Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే | Today tip amazing healthand beuty benefits of guava leaves | Sakshi
Sakshi News home page

Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే

Jun 28 2025 6:43 PM | Updated on Jun 28 2025 7:05 PM

Today tip amazing healthand beuty benefits of guava leaves

జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి ఇది అందరికీ  తెలిసిన విషయమే.  పోషకాలు మెండుగా ఉండే  జామ పండుతో ప్రయోజనాలు పొందవచ్చ. కానీ జామ ఆకులు కూడా  మన ఆరోగ్యానికి ఎంతో  మేలు చేస్తాయి. మరి ఇవాల్టి టిప్‌ ఆఫ్‌ ది డేలో భాగంగా  జామ ఆకులు   ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.


జామ ఆకుల్లో అధిక మొత్తంలో ట్యానిన్స్, ఆక్సలేట్స్‌ ఉంటాయి. అందువల్ల నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలినా లేదా లేత ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిట పట్టినా మంచి ఫలితాలను  పొందవచ్చు. 

జామ ఆకులు జుట్టుకి దివ్యౌషధంలా పని చేస్తాయి.జుట్టు రాలడాన్ని నివారించడంతో  పాటు జుట్టు పెరగడానికి దోహదపడతాయి. సరిపడా జామ ఆకుల్ని శుభ్రం చేసుకుని తగినన్ని నీరు పోసి 15 నిముషాలసేపు మరిగించాలి. చల్లారాక ఆ నీటిని తలపై నెమ్మదిగా అప్లై చేస్తూ బాగా మర్దనా చేయాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. తరచుగా ఇలా చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లు గట్టిపడి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

జామ ఆకులు ఆరోగ్యానికి ముఖ్యంగా, ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, బరువు తగ్గడానికి సహాయపడతాయి జామ ఆకు టీ తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. తద్వారా అధిక బరువునుంచి బయటపడవచ్చు.(Today tip : ఈజీగా బరువు తగ్గాలంటే ఇవిగో ఆసనాలు)

వీటిల్లోని అధిక యాంటీఆక్సిడెంట్లు ,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు  వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి.

జామ ఆకులలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడతాయి మరియు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను తగ్గిస్తాయి,

జామ ఆకు టీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.

జామ ఆకులలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గిస్తాయి.

నోట్‌ : ఇవి అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే అని గమనించగలరు. వీటిని వాడేముందు,వాడిన తరువాత  ఏదైనా సమస్యలొచ్చినా వైద్యుడిని సంప్రదించిన తర్వాతే జామ ఆకులను ఉపయోగించడం మంచిది. 
 

Advertisement
 
Advertisement
Advertisement