
యోగా మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం తప్పకుండా యోగాను సాధన చేయడం వలన సుదీర్ఘ అనారోగ్యాలనుంచి బయటపడటం సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఆధునిక కాలంలో పెద్ద సమస్యగామారిన అధిక బరువును కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల ద్వారా సులువుగా తగ్గించుకోవచ్చు. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా వాటిలో కొన్నింటిని చూద్దాం.
సూర్య నమస్కారాలు, విన్యాస యోగ, ఉత్కటాసన, ఉష్ట్రసన, సేతు బంధాసన, తడసన , నవాసన వంటివి బరువు తగ్గడానికి, కొన్ని యోగాసనాలు సహాయపడతాయి.
సూర్య నమస్కారాలు: బరువు తగ్గడానికి హృదయ సంబంధ ఆరోగ్యానికి సహాయపడతాయి.
విన్యాస యోగ: కేలరీలను బర్న్ చేయడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది,.
ఉత్కటాసన: ఈ ఆసనం కాళ్ళు , తుంటిని బలోపేతం చేస్తుంది, పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.
ఉష్ట్రాసన: ఒంటె భంగిమ, ఇది బరువు తగ్గడానికి సహాయపడే ఒక సమగ్ర వ్యాయామం,.
సేతు బంధాసన: ఈ ఆసనం బరువు నిర్వహణకు సహాయపడుతుంది.
తడాసన: ఇది పర్వత భంగిమ అంటారు. బాలెన్స్‌ను, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
నవాసన: ఇది పొత్తికడుపు బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
ధనూరాసన: వెన్ను, ఛాతి, నడుము, చేతులు, పొత్తి కడుపు, కాళ్లకు మేలు జరుగుతుంది. ఫిట్‍నెస్ మెరుగవుతుంది. ధనస్సులా శరీరానికి వంచే ఫ్లెక్సిబులిటీ పెరిగి జీవక్రియ వేగవంతమై వెయిట్ లాస్‍కు ఈ యోగాసనం తోడ్పడుతుంది.
వీటితో పాటు ఆహార నియమాలు, నడక లాంటి చిన్నపాటి వ్యాయామాలు చేస్తే మరింత త్వరగా ఫలితం లభిస్తుంది. యోగా ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతిమంగాఇవన్నీ బరువు తగ్గడానికి సహాయపడతాయి.యోగాసనాలు ఎలా వేయాలి అనేది యోగా నిపుణుల ద్వారాగానీ, నమ్మకమైన యాప్ ద్వారా గానీ నేర్చుకోవాలి.