్ ఆధారంగా దినచర్యను అలవాటు చేసుకోవాలి. గంటలు గంటలు జిమ్‌లో గడాల్సిన అవసరం లేకుండానే, సింపుల్ చిట్కాలు, చిన్న చిన్న జీవనశైలి సర్దుబాట్లతో ఫిట్నెస్ సాధించవచ్చు.స్మార్ట్ ప్రిపరేషన్బరువు తగ్గడం, ఫిట్‌గా ఉండాలి అనే విషయంలో కూడా కమిట్మెంట్ చాలా ముఖ్యం. ప్లాన్డ్గా, స్మార్ట్‌గా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్నుంచే మన ప్రిపరేషన్ మొదలు పెట్టేద్దాం. ఇందుకు పది నిమిషాలు చాలు. ఉడికించిన గుడ్లు, స్మూతీ, లేదా రాత్రి నానబెట్టిన ఓట్స్ బెస్ట్. వీటిని తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పోషకాలు కూడా ఎక్కువే. ఖచ్చితంగా ఇంతే తినాలని అనుకొని, టిఫిన్ లేదా లంచ్ ప్యాక్ చేసుకుంటే..అతిగా తినే ముప్పు తప్పుతుంది. వ్యాయామం- ఆ 2 నిమిషాలు కనీసం వ్యాయామం శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. రోజులో కనీసం అర్థగంట వ్యాయామానికి కేటాయిస్తే చాలు. అలాగే సుదీర్ఘ వ్యాయామం చేయలేకపోతున్నామన్న దిగులు అవసరం లేదు. రోజంతా రెండు, రెండు నిమిషాలు మినీ వర్కౌట్లు చేయండి. అంటే కాఫీ విరామాలలో స్క్వాట్లు, డెస్క్ స్ట్రెచ్‌లు లేదా లిఫ్ట్‌లకు బదులుగా ఎక్కడం లాంటివి. డెస్క్ వర్క్ అయినా సరే.. ప్రతీ గంటకు ఒకసారి స్వల్ప విరామివ్వడం ముఖ్యం. వీలు, సౌలభ్యాన్ని బట్టి, చిన్న చిన్న డెస్క్ వ్యాయామాలు చేయవచ్చు.అందుకే ఇటీవల చాలా ఐటీ కంపెనీల్లో స్టాండింగ్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రయాణాల్లో రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎయిర్‌పోర్ట్‌లలో సమయం ఉన్నపుడు సాధ్యమైనంత నడవడానికి, నిల్చొని ఉండడానికి ప్రయత్నించండి. ఇవి జీవక్రియను చురుకుగా ఉంచడం తోపాటు, శరీర భాగాల్లో కొవ్వు పేరుకు పోకుండా చేస్తుంది.ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!హైడ్రేషన్: ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్‌ను వెంట తీసుకెళ్లండి. హైడ్రేటెడ్‌గా ఉండటం జీవక్రియను మెరుగు పరుస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. మరింత ఉత్సాహంకోసం నిమ్మకాయ, పుదీనా కలిపిన నీళ్లు, లేదా పల్చని మజ్జిగ తాగండి.“స్నాక్ స్మార్ట్”: వండుకునే టైం లేదనో టైం పాస్ కోసమో, ఆకలిగా ఉండనో, ఎనర్జీ డ్రింక్స్, ప్యాక్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వైపు మళ్లకండి. దీనికి బదులుగా నట్స్, రోస్టెడ్ సీడ్స్, ప్రోటీన్ బార్లు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్ ప్యాక్‌లపై దృష్టిపెట్టండి. వీలైతే వీటిని మీ బ్యాగ్, డెస్క్ లేదా కారులోనో ఉంచుకోండి. వీటి వల్ల పోషకాలు బాగా అందుతాయి. శక్తి లభిస్తుంది. అంతేకాదు దీని వల్ల షుగర్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్, అనారోగ్యకరమైన స్ట్రీట్ ఫుడ్‌కి దూరంగా ఉండొచ్చు. వండుకోవడానికి సమయంలో లేనప్పుడు. తక్కువ సమయంలో, ఎక్కువ ప్రొటీన్డ్ ఫుడ్ తినేలా ప్లాన్ చేసుకోండి. గంటల తరబడి కుర్చీకి, సోఫాకి అతుక్కుపోవద్దు. వీలైనన్నిసార్లు లేచి నడుస్తూ ఉండాలి. ఉదా : ఫోన్ మాట్లాటప్పుడు, టీవీ చూస్తున్నపుడు, పాడ్‌కాస్ట్ వింటున్నప్పుడు నడుస్తూ ఉండాలి. అలాగే భోజనం తరువాత కనీసం 10నిమిషాల నడక అలవాటు చేసుకోండి.ఇలా చేయడం వల్లన యాక్టివ్ఉండటంతోపాటు,రోజంతా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.చదవండి: యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!పోర్షన్ కంట్రోల్: మన తినే ఆహారంలో కొర్బ్స్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. "మైండ్‌ఫుల్ ఈటింగ్" అనేది ముఖ్యం. ఎక్కువ తినకుండా పొట్ట నిండేలా ఉడికించిన కూరగాయ ముక్కలు, మొలకెత్తిన గింజలు, పుచ్చ, బొప్పాయి లాంటి పళ్లకు చోటివ్వండి. కొద్దిగా కొద్దిగా నెమ్మదిగా తినండి. చిన్న ప్లేట్లను ఉపయోగించండి. ఎందుకంటే బిజీగా ఉండేవారు ఆ హడావిడిలో వేగంగా, ఎక్కువగా తినేస్తారు. అలాగని కేలరీలను మరీ అబ్సెసివ్‌గా లెక్కించాల్సిన అవసరం లేదు. పోర్షన్ కంట్రోల్‌పై దృష్టిపెడాలి. అపుడు ఎంత తక్కువ తిన్నా కడుపు నిండిన అనుభూతినిస్తుంది. స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు తినడం మానుకోండి. ఏం తింటున్నామన్న దానిపై దృష్టి పెట్టి శ్రద్ధగా, ఆస్వాదిస్తూ తినండి.గంట కొట్టినట్టు నిద్రపోవాలినిద్ర లేకపోవడం ఆకలి హార్మోన్లను ఉత్తేజితం చేస్తుంది. సమయానికి నిద్రపోవాలి. వారాంతాల్లో కూడా నిద్రవేళకు ఒక నిర్దిష్ట సమయాన్ని సెట్ చేసుకోండి, దానికి కట్టుబడి ఉండండి. చక్కటి విశ్రాంతి తీసుకున్న శరీరం ఎక్కువ బరువు తగ్గేలా ప్రతిస్పందిస్తుంది. సంకల్ప శక్తి పెరుగుతుంది.చీట్ మీల్, ఓకే అప్పుడప్పుడూ వ్యాయామాన్ని మిస్ అయినా, కాస్త ఎక్కువ తిన్నే మరీ ఎక్కువ ఆందోళన చెందకండి. చీట్‌మీల్ అనుకోండి. బిజీ షెడ్యూల్లో అన్నీ అనుకున్నట్టు ప్రణాళిక ప్రకారం జరగవు అని సర్దుకుపోండి. మిస్ అయిన వ్యాయాన్ని మరునాడు సర్దుబాటు చేసుకోండి. అంతే... అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం మీ సొంతం.నోట్: ఇవి అవగాహనకోసం అందించిన చిట్కాలు మాత్రమే. ఎవరి శరీరాన్నివారు అర్థం చేసుకొని, ప్రేమించాలి. బరువు తగ్గడం అనేది ఎవరికి వారు నిశ్చయించుకొని, స్వీయ క్రమశిక్షణతో, పట్టుదలగా చేయాల్సిన పని అని మర్చిపోవద్దు. -
Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!
అధిక బరువు సమస్య కొంతమందిని వేధిస్తే, ముందుకు పొడుచుకు వచ్చిన బాన పొట్ట మరికొంతమందిని బాధిస్తుంది. కానీ మన ఇంట్లోనే, మన పోపుల పెట్టెలోనే సులువుగా లభించే దినుసులతో బెల్లి ఫ్యాట్‌ను కరిగించుకోవచ్చు. అదెలాగో ఇవాల్టి ‘టిప్ ఆఫ్ ది డే’ లో భాగంగా తెలుసుకుందాం.బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకునేందుకు సోంపు, జీలకర్ర, ధనియాలతో చేసిన కషాయం బాగా పనిచేస్తుందని ఆయుర్వేదనిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కషాయం త్రాగడం వలన జీర్ణక్రియ మెరుగు పడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది, శరీరంలో మంటను తగ్గిస్తుంది.ఎలా తయారుచేసుకోవాలిరెండు స్పూన్ల ధనియాలు, రెండు స్పూన్ల సోంపు, రెండు స్పూన్ల జీలకర్ర4 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఇందులో జీలకర్ర, సోంపు, ధనియాలు వేసి 10-15 నిమిషాలు ఉడికించాలి. బాగా మరిగిన తరువాత ఈ కషాయాన్ని వడపోసుకోవాలి. ఉదయాన్నే పరగడుపున (empty stomach)న తాగాలి. కనీసం మూడు నెలల పాటు క్రమం తప్పకుండా ఇలా చేస్తే ఎంత వేలాడే పొట్ట అయినా సరే ఫ్లాట్‌గా మారిపోతుంది.మరిన్నిలాభాలుజీర్ణక్రియకు మంచిది, తద్వారా బరువు తగ్గుతుంది.గట్ హెల్త్ మెరుగుపడుతుంది. గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. దీని వలన అనేక సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం అనేక సమస్యలకు మూలం. సోంపు, జీలకర్ర, ధనియాలలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.చర్మం ప్రకాశం వంతంగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు మటుమాయవుతాయి.ఇది మర్చిపోవద్దు : అయితే ఈ కషాయం తాగుతున్నాం కదా అని ఆహార నియమాల పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ చిట్కాను పాటిస్తూనే, కొద్ది సేపు నడక, కొవ్వు పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. తగినన్ని నీళ్లు సేవించాలి. రాత్రి భోజనం తొందరగా ముగించాలి. ప్రతీ భోజనం తరువాత కనీసం పది నిమిషాలు నడిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించడం ఖాయం.నోట్: ఈ ప్రక్రియ కొందరికి వారి వారి బాడీ మెటబాలిజాన్ని బట్టి కొంచెం ఆలస్యం కావచ్చు ఓపిగ్గా ప్రయత్నించాలి. బరువుతగ్గాలంటే ఆ మాత్రం ఓపిక తప్పదు మరి. అలాగే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఈ నీటిని త్రాగే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఇదీ చదవండి: Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్ -
Today tip ఆరోగ్యానికి వెరీ ‘గుడ్డూ’.. ఎగ్స్ట్రా వెరైటీస్ ట్రై చేశారా?
గుడ్డు అనగానే ఆవిరిపై ఉడికించుకోవడం దగ్గర నుంచి ఆమ్లెట్– బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవడం వరకే మనకు తెలిసిన రుచులు! మరి ఎప్పుడైనా కొత్తగా సరికొత్తగా ప్రయత్నించి చూశారా? ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా గుడ్డుతో చేసుకునే వెరైటీలను చూద్దాం. చేసేద్దాం.. ఆరోగ్యానికి ఇవి వెరీ గుడ్డూ! ఇంకెందుకు ఆలస్యం? ఇలా ట్రై చేయండి. ఎగ్ మోమోస్కావలసినవి: మైదాపిండి – 2 కప్పులు; గుడ్లు – 5; ఉల్లిపాయ ముక్కలు – ఒక టేబుల్ స్పూన్; పచ్చిమిర్చి – 3 (సన్నగా తరిగినవి); అల్లం–వెల్లుల్లి పేస్ట్-ఒక టీ స్పూన్; కొత్తిమీర తరుగు-2 టేబుల్ స్పూన్లు; క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము– పావు కప్పు చొప్పున; సోయా సాస్›– ఒక టీ స్పూన్; మిరియాల పొడి – అర టీ స్పూన్; నూనె, నీళ్లు, ఉప్పు – సరిపడాతయారీ: ముందుగా ఒక పెద్ద గిన్నెలో మైదాపిండి, ఉప్పు వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చపాతీపిండిలా కలుపుకోవాలి. చివరగా ఒక టీస్పూన్ నూనె వేసి పిండిని మరోసారి బాగా కలిపి, తడి వస్త్రంతో కప్పి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకుని, నూనె వేడయ్యాక, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు గరిటెతో తిప్పాలి. పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము వేసి 2–3 నిమిషాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు గుడ్లు వేసుకుని బాగా కలిపి, రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో సోయా సాస్, మిరియాల పొడి, తగినంత ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి, చల్లారనివ్వాలి. ఈలోపు మైదా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకుని.. ఒక్కో గరిటె ఎగ్ మిశ్రమాన్ని వేసుకుని, మోమోస్లా చుట్టుకోవాలి. ఇప్పుడు వాటిని ఆవిరిలో ఉడికించుకుంటే సరిపోతుంది.ఎగ్ చాట్ కావలసినవి: గుడ్లు- 2 (ఉడికించినవి); ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు – అర కప్పు చొప్పున; జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు – పావు టీస్పూన్ చొప్పున; కారం, చాట్ మసాలా – అర టీస్పూన్ చొప్పున; కొత్తిమీర తరుగు, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్ చొప్పున; ఉప్పు, నూనె – సరిపడా; కొత్తిమీర–పచ్చిమిర్చిలతో చేసిన కారం పచ్చడి లేదా సాస్ – 2 టేబుల్ స్పూన్లు; కారప్పూస – 2 టేబుల్ స్పూన్లపైనే.తయారీ: ముందుగా గుడ్లను ఉడికించి, పైపెంకు తీసి, నిలువుగా కట్ చేసుకోవాలి. గుడ్డు పసుపు సొనను తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు పాన్ మీద కొద్దిగా నూనె వేసుకుని, వేడి కాగానే జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, కారం, చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు వేసుకుని గుడ్డు ముక్కలను ఇరువైపులా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు సొనను అదే నూనెలోవేసి పొడి పొడిడిగా చేసుకుని పెట్టుకోవాలి. అనంతరం ఆ గుడ్డు ముక్కల్లో కొత్తిమీర– పచ్చిమిర్చి పచ్చడి లేదా సాస్ కొద్దికొద్దిగా వేసుకుని, పైన, కొద్దికొద్దిగా పసుపు సొన మిశ్ర మం, ఉల్లిపాయ ముక్కలు, టమోటో ముక్కలు, కొత్తిమీర తురుగు, కారప్పూస ఒకదాని తర్వాత ఒకటి నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.ఎగ్ బన్స్ కావలసినవి: గుండ్రటి టమాటో ముక్కలు, గుండ్రటి బన్నులు, గుడ్లు -6, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు - కొద్దిగా; క్యారెట్ తురుము -పావు కప్పు; మిరియాల పొడి, ఎండు మిర్చి కచ్చాబిచ్చా మిశ్రమం-కొద్దికొద్దిగా; చీజ్ తురుము, బటర్ – సరిపడాతయారీ: ముందుగా బన్నులను పైన గుండ్రంగా చిన్న భాగం కట్ చేసుకుని, లోపలున్న బ్రెడ్‌ను తొలిచి, కప్పు మాదిరి మార్చుకోవాలి. ఇప్పుడు ప్రతి బన్‌లో ఒక్కో టమోటో ముక్క వేసుకుని, మిరియాల పొడి జల్లుకుని, కొద్దికొద్దిగా క్యారెట్ తురుమును అందులో పరచుకోవాలి. ఇప్పుడు ప్రతి బన్‌లో ఒక్కో గుడ్డు కొట్టుకుని వేసుకోవాలి. తెల్లసొన లోపలికి ఇంకిపోయి, పసుపు సొన పైకి కనిపిస్తూ ఉంటుంది. ఇక దాని చుట్టూ చీజ్ తురుము పరుచుకుని, పైన కచ్చాబిచ్చా చేసిన ఎండుమిర్చి పౌడర్‌ను వేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో సరిపడా బటర్ కరిగించి, స్టవ్ చిన్న మంట మీద పెట్టుకుని, పాన్‌లో బన్నులను వరసగా పెట్టుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. బన్స్లో గుడ్డు ఉడికి, చీజ్ కరిగి గట్టిగా మారిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. -
Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్
భారతదేశంలో అత్యంత చౌకగా లభించే తృణధాన్యం.దీన్నే ఆంగ్లంలో ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు.ఈ చిరు ధాన్యాలలో కాల్షియం, ఇనుము , విటమిన్లు బి1 నుండి బి3 లాంటి పోషకాలు మెండుగా లభిస్తాయి. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా రాగా మాల్ట్ లేదా రాగి జావ ఎలా తయారు చేయాలో చూద్దాం.మొలకలతో పిండి రాగి మాల్ట్ తయారు చేయడానికి రాగులను నానబెట్టి, మెత్తని బట్టలో కట్టిపెట్టి, మొలకెత్తించి, నీడలో ఎండబెట్టి, పిండిగా తయారు చేసుకోవాలి. మొలకెత్తిన రాగులతో తయారుచేసిన రాగి మాల్ట్ మరింత పోషకమైనది, సులభంగా జీర్ణమయ్యేది కాబట్టి. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా దీన్ని నిస్సంకోచంగా తీసుకోవచ్చు.రాగి మాల్ట్ తయారీస్టవ్ మీద పాన్ లేదా కుండలో రెండు కప్పుల నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ లోపు ఒక కప్పు నీళ్లలో రాగుల పిండి జారుగా కలుపుకోవాలి.నీళ్లు మరుగుతున్నపుడు కలిపిన రాగిపిండిని పోసి, ముద్దలు లేకుండా తరచుగా కలుపుతూ ఉడికించుకోవాలి. మిశ్రమం కాస్త చిక్కగా గరిటె జారుగా అయ్యేలా చూసుకోవాలి.ఇందులో మజ్జిగ, ఉప్పు కలుపుకొంటే కమ్మటి రాగి జావ రెడీ.ఇందులో ఇష్టమున్న వారు బెల్లం, నెయ్యికలుపుకొని తాగవచ్చు. అలాగే ఉడికించే నీళ్లలో కొంచెం పాలనుకూడా కలుపుకోవచ్చు.ఇంకా బాదం పౌడర్ లేదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ లేదా సన్నగా తరిగిన ముక్కలతో గార్నిష్‌తో చేస్తే పిల్లలకు చాలామంచిది. రాగుల జావ, ఆరోగ్య ప్రయోజనాలురాగి జావలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది బాడీకి శక్తినిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.రాగి జావలో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, సాయ పడుతుంది.మధుమేహాన్ని నియంత్రిస్తుంది: రాగి జావలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.రాగి జావలో కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలను బలపరుస్తుంది.రాగి జావలో ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనతను నివారిస్తుంది.రాగి జావలో ఉండే పోషకాలు జుట్టు రాలడం నివారించడంలో సహాయపడతాయి.రాగి జావలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.రాగి జావను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం మంచిది. లేదా, భోజనానికి ముందు లేదా తర్వాత తాగవచ్చు. -
Today Tips టైగర్ దోమ- డెంగ్యూ ఫీవర్, ఈ జాగ్రత్తలు మస్ట్!
Monsoon Health Care వర్షాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు దండెత్తుతాయి. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి వ్యాప్తికి ఈ సీజన్ చాలా అనుకూలమైంది. ఎందుకంటే దోమలు ఈ సమయంలో బాగా వృద్ధి చెందుతాయి. డెంగ్యూ అనేది దోమల ద్వారా వ్యాపించే ఒక వైరల్ వ్యాధి, ఇది తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ప్రాణాపాయం ముప్పు కూడా ఉంది. అందుకే ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా డెంగ్యూపై అవగాహనకు సంబంధించిన టిప్స్ తెలుసుకుందాం.వర్షాకాలంలో దోమల వ్యాప్తి అధికంగా ఉంటుందన్నారు. ఏడిస్ జాతికి చెందిన టైగర్ అనే దోమ మంచి నీటిలో వృద్ధి చెంది పగటి సమయంలో దాడి చేస్తుంది. ఏడిస్ (Aedes) జాతికి చెందిన దోమలలో టైగర్ దోమ (Asian Tiger Mosquito) ఒకటి. దీని శాస్త్రీయ నామం ఏడిస్ ఆల్బోపిక్టస్ (Aedes albopictus). ఇది నలుపు, తెలుపు చారలతో ఉంటుంది, అందుకే దీనిని పులి దోమ అని కూడా పిలుస్తారు. ఈ దోమల కాటు వల్ల ప్రాణాంతక డెంగ్యూ జ్వరం వ్యాప్తి చెందుతుందన్నారు. దోమల వ్యాప్తిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.సాధారణంగా 8-10 రోజుల పాటు వేధించే వ్యాధి.దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. అయితే చాలా వరకు డెంగ్యూ లక్షణాలు సాధారణ జ్వరాన్ని పోలి ఉండడంతో మొదట్లో గుర్తించడం కష్టంగా ఉంటుంది. అయితే నిర్లక్ష్యం చేస్తే కొన్ని సందర్భాల్లో అది ప్రాణాపాయానికి కూడా దారి తీస్తుంది.వర్షపు నీరు నిలిచిపోవడంతో దోమలు వృద్ధి చెందుతాయి. ఈ కాలంలో దోమలు చాలా చురుకుగా ఉంటాయి . ఎక్కడ నిల్వ నీరు, మురుగు నీరు కనిపించినా గుడ్లు పెట్టేస్తాయి. సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయానికి ముందు దోమలు ఎక్కువగా యాక్టివ్ గా ఉంటాయనేది గమనించాలి.. డెంగ్యూ -తీసుకోవలసిన చర్యలుపరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.నిలిచిపోయిన నీటిని తొలగించాలి. ప్లాస్టిక్ డబ్బాలు, పాత తొట్టెలు , బండి టైర్లలో నీళ్లు నిల్వలేకుండా చూసుకోవాలి. దోమల నివారణకు దోమతెరలు, స్ప్రేలు వాడాలి.డెంగ్యూ వైరస్ సోకిన రోగిని కుట్టిన తర్వాత దోమ ఆ వైరస్‌ను తీసుకెళ్లి ఆరోగ్యంగా ఉన్న మరో వ్యక్తిని కుట్టినప్పుడు ఈ వ్యాధి వ్యాపిస్తుంది కనుక అప్రమత్తంగా ఉండాలి.వర్షాకాలంలో వీలైనంతవరకు ఇంట్లోనే ఉంటూ, పోషకాహారాన్ని తీసుకోవాలి. వేడి వేడి, శుభ్రమైన ఆహారాన్ని భుజించాలి. జ్వరం, ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి డెంగ్యూ జ్వరం లక్షణాలు:అధిక జ్వరంతీవ్రమైన తలనొప్పికను రెప్పల చుట్టూ నొప్పికండరాలు, కీళ్ల నొప్పులు, చిగుళ్లలో రక్తస్రావం,వికారం , వాంతులు,తీవ్రమైన అలసట, చర్మంపై దద్దుర్లునోట్: వర్షకాలంలో జ్వరాలు, వైరల్ ఫీవర్లు, జలుబు, గొంతు నొప్ప సహజం. ప్రతీ చిన్న జ్వరానికి భయపడకూడదు. అలాగని నిర్లక్ష్యమూ తగదు. జ్వరం తీవ్రత,లక్షణాలను బట్టి తక్షణమే వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లోని పిల్లలు, వృద్ధుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. -
Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్ తప్పవు మరి!
చిరు జల్లుల, హోరు వానలతో వర్షాకాలం హాయిగా మనల్ని పలకరించేసింది. ఒళ్లంత తుళ్లింత కావాలిలే.. గుండెల్లో జల్లంతా కురవాలిలే! అన్న మురిపెం మాత్రమే కాదు ఇది వ్యాధులు ముసురుకునే కాలం కూడా. వైరస్లు, బ్యాక్టీరియా విజృంభించే కాలం. ఇన్ఫెక్షన్లు చాలా తొందరగా వ్యాపిస్తాయి. ఫలితంగా వైరల్ ఫీవర్లు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కలరా, టైఫాయిడ్ ముసిరే అవకాశం ఉంది. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డే లో భాగంగా వర్షకాలంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.వేసవి తర్వాత వాతావరణంలో జరిగే మార్పులు, రుతుపవనాలు మార్పుల తదితర కారణా లరీత్యా సీజనల్ వ్యాధులు దాడిచేస్తాయి.ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.ఎడతెరపి లేని వర్షాలు, వాటివల్ల నిల్వ ఉండే నీటిలో దోమలు ఆవాసాలను ఏర్పరచుకోవడం, రోడ్లపై మురిగిన నీరు ఉండటం.. ఇలా రకరకాల కారణాల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.నీటికుంటలో, కాలువల్లో, ఇంటి పరిసరాల్లో నీరు చేరకుండా చూసుకోవాలి. నిల్వ ఉన్న నీరు దోమలకు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలకు సంతానోత్పత్తి నిలయంగా మారి,వ్యాధులకు కారణమవుతాయి.దోమల డెంగ్యూ, మలేరియా టైపాయిడ్ తో పాటు గాలి ద్వారా వ్యాపించే జబ్బులు జలుబు, గొంతునొప్పి వస్తాయి. (Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే)వర్షాల వల్ల నీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే శుభ్రమైన, కాచి చల్లార్చిన నీటిని తాగడం మంచిది. గోరువెచ్చని నీటిని తాగితే ఇంకా మంచిది.తాజాకూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఆకుకూరలు వాడేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. శుభ్రంగా కడిగి, బాగా ఉడికించి తీసుకోవాలి.బయట ఫుడ్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంట్లోనే తయారు చేసుకున్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కలుషిత ఆహారం ద్వారా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకే వీలైనంతవరకు స్ట్రీట్ ఫుడ్ తినడం మానుకోవాలి.ఆహారానికి తీసుకునేముందు ముందు చేతులు కడుక్కోవాలి.ఏదైనా తినడానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఈ చిన్న అలవాటు మిమ్మల్ని ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్ నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా పిల్లలకు దీన్ని బాగా అలవాటు చేయాలి.రాత్రి పూటదోమలు కుట్టకుండా దోమతెరలు వాడటం మంచిది. బాగా చల్లగా ఉన్నపుడు శరీరం వెచ్చగా ఉండేలా ఉన్ని దుస్తులు ధరించాలి.పోషకాహారం ఆహారంపై శ్రద్ధపెట్టాలి. రోగనిరోధక శక్తి బలపడేలావిటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినాలి. ఇవి వ్యాధులు రాకుండా నివారిస్తాయి.వర్షం అనగానే సంబరపడిపోయే పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక వేళ వర్షంలో తడిచినా, వెంటనే శుభ్రంగా తుడిచి పొడి బట్టలు వేయాలి. ముఖ్యంగా తల తడి లేకుండా చూసుకోవాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా అనారోగ్యం తప్పదు.ఇదీ చదవండి : కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియోపిల్లల్లో జలుబు, చిన్నపాటి జ్వరాల నుంచి కాపడడానికి అల్లం, తులసి, వామ్ము ఆకులతో చేసిన కషాయానికి కొద్దిగా తేనె కలిపి ఇస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.నోట్ : ఈ జాగ్రత్తలు పాటిస్తూనే ఎలాంటి అనారోగ్య లక్షణాలు కన్పించినా వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే
జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి ఇది అందరికీ తెలిసిన విషయమే. పోషకాలు మెండుగా ఉండే జామ పండుతో ప్రయోజనాలు పొందవచ్చ. కానీ జామ ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా జామ ఆకులు ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.జామ ఆకుల్లో అధిక మొత్తంలో ట్యానిన్స్, ఆక్సలేట్స్ ఉంటాయి. అందువల్ల నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలినా లేదా లేత ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిట పట్టినా మంచి ఫలితాలను పొందవచ్చు. జామ ఆకులు జుట్టుకి దివ్యౌషధంలా పని చేస్తాయి.జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదపడతాయి. సరిపడా జామ ఆకుల్ని శుభ్రం చేసుకుని తగినన్ని నీరు పోసి 15 నిముషాలసేపు మరిగించాలి. చల్లారాక ఆ నీటిని తలపై నెమ్మదిగా అప్లై చేస్తూ బాగా మర్దనా చేయాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. తరచుగా ఇలా చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లు గట్టిపడి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.జామ ఆకులు ఆరోగ్యానికి ముఖ్యంగా, ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, బరువు తగ్గడానికి సహాయపడతాయి జామ ఆకు టీ తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. తద్వారా అధిక బరువునుంచి బయటపడవచ్చు.(Today tip : ఈజీగా బరువు తగ్గాలంటే ఇవిగో ఆసనాలు)వీటిల్లోని అధిక యాంటీఆక్సిడెంట్లు ,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి.జామ ఆకులలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడతాయి మరియు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను తగ్గిస్తాయి,జామ ఆకు టీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.జామ ఆకులలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గిస్తాయి.నోట్ : ఇవి అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే అని గమనించగలరు. వీటిని వాడేముందు,వాడిన తరువాత ఏదైనా సమస్యలొచ్చినా వైద్యుడిని సంప్రదించిన తర్వాతే జామ ఆకులను ఉపయోగించడం మంచిది. -
Today Tip : షుగర్ పేషెంట్లు ఎగ్స్ తినవచ్చా? ఎన్ని తినవచ్చు?
షుగర్ (diabetes) అనేది దీర్ఘకాలిక వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే.. ఇక అంతే సంగతులు జీవితాంతం మనల్ని వీడిపోదు అనేది ఒకప్పటి మాట. లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి ఆహార నియమాలు, వ్యాయామంతో పూర్తిగా నియంత్రణలోకి వస్తుందని అనేది ఇప్పటి మాట. అయితే డయాబెటిస్ రాకుండానే జాగ్రత్తపడాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆహారం విషయంలోనూ, వ్యాయామం విషయంలోనే అలసత్వం ప్రదర్శించకూడదు. అయితే ఎలాంటి ఆహారాలు తినాలి? ఎలాంటి ఆహారాలు తీనకూడదు అనే సందేహం చాలామందిని పట్టి పీడిస్తుంటుంది. మరి ఇవాల్టి టిప్ ఆఫ్ ది డే లో భాగంగా షుగర్ ఉన్న వారు ఎగ్స్ (Eggs) తినొచ్చా, ఒకవేళ తింటే ఎలా తినాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.కోటడిగుడ్లలో బయోటిన్, పొటాషియం, యాంటి యాక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే చాలా గ్లైసెమిక్ ఇండెక్స్ , కార్బొహైడ్రేట్స్ తక్కువగానూ ప్రోటీన్ ఎక్కువగానూ ఉంటుంది. ఈ రెండూ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో తోడ్పడతాయి. కాబట్టి గుడ్లును నిరభ్యంతరంగా తినవచ్చు. మధుమేహం ఉన్నవారికి ప్రోటీన్ అధిక మూలాన్ని అందిస్తుంది. కనుక చక్కగా తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలపై పెద్దగా ప్రభావం ఉండదు.గుడ్లలోని కొలెస్ట్రాల్ కంటెంట్ గురించి ఆందోళన అవసరం లేదని, అయితే మితంగా తినడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అంటే వారానికి మూడు రోజుల పాటు రోజుకొకటి చొప్పున తినొచ్చు. అయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నవారు రెండు ఎగ్ వైట్స్ తింటే సరిపోతుంది.అలాగే, గుండె సమస్యలు, కిడ్నీ ,ఇతర సమస్యలున్న వారు ఎగ్స్ తినే విషయంలో వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.నోట్ : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. షుగర్‌లో ఉండే రకాలను బట్టి, వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి డయాబెటిస్తో బాధపడేవారు ఏం తినాలి అనేది ఆధారపడుంది. ఇలాంటి నిర్ణయాలు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. అయితే ఒత్తిడిలేని జీవితం, నీళ్లు తాగడం, నిద్ర, తాజా కాయగూరలు, పళ్లు, సిరిధాన్యాలతో చేసిన వంటలు, కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. క్రమం తప్పని వ్యాయామం, రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకోవడం మధుమేహం రోగులకు చాలా అవసరం. -
Today tip : ఈజీగా బరువు తగ్గాలంటే ఇవిగో ఆసనాలు
యోగా మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం తప్పకుండా యోగాను సాధన చేయడం వలన సుదీర్ఘ అనారోగ్యాలనుంచి బయటపడటం సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఆధునిక కాలంలో పెద్ద సమస్యగామారిన అధిక బరువును కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల ద్వారా సులువుగా తగ్గించుకోవచ్చు. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా వాటిలో కొన్నింటిని చూద్దాం. సూర్య నమస్కారాలు, విన్యాస యోగ, ఉత్కటాసన, ఉష్ట్రసన, సేతు బంధాసన, తడసన , నవాసన వంటివి బరువు తగ్గడానికి, కొన్ని యోగాసనాలు సహాయపడతాయి.సూర్య నమస్కారాలు: బరువు తగ్గడానికి హృదయ సంబంధ ఆరోగ్యానికి సహాయపడతాయి. విన్యాస యోగ: కేలరీలను బర్న్ చేయడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది,. ఉత్కటాసన: ఈ ఆసనం కాళ్ళు , తుంటిని బలోపేతం చేస్తుంది, పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఉష్ట్రాసన: ఒంటె భంగిమ, ఇది బరువు తగ్గడానికి సహాయపడే ఒక సమగ్ర వ్యాయామం,. సేతు బంధాసన: ఈ ఆసనం బరువు నిర్వహణకు సహాయపడుతుంది. తడాసన: ఇది పర్వత భంగిమ అంటారు. బాలెన్స్‌ను, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నవాసన: ఇది పొత్తికడుపు బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ధనూరాసన: వెన్ను, ఛాతి, నడుము, చేతులు, పొత్తి కడుపు, కాళ్లకు మేలు జరుగుతుంది. ఫిట్నెస్ మెరుగవుతుంది. ధనస్సులా శరీరానికి వంచే ఫ్లెక్సిబులిటీ పెరిగి జీవక్రియ వేగవంతమై వెయిట్ లాస్‌కు ఈ యోగాసనం తోడ్పడుతుంది.వీటితో పాటు ఆహార నియమాలు, నడక లాంటి చిన్నపాటి వ్యాయామాలు చేస్తే మరింత త్వరగా ఫలితం లభిస్తుంది. యోగా ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతిమంగాఇవన్నీ బరువు తగ్గడానికి సహాయపడతాయి.యోగాసనాలు ఎలా వేయాలి అనేది యోగా నిపుణుల ద్వారాగానీ, నమ్మకమైన యాప్ ద్వారా గానీ నేర్చుకోవాలి. -
Today tip ఇలాంటి దివ్యౌషధం ఈ భూమ్మీద మరొకటి లేదు!
నిద్రను మించిన సుఖం లేదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆవేదనలనుంచి అలసటనుంచి ఎంతో ఉపశమనాన్నిస్తుంది. అందుకే కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది అంటాడో సినిమా కవి.మరో విధంగా చెప్పాలంటే ఈ భూమి మీద అత్యంత బలమైన ఔషధం నిద్ర. కానీ ఆధునిక కాలంలో నిద్ర అనేది చాలామంది అందని ద్రాక్షలా మిగిలిపోతోంది.మారుతున్న జీవన శైలి, నిద్రలేమి ప్రభావం యువతమీద , ఉద్యోగుల మీద తీవ్రంగా ఉంటోంది. జీవగడియారం సరిగా నడవడానికి నిద్ర ఎంత ముఖ్యమో తెలుసా? పదండి ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా నిద్రప్రయోజనాలు, పరిష్కారాలు తెలుసుకుందాం.నిద్ర అంటే ఏమిటి?నిద్ర అంటే శరీరం , మెదడు విశ్రాంతి తీసుకోవడానికి అనుమతించే ఒక సాధారణ శరీర ప్రక్రియ. రాత్రిపూట నిద్ర వల్ల అనేక ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అఇయతే కళ్లు మూసుకోగానే నిద్రలోకి జారిపోయే అదృష్టవంతులకు ఇది చాలా సులభం అనిపించినా, నిద్రాదేవత అనుగ్రహించని వారి బాధలు అన్నీ ఇన్నీ కావు. వ్యాయామం ,సమతుల్య ఆహారం లాగానే నిద్ర కూడా మన ఆరోగ్యానికి చాలా అవసరం నిద్రలేమితో మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. అలాగే అప్పుడే పుట్టిన పిల్లలకు 18 గంటలు , చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలని, టీనేజర్లకు 10 గంటలు నిద్రపోవాలని అంటారు నిపుణులు. మంచి నిద్ర మెదడును ఉత్తేజ పరుస్తుంది. మరుసటి రోజు పనికి ఉత్సాహాన్ని ఇస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. విసెరల్ కొవ్వును కరిగిస్తుంది.DNA నష్టాన్ని సరిచేస్తుంది . కొత్త మెదడు కణాలను ఉత్పత్తి చేస్తుంది.మంచి నిద్రకోసం చిట్కాలుమంచినిద్ర కావాలంటే జీవన శైలి సక్రమంగా ఉండాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది.నిద్రవేళకు 3 గంటలలోపు వ్యాయామం చేయాలనేది గుర్తించుకోండిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు , కంప్యూటర్ల నుండి వెలువడే నీలిరంగు కాంతి నిద్రను ప్రభావితం చేస్తుంది. కనుక పడుకునే ముందు కనీసం ఒక గంట ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను దూరం పెట్టేయాలి.వేడి నీటి స్నానం, పుస్తకం పఠనం, ప్రశాంతమైన సంగీతం వినడంతోపాటు నిద్రకు ముందు కెఫిన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి.పడకగదిని నిద్రకు అనుకూలంగా అంటేగదిని చీకటిగా, ప్రశాంతంగా, వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవాలి.ధ్యానం , యోగా, శ్వాస వ్యాయామాలు నిద్రకు సహాయపడతాయి.మంచినిద్ర కావాలంటే డి విటమిన్ చాలా అవసరం పగటి నిద్ర రాత్రి నిద్రకు చేటు. రాత్రి పూట హెవీ మీల్ తినవద్దుసాయం చేసే ఆహారంపైన చెప్పిన జాగ్రత్తలతోపాటు పడుకునే ముందు 1 ఔన్స్ టార్ట్ చెర్రీ రసం లేదా రోజుకు రెండుసార్లు టార్ట్ చెర్రీస్ తినవవచ్చు.పుట్టగొడుగులు,సాల్మన్, ట్యూనా చేపలు సహజంగా మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి.ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు కెమిస్ట్రీని ఆప్టిమైజ్ చేస్తాయి.పాలీఫెనాల్ అధికంగా ఉండే బెర్రీలు (బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్, బ్లాక్బెర్రీస్) తీసుకోవచ్చు. ఆరోగ్యవంతమైన సెక్స్ తరువాత కూడా మంచి నిద్ర పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు.నోట్ : ఎంత ప్రయత్నించినా నిద్రలేమి లేదా ఇతర నిద్ర సంబంధిత సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. కారణాలను విశ్లేషించుకుని తగిన చికిత్స తీసుకుంటే నిద్రా దేవి ఒడిలో ఒరిగిపోవడం ఖాయం. -
Beauty Tips ఆలూతో అందం : అదిరిపోయే చిట్కాలు
దుంపకూరల్లో దాదాపు అందరూ ఇష్టపడే దుంప ఆలుగడ్డ. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు. ముఖ సౌందర్యానికి, చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డే లో భాగంగా సౌందర్య పోషణలో ఉపయోగ పడే పొటాటో చిట్కాల గురించి తెలుసుకుందాం.బంగాళాదుంప ప్రయోజనాలుబంగాళాదుంప లేదా ఆలుగడ్డ లేదా పొటాటో విటమిన్-సీ(vitamin C) పుష్కలంగా లభిస్తుంది. ఇది మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనికి హైపర్పిగ్మెంటేషన్ , డార్క్ స్పాట్స్‌ని తగ్గించి చర్మాన్ని కాంతివంతం చేసే సామర్థ్యాలులున్నాయి. కాటెకోలేస్ , కోజిక్ యాసిడ్ వంటి సహజ సమ్మేళనాలను మెలనిన్ ఉత్పత్తిని నిరోధిస్తాయి.. బంగాళాదుంప రసం లేదా "బంగాళాదుంప ఫేస్ మాస్క్" ని క్రమం తప్పకుండా వాడడం వల్ల ఈ అవాంఛిత మచ్చలు క్రమంగా తగ్గుతాయి. బంగాళాదుంపలలోని అధిక నీటి శాతం సున్నితమైన కంటి ప్రాంతాన్ని హైడ్రేట్ చేయడానికి ,డీ-పఫ్ చేయడానికి సహాయపడుతుంది.తే సహజ పిండి పదార్ధం చర్మాన్ని బిగుతుగా ,ప్రకాశవంతం చేయడానికి సున్నితమైన ఆస్ట్రింజెంట్‌గా పనిచేస్తుంది. బంగాళాదుంప ముక్కల్ని గానీ, బంగాళాదుంప ఆధారిత ఐ మాస్క్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల అలసిపోయిన, ఉబ్బిన కళ్ళకు ప్రశాంతత లభిస్తుంది. రిఫ్రెష్‌గా ఉంటాయి.బంగాళాదుంపలు ఫ్లేవనాయిడ్లు , ఫినోలిక్ ఆమ్లాలు వంటి సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలను కలిగి ఉంటాయి.ఇవి మొటిమలకు చక్కటి పరిష్కారంగా పని చేస్తాయి. తామర లేదా ఇతర చర్మ పరిస్థితులతో సంబంధం ఉన్న ఎరుపు, వాపు , చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. ఎక్కువ చలివలన లేదా సూర్యరశ్మి వలన కమిలిన చర్మానికి కూడా ఉపశమనం లభిస్తుంది. బంగాళాదుంప రసం లోని స్టార్చ్ కంటెంట్ చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది.ఆలూ రసం, తేనెతో వేసుకునే ఫేస్ ప్యాక్ చర్మాన్ని సున్నితంగా కాంతివంతంగా చేస్తుంది. సూర్యరశ్మి, మొటిమలు లేదా వృద్ధాప్యం వల్ల కలిగే నల్ల మచ్చల రూపాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఎలా వాడాలి?డార్క్ సర్కిల్స్ : తాజా బంగాళాదుంపను సన్నని ముక్కలుగా కట్ చేసి నేరుగా కంటి కింద నల్లగా ఉన్న ప్రాంతంలో ఉంచండి. బంగాళాదుంప ముక్కలను 15-20 నిమిషాలు అలాగే ఉంచండి, తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. సున్నితమైన కంటి ప్రాంతాన్ని మరింత ఉపశమనం చేయడానికి మరియు హైడ్రేట్ చేయడానికి కొన్ని చుక్కల కలబంద జెల్‌ను చర్మంపై సున్నితంగా మసాజ్ చేయండి.బంగాళాదుంప, ఓట్మీల్, మిల్క్ స్క్రబ్: మీడియం-సైజ్ బంగాళాదుంపను తురుము , 2 టేబుల్ స్పూన్ల రోల్డ్ ఓట్స్ , 1 టేబుల్ స్పూన్ పాలతో కలపండి. ఈ స్క్రబ్‌ను ముఖంపై అప్లయ్ చేసి, సున్నితంగా మసాజ్ చేయండి. ఆరిన తరవుఆత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటేచక్కటి షైనింగ్ వస్తుంది. బంగాళాదుంప ఫేస్ మాస్క్ : బంగాళాదుంప, శనగపిండి , నిమ్మకాయ ఫేస్ వాష్: బంగాళాదుంప తురుము, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి ,సగం నిమ్మకాయ రసం కలిపి ముఖానికి రాసుకుని ఆరిన తరువాత సున్నితంగా వాష్ చేసుకోవాలి. ఫేస్ మురికిని తొలగించి, సూదింగ్ ఫీలింగ్ ఇస్తుంది. నోట్ : అవగాహన కోసం అందించిన సలహాలు మాత్రమే. తీవ్రమైన సమస్యలకు వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం. ఆలూ ఎలర్జీ ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. -
Today tips పండంటి కాపురానికి పక్కా లెక్కలు, చిట్కాలు
ఇటీవలి కాలంలో వివాహ బంధం మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్న సంఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. రెండు మనసులు కలిసి కలకలం సంతోషంగా జీవించాల్సిన జంటలు పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నాయి. చివరికి ఒకర్నొకరు అంతం చేసుకుంటున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అన్నట్టు దంపతులు హాయిగా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉండాలంటే ఏం చేయాలి? టిప్ ఆఫ్ ది డే లో భాగంగా అన్యోన్యమైన పండంటి కాపురానికి పాటించాల్సిన లెక్కలు, టిప్స్ తెలుసుకుందాం.ఏ బంధానికైనా విశ్వాసం, నమ్మకం బలమైన పునాదిగా ఉంటాయి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగం ఉన్నపుడు భార్యభర్తల బంధం కూడా నూరేళ్లు కొనసాగుతుంది. భార్యభర్తలంటే కలహాలు ఉండవని కాదు, బేధాభిప్రాయాలు ఉండవనీ కాదు. కానీ ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకోవాలి.ఒకరి పొరబాట్లను, తప్పులను అర్థం చేసుకోవాలి. నాదే పంతం, అన్నట్టుగా కాకుండా, సమయానికి తగు.. అన్నట్టు సర్దుకుపోవాలి. ఒక్కోసారి వెనక్కి తగ్గాలి. అవసరమైత రాజీ పడాలి. అదే అందమైన దాంపత్య జీవితానికున్న అర్థం పరమార్థం.చదవండి: నో డైటింగ్, ఓన్లీ జాదూ డైట్ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉండాలంటే కొన్ని చిట్కాలు పెళ్లికి ముందే అన్ని విషయాలు పరస్పరం చర్చించుకోవాలి.ఇద్దరి మధ్య బంధానికి అంగీకారం ఉందా లేదా అనేదాన్ని పరస్పరం గట్టిగా నిర్ధారించుకోవాలి. అందమైన బంధానికి కమిట్మెంట్, కమ్యూనికేషన్ కీలకం.నిజాయితీకి పెద్ద పీట వేయాలి. ఉద్యోగం, ఆస్తులు, సంపాదన ఇలాంటి విషయాలో అబద్ధాలకు తావుండ కూడదు.పెళ్లి తరువాత ఇంటా బయటా పనుల్లో ఒకరికొకరు సహకరించుకోవాలి. బడ్జెట్, ఇంటి ఖర్చులు సహా అన్ని విషయాల్లో పరస్పరం చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. తప్పు ఒప్పులకు సమానంగా బాధ్యత తీసుకోవాలి. ఒకళ్ల గురించి ఒకరు పట్టించుకోవాలి. ఒకరికొకరు అండగా ఉండాలి. ముఖ్యంగా అనారోగ్యం విషయాల్లో ఒకరికొకరు శ్రద్ధపెట్టాలి. ‘నేను ఉన్నాను’ అనే భరోసా ఇచ్చుకోవాలిఎపుడూ సంసార సాగరంలో పడిపోకుండా అడపాదడపా, కనీసం పెళ్లి రోజులు, పుట్టిన రోజుల్లో అయినా ఇద్దరికీ నచ్చేలా కొంత సమయాన్ని గడపండి. ఇది జీవితంలో మరింత రీఛార్జ్ అవ్వడానికి ఉపయోగ పడుతుంది. ఇద్దరి మధ్య బంధం, ప్రేమ బలపడడానికి కూడా దోహదపడుతుంది.చివరికి ఏవైనా చిన్ని చిన్న మనస్పర్థలు వచ్చినా కూర్చుని చర్చించుకుంటే శ్రావణమేఘాల్లా ఇట్టే తొలగిపోతాయి. మనసులో పెట్టుకొంటే మరింత వేధిస్తాయి. నలుగురి ముందూ గొడవపడటం, ముఖ్యంగా పిల్లల ముందు వాగ్వాదానికి దిగడం అస్సలు చేయవద్దు. ఇది మీ జీవితంతోపాటు, పిల్లల జీవితాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చదవండి: Today Tip : బాల్కనీ మొక్కలు.. అదిరిపోయే చిట్కా! -
Today Tip : బాల్కనీ మొక్కలు.. అదిరిపోయే చిట్కా!
మిద్దె తోటలు, చిన్న చిన్న బాల్కనీలోనే మొక్కల్ని పెంచడం ఇపుడు సర్వ సాధారణం. కానీ నర్సరీనుంచి తెచ్చినపుడు పచ్చని ఆకులు, పువ్వులతో కళ కళలాడుతూ ఉండే మొక్కలు, మనం కుండీలలోకి మార్చగానే , ఎదుగుదల లేకుండా, ఉండిపోతాయి. ఇలా ఎందుకు ఉంటాయో తెలుసా? వాటికి సరైన పోషణ లేక పోవడమే ముఖ్య కారణం. మరి పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా, మన ఇంట్లోనే సులభంగా దొరికే వాటితో చక్కటి ఎరువును తయారు చేసుకోవచ్చు. టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అదెలాగో చూద్దాం.ఎలాంటి మొక్క అయినా దాని సహజ లక్షణం ప్రకారం పువ్వులు పూయాలన్నా,కాయలు కాయాలన్నా తగిన ఎండ, నీటితోపాటు పోషకాలు కూడా కావాలి. పొటాషియం,ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం పోషకాలు మొక్కల పునరుత్పత్తి సామర్థ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సందర్భంగా అరటి తొక్కల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఇదీ చదవండి: Tip of the day కాన్సంట్రేషన్ కుదరడం లేదా? ఇవిగో చిట్కాలు!అరటి తొక్కల్లో ఇవన్నీ లభిస్తాయి. బనానా పీల్ ఫెర్టిలైజర్ ద్వారా మొక్కల్లో పూలు, పండ్లు ఎక్కువగా రావడమే కాదు, పండ్ల మొక్కలకు దీన్ని ఎరువుగా వేస్తే పండ్లు రుచిగా తయారవుతాయి. తొక్కల్లోని పొటాషియం మొక్కలు వివిధ రకాల వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది.ఎలా వాడాలి? అరటి పండు తొక్కలను నేరుగా మొక్కల మధ్య మట్టిలో పాతిపెట్టవచ్చు. ఇది కొన్ని రోజులకు కుళ్లి, ఎరువుగా మారి మొక్కకు చక్కటి పోషకాన్ని అందిస్తుంది.అరటి పండు తొక్కలను వేడి నీటిలో బాగా మరిగించి,చల్లారిన తరువాత ఈ టీని కుండీకి ఒక గ్లాసు చొప్పున అందించాలి. ఇలా చేస్తు గులాబీ మొక్కలు నాలుగు రోజులకే మొగ్గలు తొడుగుతాయి.అరటి పళ్ల తొక్కలను ఒక బాటిల్‌వేసి, నీళ్లు పోసి, 24 గంటలు పులిసిన తరువాత, దీనికి కొద్దిగా నీళ్లు కలుపుకొని నేరుగా ఆ వాటర్‌ను మొక్కలకు పోయవచ్చు.లేదంటే బనానా తొక్కల్ని బాగా ఎండబెట్టి, పొడిగా చేసుకుని నిల్వ చేసుకుని కూడా వాడుకోవచ్చు.అరటి తొక్కలతో తయారు చేసిన ద్రావణం, టీ లేదా ఫెర్టిలైజర్‌ను ప్రతీ 4-6 వారాలకు మొక్కలకు ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని అరటిపండు తొక్కలను చిన్న చిన్నముక్కలుగా కట్ చేసి, నీళ్లలో వేసి మరిగించి, చల్లారిన తరవాత మొక్కల మొదట్లో మొక్కకు ఒక చిన్న కప్పు చొప్పున పోసుకోవాలి. ప్రపంచంలోనే అరటి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న మనదేశంలో అరటిపండు వ్యర్థాలను వినియోగించుకుంటే రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. సహజమైన సూక్ష్మజీవుల చర్యలు జరిగి నేలకూడా సారవంతమవుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన మొక్కలు ,దీర్ఘకాలిక స్థిరమైన పర్యావరణ వ్యవస్థ మన సొంతమవుతుంది. -
Tip of the day కాన్సంట్రేషన్ కుదరడం లేదా? ఇవిగో చిట్కాలు!
ఒక పనిలో విజయం సాధించాలంటే పట్టుదల అవసరం. సాధించాలనే కసితో పనిపై దృష్టి పెడితే ఎలాంటి కష్టాన్నైనా అధిగమించవచ్చు. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా కాన్సెంట్రేషన్ పెంచుకోవడం ఎలాగో చూద్దాం. ఒత్తిడికి ఆందోళనకు దూరంగా ఉండాలి.ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.పని, ప్రాజెక్ట్, లేదా కొత్తగా నేర్చుకోవాలనుకున్నపుడు పనికి ప్రణాళిక అవసరం. పనిని చిన్న భాగాలుగా విభజించి, ఒక్కొక్కటిగా దృష్టి పెట్టాలి.ప్రతి రోజు ఒక నిర్దిష్ట సమయాన్ని పని చేయడానికి కేటాయించండి.ఆ సమయంలో ఇతర విషయాలను పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లకు దూరంగా ఉండండి. కనీసం ఫోన్‌ను, నోటిఫికేషన్లను మ్యూట్‌లో పెట్టేయండి. బాగా అలసిపోయినప్పుడు, చిన్న విరామాలు తీసుకోండి. మెడిటేషన్ చేయండి.సందేహాలు, అనుమానాల నివృత్తి కోసం నిపుణుల సలహాలను తీసుకోండి. అడగడానికి ఏ మాత్రం సంకోచించకండి.మీరు పనిపై దృష్టి పెట్టలేకపోతున్నారంటే, దాని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. వాటిలో కొన్ని:అధిక ఒత్తిడి లేదా ఆందోళన మీ మెదడును గందరగోళంగా మార్చేస్తాయి. కాన్ సంట్రేషన్ కుదరదు.ఎక్కువ అలిసిపోయినా మెదడు చురుకుగా పనిచేయదుచుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా, ఏకాగ్రతకు అనుకూలంగా ఉండేలా చూసుకోండి. చుట్టూ ఉన్న శబ్దాలు లేదా ఇతర విషయాలు మిమ్మల్ని సులభంగా పరధ్యానంలోకి నెట్టేయవచ్చు. పట్టుదలతో ప్రయత్నిస్తే అనుకున్న విజయం సాధించడం తధ్యం. కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఏకాగ్రత నిలపలేక పోవడానికి కారణం కావచ్చు. ఉదాహరణకు, దృష్టి లోపం, లేదా ADHD వంటివి.ఇలాంటి పరిస్థితుల్లో వైద్య సలహాలు తీసుకోవడం ఉత్తమం. -
Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?
కేవలం ఆసనం లేదా ధ్యానం చేయడం మాత్రమే కాదు. యోగా సాధన (Yoga Practicing) చేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనస్సు, శరీరం ,ఆత్మను అనుసంధానించే ఒక మార్గం. శరీరాన్ని అంతర్గతంగా పునరుజ్జీవింపజేయడానికి , బాహ్య ప్రపంచంలో ఉన్న కఠినమైన పరిస్థితులను తట్టుకుని పోరాడేంత బలంగా చేస్తుంది యోగా. శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాదు, మానసికంగా ఎంతో దృఢంగా ఉండొచ్చు. చిన్నవయసువారినుంచి పండు వయసు వారిదాకా సులభంగా ఆచరించే వ్యాయామం యోగ. యోగా అనేది ప్రాథమికంగా ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ, ఇది మనస్సు శరీరం మధ్య సామరస్యాన్ని పెంచుతుంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా టిప్ ఆఫ్ ది డేలో భాగంగా యోగా ఆరోగ్య ప్రయోజనాలు, చిట్కాలు గురించి తెలుసుకుందాం. యోగా - ప్రయోజనాలుశారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా తయారవుతాంక్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతుంది.ఒత్తిడి దూరమవుతుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి యోగా చక్కటి పరిష్కారం మానసిక ఆరోగ్యం బలపడుతుంది.యోగా ద్వారా అధిక బరువును సులభంగా తగ్గవచ్చు.యోగా చేయడం ద్వారా మధుమేహం,థైరాయిడ్, మెదడు పనితీరును మెరుగుపడుతుంది.రక్త పోటు నియంత్రణలో ఉంటుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.కీళ్ల నొప్పులు, అజీర్ణం, గ్యాస్, నిద్రలేమి తదితర సమస్యలనుంచి దూరం కావచ్చు.దీర్ఘకాలిక వెన్నునొప్పిని తగ్గిస్తుంది. కండరాలు , ఎముకలు బలపడతాయి. చిట్కాలు: యోగా సాధనలో బాడీని మనసును రిలాక్స్డ్గా ఉంచుకోండి. ఆరోగ్యంగా , సమయం ప్రకారం తినండి. తాజా పండ్లు, ఆరోగ్యకర పానీయాలు సేవించండి.యోగా ,ధ్యానం చేసినప్పుడు ఎలాంటి ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేయకుండా చూసుకోండి. మీ శరీర పరిమితులను అర్థం చేసుకోండి. సానుకూల ధోరణిని అలవర్చుకోండి.నిష్టగా, నిబద్ధతతో సాధన చేయండి. ఉత్తమ ఫలితాలు సాధించండి.చదవండి: కూతురి వెర్రి పని... సూపర్ డాడీ సాహసం, వైరల్ వీడియో నోట్ : కొన్ని రకాల యోగాసనాలు నిపుణుల పర్యవేక్షణలోనే సాధన చేయాలి. అలాగే గుండెజబ్బులు, ఆస్త్మా, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు కొన్ని ఆసనాలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.యోగా నిపుణుడు ద్వారా నియమ,నిబంధనలపై అవగాహన పెంచుకుని యోగా సాధన మొదలు పెట్టండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి!! ఇదీ చదవండి: Air India Incident భారీ విరాళం ప్రకటించిన యూఏఈ వైద్యుడు -
Today tips : బొద్దింకలతో వేగలేకపోతున్నారా?
వంటిల్లు మన మొత్తం కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే వంటిల్లు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. గాలి వెలుతురు ఉండేలా జాగ్రత్త పడాలి. గిన్నెలను కడిగిన తరువాత శుభ్రంగా ఆరనివ్వాలి. వంటఇంట్లో వాడే తువ్వాలు దగ్గర్నుంచీ వంట దినుసులు దాకా అన్నీ ఫ్రెష్‌గా ఉండేలా చూసుకోవాలి. మరి టిప్ ఆప్ ది డేలో భాగంగా వంటిట్లో బొద్దింకలను నివారించాలంటే ఏం చేయాలో, ఎలాంటి చిట్కాలో పాటించాలో తెలుసుకుందాం. వంటింట్లో సింకుల వద్ద బొద్దింకలు ఎక్కువగా చేరుతుంటాయి.అలా చేరకుండా ఉండాలంటే వెల్లుల్లి ముక్కలను దంచి ఆ పేస్ట్‌ను అవి వచ్చే చోట ఉంచాలి. వీటితో పాటు సింక్‌లో ఎంగిలి గిన్నెలను అలా వదిలి వేయకూడదు. ఎప్పటికపుడు పాత్రలను కడిగేసుకోవాలి. ప్రతీ ఏడాదికి ఒకసారి తీవ్రతను బట్టి పెస్ట్ కంట్రోల్ చేయించుకోవాలి. ఈ సమయంలో, పిల్లలు, పెడ్ యానిమల్స్‌తో జాగ్రత్తగా చూసుకోవాలి.వంటింటిని శుభ్రం చేసే నీళ్లలో కాసింత పసుపు కలపాలి. దాని వల్ల ఈగలు రాకుండా ఉంటాయి.ఇంట్లో చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. బొద్దింకలు కిటికీలు, తలుపుల ద్వారా ప్రవేశించవచ్చు. కాబట్టి అవసరం లేనప్పుడు వీటిని మూసివేయాలి.అవసరం లేని అట్ట పెట్టెలపై వంట ఇంట్లో ఉంచుకోవద్దు. వీటిల్లో చెక్క గుజ్జు బొద్దింకలకు అద్భుతమైన ఆహారం. వాటికి మంచి ఆవాసం కూడా.బొద్దింకలు కొన్ని వాసనలను ద్వేషిస్తాయి, ఉదాహరణకు: నిమ్మ, యూకలిప్టస్, లావెండర్, పుదీనా, వేప నూనెలు. ఈ నూనెలను స్ప్రే చేయడం లేదా వాటిని ఇంటి చుట్టూ ఉంచడం వల్ల బొద్దింకలను దూరం చేయవచ్చు, బేకింగ్ సోడా, చక్కెరను సమాన నిష్పత్తిలో కలిపి బొద్దింకలు వచ్చే ప్రదేశాలలో ఉంచుకోవచ్చు.. బోరిక్ యాసిడ్ , మైదా కలిపి మాత్రలు చేసి బొద్దింకలు ఉన్న ప్రదేశాలలో ఉంచడం కూడా మంచిది.వెనిగర్ తో ఇంటిని శుభ్రం చేయడం వల్ల బొద్దింకలు రాకుండా ఉంటాయి. -
Today recipes : బ్రెడ్‌తో ఇన్ని వెరైటీలు ఎపుడైనా ట్రై చేశారా?
బ్రెడ్ అనగానే బ్రెడ్–జామ్, బ్రెడ్ ఆమ్లెట్ తప్పితే పెద్దగా ఏ వెరైటీ గురించీ ఆలోచించం. ప్రయత్నించం. ఈసారి ఇంట్లో బ్రెడ్ ఉంటే వీటిని ప్రయత్నించి చూడండి. సూపర్ అనక మానరు.టిప్ ఆఫ్ ద డేలో భాగంగా బ్రెడ్‌తో ఇన్ని వైరైటీలు మీకోసం.. బ్రెడ్ కీమాకావలసినవి: బ్రెడ్ స్లైసెస్ – 4 లేదా 5; సాస్ – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు; కీమా తురుము- పావు కప్పు (మసాలా, ఉప్పు జోడించి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి); మొజరెల్లా చీజ్ తురుము – 4 టేబుల్ స్పూన్లు పైనే; ఉల్లిపాయ సన్న ముక్కలు – ఒక టేబుల్ స్పూన్లు; పచ్చి మిరపకాయలు -5 (నిలువుగా ముక్కలు చేసుకోవాలి, పచ్చిమిర్చికి బదులుగా క్యాస్పికమ్ ముక్కలు కూడా తీసుకోవచ్చు); నూనె – కొద్దిగా; మిరియాల పొడి – అర టీ స్పూన్.తయారీ: ముందుగా పాన్ మీద బ్రెడ్ స్లైసెస్లను దోరగా వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి బ్రెడ్‌కి ఒకవైపు సాస్ రాసి, దానిపైన ఉడికిన కీమా కొద్దికొద్దిగా వేసుకోవాలి. అనంతరం కొన్ని ఉల్లి పాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి లేదా క్యాప్సికమ్ ముక్కలను బ్రెడ్ మీద అక్కడక్కడా పరిచినట్లుగా పెట్టుకుని, వాటిపైన మిరియాల పొడి జల్లుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా చీజ్ తురుము వేసుకుని మూత పెట్టి కళాయిలో బేక్ చేసుకోవాలి. అనంతరం నచ్చిన విధంగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.బ్రెడ్–కీమా పిజ్జాకావలసినవి: బ్రెడ్ స్లైసెస్ – 7 లేదా 8; ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి); టమాటో - 1 (సన్నగా తరగాలి); క్యాప్సికమ్ ముక్కలు - 4 టేబుల్ స్పూన్లు; క్యారెట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి - 2 (నిలువుగా కట్ చేసుకోవాలి); పసుపు, కారం - అర టీ స్పూన్ చొప్పున; గరం మసాలా పొడి-అర టీ స్పూన్; పంచదార - అర టీ స్పూన్; నూనె -4 టీ స్పూన్లు; ఆవాలు, శనగపప్పు ఒక టీ స్పూన్ చొప్పున; జీలకర్ర - అర టీ స్పూన్; జీడిపప్పు/పల్లీలు - కొన్ని; కరివే΄ాకు రెబ్బలు -3 లేదా 4; ఉప్పు -సరిపడా; నిమ్మరసం, కొత్తిమీర తురుము - కొద్దికొద్దిగా; సన్న కారప్పూస – గార్నిష్ కోసం.తయారీ: ముందుగా, బ్రెడ్ ముక్కలను చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అనంతరం కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. తరువాత, జీడిపప్పు లేదా పల్లీలు వేసి అవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించండి. ఆపై కరివేపాకు, ఉల్లి పాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలను చిన్న మంట మీద మగ్గనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు, ఉప్పు వేసి అవి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము కూడా వేసి 2 నిమిషాల ΄ాటు మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి.అనంతరం పసుపు, గరం మసాలా పొడి కారం, పంచదార వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల నీరు పోసి, మూత పెట్టి, ఆ మిశ్రమం చిక్కబడే వరకూ ఉండాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేసి బాగా కల పాలి. అనంతరం మూత పెట్టి, మంట తగ్గించి 4 లేదా 5 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని, నిమ్మరసం, కొత్తిమీర తురుము వేసి బాగా కలపాలి. సర్వ్ చేసుకునే ముందు సన్న కారప్పూస వేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది.బ్రెడ్ బోండాకావలసినవి: బ్రెడ్పౌడర్ - 2 కప్పులు; మైదా పిండి – ఒక కప్పు; బంగాళదుంప గుజ్జు – ఒకటిన్నర కప్పులు (మెత్తగా ఉడికించి, గుజ్జులా చేసుకోవాలి); జీలకర్ర ΄పొడి-అర టీ స్పూన్; పులిసిన గడ్డ పెరుగు - పావు కప్పు; వేయించిన కరివేపాకు పొడి - కొద్దిగా (ఆకుల్ని కూడా తీసుకోవచ్చు, చిన్నగా తుంచుకుని వేసుకోవచ్చు); ఉల్లి పాయ తరుగు – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు -తగినంత; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా;తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బంగాళదుంప గుజ్జు, మైందాపిండి, జీలకర్ర పొడి, కరివే పాకు పొడి లేదా తురుము, ఉప్పు, ఉల్లిపాయ తరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆపైన బ్రెడ్ పౌడర్ వేసుకుని.. కొద్ది కొద్దిగా పెరుగు వేస్తూ బోండా పిండిలా కలుపుకోవాలి. కళాయిలో నూనె కాగిన తర్వాత బోండాలు వేసుకుని.. వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే సరి΄ోతుంది. అభిరుచిని బట్టి మరిన్ని కూరగాయ ముక్కలను జోడించుకోవచ్చు.బ్రెడ్ ఉప్మా..కావలసినవి: బ్రెడ్ స్లైసెస్ – 7 లేదా 8; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి); టమాటో – 1 (సన్నగా తరగాలి); క్యాప్సికమ్ ముక్కలు – 4 టేబుల్ స్పూన్లు; క్యారెట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి – 2 (నిలువుగా కట్ చేసుకోవాలి); పసుపు, కారం – అర టీ స్పూన్ చొప్పున; గరం మసాలా పొడి – అర టీ స్పూన్; పంచదార – అర టీ స్పూన్; నూనె – 4 టీ స్పూన్లు; ఆవాలు, శనగపప్పు ఒక టీ స్పూన్ చొప్పున; జీలకర్ర – అర టీ స్పూన్; జీడిపప్పు/పల్లీలు – కొన్ని; కరివేపాకు రెబ్బలు – 3 లేదా 4; ఉప్పు – సరిపడా; నిమ్మరసం, కొత్తిమీర తురుము – కొద్దికొద్దిగా; సన్న కారప్పూస – గార్నిష్ కోసం.తయారీ: ముందుగా, బ్రెడ్ ముక్కలను చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అనంతరం కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. తరువాత, జీడిపప్పు లేదా పల్లీలు వేసి అవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించండి. ఆపై కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఉల్లి పాయ ముక్కలను చిన్న మంట మీద మగ్గనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు, ఉప్పు వేసి అవి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము కూడా వేసి 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి.అనంతరం పసుపు, గరం మసాలా పొడి, కారం, పంచదార వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల నీరు పోసి, మూత పెట్టి, ఆ మిశ్రమం చిక్కబడే వరకూ ఉండాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలపాలి. అనంతరం మూత పెట్టి, మంట తగ్గించి 4 లేదా 5 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని, నిమ్మరసం, కొత్తిమీర తురుము వేసి బాగా కల పాలి. సర్వ్ చేసుకునే ముందు సన్న కారప్పూస వేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది బ్రెడ్ ఉప్మా. -
Beauty Tip పూల రెక్కలు, తేనె చుక్కలతో మెరిసిపోండి ఇలా!
సువాసనలు వెదజల్లే అందమైన పూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ అందానికి అందంగా, సుగంధంగా గులాబీలు, మల్లె, జాజి పూలు అమ్మాయిలకు మరీ ఇష్టం. పురాతన కాలం నుంచీ మల్లి, జాజి, గులాబీ పూల రెక్కలను సౌందర్య సాధనంగా కూడా వాడేవారు. శరీరానికి మెరుపు, ముఖ తేజస్సును పెంచుకునేందుకు గులాబీ రేకులకు, కాస్త తేనె, కూసింత పసుపు,ఇతర అనేక సుగంధ ద్రవ్యాలను కలిపి వాడతారు. మరి ఇవాల్టి టిప్ ఆఫ్ ది డే లో భాగంగా గులాబీ బాలగా మన ముఖం మెరిసిపోవాలంటే ఇవిగో టిప్స్...గులాబీ రేకులు, నల్ల నువ్వులు, బార్లీ గింజలు సమ పాళ్లలో తీసుకొని, పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని తగినన్ని రోజ్‌వాటర్ కలిపి, ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడిబారిన చర్మం మృదువుగా, కాంతిమంతంగా అవుతుంది. లేదంటే సింపుల్‌గా పది గులాబీ రేకలను మెత్తగా చేసి, అందులో రెండు చెంచాల రోజ్‌వాటర్, రెండు చెంచాల తేనె, మూడు చుక్కల బాదం నూనె వేసి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖంపై వలయాకారంగా రాస్తూ పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే.. చక్కటి మెరుపు వస్తుంది. అర టీ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్‌తో చర్మ రంధ్రాలు శుభ్రపడి ముఖ చర్మం కాంతివంత మవుతుంది. (Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..)ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిబారే చర్మతత్త్వం గలవారు మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. చర్మం తాజాగా మెరుస్తూ ఉండాలంటే ఎప్పటికప్పుడు చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. ఇందుకోసం కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దన చేయాలి. దీంతో మృతకణాలు తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుంది. ఇదీ చదవండి: సంజయ్ మరణానికి కారణం ఓ తేనెటీగ : వైద్యులు ఎంత శ్రమించినా..!మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నీళ్లు కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక ముఖానికి రాసి, మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఆయిల్ ప్యాక చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. నోట్ : పువ్వులు ఎంత అందమైనవి అయినా కొంతమందికి ఎలర్జీ కలిగించవచ్చు. అందుకే ఏదైనా ప్యాక్ వేసుకునే ముందు కొద్దిగా టెస్టింగ్ ప్యాక్‌లా వేసుకోవడం మర్చిపోవద్దు. ఏదైనా సమస్య వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. -
To day recipes :మోకాళ్ల నొప్పులకు బెస్ట్ ఇది, మరి జీర్ణశక్తికి!
మన పెద్దల నాటి వంటకం ఇది. ఇపుడంటే చాలామంది మర్చిపోయారు కానీ, మన అమ్మమ్మలు తాతల కాలంలో బాగా ప్రాచుర్యం సంపాదించుకున్నదే. అదే నల్లేరు పచ్చడి. నల్లేరును సాధారణంగా కూరగాయల పాదులపై వాడేవారు. ఉడతలు, తొండలు పూత , పిందెలను కొరికి పాడు చేయకుండా దీన్ని పాదులపై ఉంచేవారు. అయితే నల్లేరు పచ్చడిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నల్లేరు ప్రధానంగా పచ్చడి తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయనీ, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతారు. మరి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా ఈ రోజు నల్లేరు కాడల పచ్చడి, పోషకాలు అందించే వామ్ము ఆకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా.నల్లేరు పచ్చడి కావలసిన పదార్థాలు:నల్లేరు కాడలు (మరీ ఫ్రెష్‌గా కాకుండా, కాస్త వడిలితే దురదలు రావు) మిర్చి, ఉల్లిపాయలు, టమోటా, పసుపు, కారం, నూనె, చింతపండు, ఉప్పు, తాలింపు కోసం ఆవాలు, శెనగపప్పు, మెంతులు, కరివేపాకు. తయారీ: ముందుగా నల్లేరు కాడలనును శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కడిగేటపుడు చేతులకు గ్లౌజులు వాడటం మంచిది. లేదంటే చేతులు దురదలొస్తాయి. ఎండుమిర్చి, ఉల్లిపాయ, టమోటా(ఇవి ఆప్షనల్) కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇపుడు ఒక పాన్ లో నూనె వేసి, మిర్చి, ఆవాలు, శెనగపప్పు, మెంతులు, కరివేపాకు వేసి వేయించాలి. తాలింపు వేగిన తర్వాత, నల్లేరు ముక్కలు, ఉల్లిపాయలు, టమోటా ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. చిటికెడు పసుపు, కారం, రవ్వంత చింతపండు ఉప్పు వేసి మరికొద్దిసేపు మగ్గించాలి. చల్లారిన తరువాత మెత్తగా రోటిలో (మిక్సీ అయినా పరవాలేదు) దంచుకోవాలి. రుచిచూసుకొని, చివరగా ఇంగువ, ఎండుమిర్చితో పోపు వేసుకుంటే కమ్మని నల్లేరు పచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో గానీ, రాగి సంగటిలో గానీ కాస్తంత నెయ్యివేసుకుని తింటే ఆహా అనాల్సిందే. రొట్టె, లేదా చపాతీతో గానీ తినవచ్చు. ఇదీ చదవండి: Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే.. వామ్ము ఆకు ఇడ్లీ పచ్చడికావలసిన పదార్థాలు: వామ్ము ఆకులు, పచ్చి మిరపకాయలు,పుట్నాల పప్పు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా, ఉప్పు, చింతపండు, కొత్తిమీర పోపుదినుసులు,తయారీ: ముందుగా ప్యాన్ పెట్టుకుని, చింతపండు, పోపు దినుసులు వేసి వేగిన తరువాత పుట్నాల పప్పువేసి , ఆతరువాత శుభ్రవంగా కడిగిపెట్టుకున్న వామ్ము ఆకులువేయాలి. దీంతోపాటు శుభ్రం చేసుకున్న చింతపండు కూడా వేయాలి. నిమిషంలో వామ్ము ఆకులు మగ్గిపోతాయి. దీన్ని చల్లారిన తరువాత పచ్చి వెల్లుల్లి, చిటికెడు పసుపు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పోపు గింజలువేసి, కొంచెం చిటపటలాడనిచ్చి వాము ఆకుల పచ్చడిని వేసుకోవాలి. ఆపైన శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తమీర జల్లుకుంటే...నోరూరించే వామ్మాకు పచ్చడి రెడీ! ఇది జీర్ణ శక్తికి చాలామంచిది. -
పట్టుచీరలపై నూనె మరకా? ఎప్పటికీ కొత్తవాటిలా మెరవాలంటే!
పెళ్లిళ్లు,పార్టీల సీజన్ వచ్చిందంటే ఏ చీర కట్టుకోవాలి అనేది పెద్ద ప్రశ్న. చీర ఉంటే, సమయానికి మ్యాచింగ్ బ్లౌజు కనిపించదు. అంతేకాదు రెండింటికీ తగ్గట్టు జ్యుయల్లరీ వెతుక్కోవాలి.అన్నీ బావున్నాయి అంటే.. మనకు నచ్చిన పట్టుచీర మరక వెక్కిరిస్తుంది. మరి పట్టుచీరపై మరకలుపడితే ఏం చేయాలి? పట్టుచీరలు మెరుపు తగ్గకుండా కొత్తవాటిలా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.పట్టు చీరపై నూనె మరక పడితే..?పట్టు చీర కట్టుకున్నప్పుడు పూజలు వంటి ప్రత్యేక సందర్భాలలో నూనె చుక్కలు పడటం సహజమే. నూనె మరక పడిన వెంటనే శుభ్రమైన పొడి కాటన్ బట్టతో ఆ ప్రదేశంలో అద్దాలి. బట్ట లేకపోతే పేపర్, టవల్ తో కూడా నూనె పడిన చోట అద్దవచ్చు.అయితే ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మరక పడిన చోట గట్టిగా రుద్దితే మిగతా చోట్లకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే నూనె పీల్చుకుని ఆ ప్రదేశంలో మరక పోవడం మొదలవుతుంది. నూనె పడిన చోట మాత్రమే మెల్లగా అద్ది మరకను తొలగించాలి. (Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్ లుక్‌లో అఖిల్- జైనబ్)ఇలా వస్త్రం లేదా పేపర్ టవల్ తో అద్దిన తర్వాత అక్కడ పౌడర్ చల్లి శుభ్రం చేయాలి. పౌడర్ చల్లి మరక పడిన చోటును నీటితో కడిగితే చాలు. పేరుకు పోయిన నూనె, మురికి అంతా పోతుంది. పొరపాటున కూడా వేడి నీటితో మరకలను తొలగించడానికి ప్రయత్నించవద్దు. వేడి నీరు పడితే మరక పోనే పోదు.మరక ఉన్న చోట బేకింగ్ సోడా లేదా కార్న్‌స్టార్చ్‌ను పలుచగా చల్లి కొద్దిసేపటి తర్వాత, వేరే ఏదైనా బట్టతో తుడిచివేసి, మళ్ళీ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వెనిగర్ లేదా నిమ్మరసం తీసుకొని కొద్దిగా నీరు కలిపి, సున్నితమైన బట్టతో మరక ఉన్న ప్రాంతాన్ని తుడవాలి. పట్టు చీరలను శుభ్రం చేసిన తర్వాత, వాటిని నీడలో ఆరనివ్వాలి. ఇదీ చదవండి: మీ ముఖం చందమామలా మెరవాలంటే..!ఎలా శుభ్రం చేయాలంటే..ఖరీదైన చీరలను సాధ్యమైనంత వరకు ఇంట్లో వాష్ చేయకపోవడమే మంచిది. డ్రై క్లీనింగ్ లేదా ఇతర ప్రొఫెషనల్ క్లీనింగ్ సేవలను ఉపయోగించుకోవాలి.పట్టు చీరలను మడతపెట్టేటప్పుడు, జాగ్రత్తగా మడతపెట్టి, పొడి గాలి తగిలేలా చేయాలి.అలాగే బంగారు, వెండి జరీ చీరలను మెత్తటి కాటన్ బట్టలో చుట్టి ఉంచడం మంచిది.సంవత్సరాల తరబడి ఒకే మడతల్లో చీరలను అలా ఉంచేయకూడదు. మధ్యమధ్యలో గాలికి ఆరనిచ్చి,మడతలు మార్చిపెట్టుకోవాలి. పట్టు చీరలను శుభ్రం విషయంలో ఏదైనా అనుమానాలుంటే ఎక్స్పర్ట్ సలహా తీసుకోవడం ఉత్తమం. మగ్గం వర్క్ బ్లౌజులను ఉల్టా చేసిన మడతపెట్టుకునొ భద్రపరుచుకోవాలి. లేదంటే స్టోన్స్, కుందన్స్ ఊడిపోయి, అందం పోతుంది. ఇదీ చదవండి: Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..ఇంకో చిట్కా:పాతగా అనిపించిన పట్టు చీరల్ని పిల్లలకు పట్టులంగాలుగా కుట్టింవచ్చు. లేదంటే పెద్దవాళ్లే లాంగ్ ఫ్రాక్, డిజైనర్ బ్లౌజులు, కుర్తాలుగా రీమోడలింగ్ చేయించుకోని రీయూజ్ చేసుకోవచ్చు. -
Beauty Tips: బ్లాక్ హెడ్స్‌కు చెక్, ముఖాన్ని మెరిపించే స్క్రబ్స్
ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ బ్లాక్ హెడ్స్ వస్తూనే ఉంటాయి. వీటివల్ల ముఖం కళావిహీనంగా కనిపిస్తుంది. వీటిని తీయించుకోవడం ఖర్చుతో కూడుకున్నదేగాక, సమయం కూడా వెచ్చించాలి. అయితే ఇంట్లో ఉండే దాల్చినచెక్క, నిమ్మ, పప్పు, పాలు, పంచదార, కొబ్బరి నూనె, ఉప్పుతో సులభంగా తొలగించుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం...చర్మంలో అతిముఖ్యమైన ప్రొటిన్ కొల్లాజెన్ విడుదలను మెరుగుపరచడంలో దాల్చినచెక్క ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చర్మం మీద ఏర్పడే రంధ్రాలను దాల్చిని తగ్గిస్తుంది. నిమ్మరసంలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంమీద రంధ్రాలను లోతుగా శుభ్రం చేస్తాయి. అందువల్ల అరచెక్క నిమ్మరసంలో టీస్పూను దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రాంతంలో పూతలా వేసి పదిహేను నిమిషాల పాటు మర్దనా చేయాలి. తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి.స్పూను పంచదారలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెవేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు మర్దన చేసి తరువాత కడిగేయాలి. పంచదార చర్మాన్ని లోతుగా శుభ్రంచేసి మూసుకు పోయిన రంధ్రాలను తెరవడంతో పాటు, మృతకణాలను తొలగిస్తుంది. కొబ్బరి నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు, మృదువుగా మారుస్తాయి.అరచెక్క నిమ్మరసంలో అరటీస్పూను సాల్ట్‌వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదినిమిషాల΄ాటు మర్దన చేసి చల్లని నీటితో కడిగేయాలి. ఈ స్క్రబ్ వదులుగా ఉన్న చర్మాన్ని బిగుతుగా మార్చడంతోపాటు, బ్లాక్‌హెడ్స్‌ను తొలగించి చర్మం కాంతిమంతం గా మెరిసేలా చేస్తుంది. ఇదీ చదవండి: Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..డార్క్ సర్కిల్స్టీ స్పూన్ టొమాటో గుజ్జు, సెనగపిండి, చిటికెడు పసుపు, అర టీస్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, కళ్ల మీద గుండ్రంగా తరిగిన కీరా ముక్కలు ఉంచి ఇరవై నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటే కళ్ల కింద నల్లని వలయాలు తగ్గుముఖం పట్టి, ముఖం కాంతిమంతం అవుతుంది. నోట్: ఆరోగ్యాన్ని మించిన అందంలేదు. సమతులం ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, సరిపడినన్ని నీళ్లు తాగడం, చక్కటి నిద్ర, ఒత్తిడి లేని జీవితం, నలుగురితో హాయిగా, సంతోషంగా నవ్వుతూ గడిపే జీవన శైలి,ఏదైనా అనారోగ్యసమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఇవి చాలు ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి. -
Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..
చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. అధిక బరువుతో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఎత్తు, వయసుకి తగ్గట్టుగా బరువు ఉండటం చాలా అవసరం. ఆరోగ్యకరమైన రోజువారీ అలవాట్లు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బీపీ గుండె జబ్బులు, మధుమేహం లాంటి జబ్బులను దూరంగా ఉంచుతాయి. కాబట్టి ఆరోగ్యంగా, చక్కటి శరీరాకృతితో ఆకర్షణీయంగా ఉండాలంటే దినచర్య సవ్యంగా ఉండాల్సిందే. కొన్ని ముఖ్యమైన సూత్రాలు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. లేలేత సూర్యకిరణాలు మన శరీరానికి తాకిడే, చక్కటి డి విటమిన్ అందుతుంది. యోగా, నడక లాంటి వ్యాయామం చేయాలి. ఇది రక్త ప్రవాహం సాఫీగా సాగిపోవడానికి మేలుచేస్తుంది. అంతేకాదు రోజంగా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. నిర్దిష్ట సమయాల్లోనే భోజనం చేయాలి. అదీ సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. ఉపాహారం అస్సలు వాయిదా వేయొద్దు. రాత్రి నిద్రకు ముందు అతిభోజనం వద్దు.సరిపడినన్ని నీళ్లు తాగాలి.స్మార్ట్ఫోన్లు, టీవీలకు ఎక్కువగా అతుక్కుపోకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా రోజుకు 10వేల అడుగులు వేస్తే బరువు తగ్గడం ఈజీ అవుతుంది. నిమిషానికి 80 అడుగులు నడిస్తే సాధారణం. నిమిషానికి 100 అడుగులు నడుస్తుంటే మధ్యస్థంనిమిషానికి 120 అడుగులు నడిస్తే.. అది వేగవంతమైన చురుకైన నడక. ఇది అత్యంత ప్రభావవంతమైనది. కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఇది వారి వారి ఆరోగ్య పరిస్థితి, సామర్థ్యం ఆధారంగా నిర్ధారించుకోవాలి. రాత్రికి రాత్రికే బరువు తగ్గాలనే అత్యాశతో అవగాహన లేని షార్ట్ కట్ పద్దతులు, లేని పోని డైటింగ్‌లను ఆశ్రయించకూడదు ఇది ఒక్కోసారి ప్రమాదం కూడా. శరీర తత్వాన్ని అవగాహన చేసుకొని ఓపిగ్గా ప్రయత్నిస్తే విజయం సాధించడం తథ్యం. నోట్: ఏదైనా అనారోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
Bakrid speical : నోరూరేలా.. కాలా మటన్
ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగల్లో రెండోది బక్రీద్. ఇది త్యాగానికి ప్రతీక. దీనిని ‘ఈదుల్ అజ్ హా’ అని కూడా అంటారు. ఈ రోజూ ప్రతి ముస్లిం తమ తాహతుకు తగ్గట్టుగా ఇరుగు పొరుగు వారికి ఖుర్బానీ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఏటా మంచి ఘుమ ఘుమలతో ఈ పండుగను జరుపు కుంటారు. రోజూ అందించే టిప్‌లో భాగంగా ఈ రోజు కాలా మటన్, రామ్‌పూరి తార్ కుర్మా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కావలసినవి: మటన్ – ముప్పావు కేజీ, గ్రీన్ చట్నీ(పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్టు) – అరకప్పు, పసుపు – అరటీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, పెరుగు – కప్పు, ఉల్లిపాయ తరుగు – రెండు కప్పులు, నూనె – ఐదు టేబుల్ స్పూన్లు, ధనియాలు – టేబుల్ స్పూను, గసగసాలు – టేబుల్ స్పూను, యాలుక్కాయలు – నాలుగు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, లవంగాలు – ఐదు, మిరియాలు – ఐదు, సోంపు – టేబుల్ స్పూను, ఎండు మిర్చి – నాలుగు, ఎండుకొబ్బరి తురుము – అరకప్పు, బిర్యానీ ఆకు – ఒకటి, షాజీరా – టీస్పూను, వెల్లుల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, అల్లం తరుగు – టేబుల్ స్పూను, బంగాళ దుంపలు – రెండు, చింతపండు గుజ్జు – రెండు టేబుల్ స్పూన్లు.తయారీ: మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. దీనిలో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గ్రీన్ చట్ని, పెరుగు వేసి కలిపి ఇరవైనిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత మటన్‌ను కుకర్‌లో వేయాలి. దీనిలో కొద్దిగా ఉల్లి పాయ తరుగు, కప్పు నీళ్లు పోసి ఒక విజిల్ వచ్చేంతవరకు పెద్దమంట మీద ఉడికించాలి. తరువాత సన్నని మంట మీద పదినిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేయాలి. వేడెక్కిన నూనెలో ధనియాలు, గసగసాలు, యాలుక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు, ఎండు మిర్చి వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. దీనిలో కొన్ని ఉల్లి పాయ ముక్కలు వేసి ముదురు బ్రౌన్ రంగు వచ్చేంతవరకు వేయించాలి. ఇప్పుడు ఎండుకొబ్బరి తురుము వేసి రంగు మారేంత వరకు వేయించి, చల్లారాక కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె వేయాలి. నూనె వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, షాజీరా వేసి నిమిషం పాయించాలి. ∙తరువాత అల్లం, వెల్లుల్లి తరుగు, మిగిలిన ఉల్లిపాయ తరుగు వేసి లేత బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు బంగాళ దుంపల్ని తొక్కతీసి ముక్కలు తరిగి వేసి, కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. దుంప ముక్కలు సగం ఉడికిన తరువాత ఉడికిన మటన్ మిశ్రమం వేయాలి. ఐదు నిమిషాల తరువాత మసాలా పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి పదినిమిషాల పాటు మగ్గనిచ్చి దించేయాలి. అంతే ఘుమఘుమ లాడే టేస్టీ టేస్టీ కాలా మటన్ రెడీ. రామ్‌పూరి తార్ కుర్మాకావలసినవి: నెయ్యి – కప్పు, మటన్ - కేజీన్నర, అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు టేబుల్ స్పూన్లు, కారం - రెండు టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు – రెండు, పసుపు – అర టీస్పూను, గరం మసాలా పొడి – టేబుల్ స్పూను, వేయించిన ఉల్లిపాయ పేస్టు - పావు కప్పు, పెరుగు – ఆరు టేబుల్ స్పూన్లు, పాలు -కప్పు, ఫూల్ మఖనీ – నాలుగు టేబుల్ స్పూన్లు, కర్బూజా గింజలు – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడా, మటన్ సూప్- అరలీటర్, జీడిపప్పు - పది. కుర్మా మసాలా: యాలుక్కాయలు -పది, నల్ల యాలుక్కాయలు - రెండు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, జాపత్రి ΄ పొడి -పావు టీ స్పూన్, అనాసపువ్వు- రెండు, లవంగాలు- నాలుగు, షాజీరా - టీ స్పూను, ఎండుకొబ్బరి తురుము - టేబుల్ స్పూను, మిరియాలు -పది, కశ్మీరి ఎండుమిర్చి రెండు. తయారీ: ∙మటన్‌ను శుభ్రంగా కడిగి టేబుల్ స్పూను ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలిపి పక్కనబెట్టాలి. ∙కర్బూజ గింజలు, పూల్ మఖనీలను అరకప్పు ΄పాలలో నానబెట్టి, పేస్టు చేయాలి. ∙కుర్మా మసాలా దినుసులన్నింటిని దోరగావేయించి పొడిచేసి పక్కనపెట్టుకోవాలి. ∙మందపాటి బాణలిని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, కారం వేయాలి. అరనిమిషం వేగాక మటన్ ముక్కలు, పసుపు, ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఉప్పు వేసి పదినిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మంటను మీడియంకు తగ్గించి, కుర్మా మసాలా టీస్పూను పక్కన పెట్టి మిగతాది వేయాలి, ఉల్లి΄పాయ పేస్టు, పూల్ మఖనీ పేస్టు, పెరుగు కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మటన్ సూప్,పావు కప్పుపాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి సన్నని మంట మీద ముక్క మెత్తబడే వరకు ఉడికించాలి. చివరిగా కుర్మా మసాలా పొడి, జీడిపప్పు వేసి మగ్గనిచ్చి దించేయాలి. -
Beauty Tip : మీ ముఖం చందమామలా మెరవాలంటే..!
ఆరోగ్యకరమైన ఆహారం, తగినన్ని నీళ్లు, సూర్యరశ్మి, క్రమం తప్పని వ్యాయామం, మంచి ఆలోచనలు మంచి చర్మ , జుట్టు, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యాన్ని మంచిన అందం, ఆనందం మరొకటి ఉండదు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అందరిలోనూ అందమైన చందమామలా మెరిసిపోవాలని ఎవరికి ఉండదు. అందుకే అద్భుతమైన చిట్కాలు మీకోసం..పెసర పిండిలో పెరుగు కొబ్బరి నూనె కలిపి ముఖాలకు చేతులకు పాదాలకు రాయాలి. ఆరిన తరువాత మృదువుగా శుభ్రం చేసుకుంటే.. మిల మిల మెరుపు మీ సొంతం.మందార ఆకుల్ని నూరి షాంపూగా వాడితే జుత్తు బాగా పెరుగుతుంది. చుండ్రు నివారణలోనూ, తెల్ల వెంట్రుకల నిరోధకంలోనూ బాగా సాయపడుతుంది ఒక కప్పు నీటిలో ఒక పూవు చొప్పున వేసి ఆ నీళ్లను తాగితే రక్తంలో ఐరన్ పెరుగుతుంది.ముఖం మిలమిలలాడాలంటే కొబ్బరి నూనెలో కాఫీ పౌడర్ వేసి ఇది పేస్ట్ లా తయారయ్యేంత వరకూ బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని కళ్ల కింద రాస్తే కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు క్రమంగా తగ్గి పోతాయి.కలబంద గుజ్జు అలోవెరా జెల్... ఒక సహజసిద్ధమైన కండీషనర్. మాయిశ్చరైజర్ కూడా.కలబంద గుజ్జును చర్మం మీద, మాడు మీద రుద్దితే, చుండ్రు సమస్యలు, చర్మ వ్యాధులు చాలా వరకు తగ్గుతాయి. కలబంతో కాలిన గాయాలు కూడా త్వరగా మాని పోతాయి మచ్చలు ఏర్పడవుగోరింటాకు, జుత్తుకు సహజసిద్ధమైన రంగుగానే కాకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారణలోనూ బాగా తోడ్పడుతుంది. వెంట్రుకల కుదుళ్లను పటిష్టం చేయడం ద్వారా ఇది చుండ్రును, జుత్తు రాలడాన్ని నివారిస్తుంది.ఇవీ చదవండి: Food Crisis In Gaza: రూ. 5ల బిస్కట్ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?