సాధారణంగా బరువు తగ్గాలనుకునేవారు వారికంటూ ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతుంటారు. కానీ, అందరికీ అలా సెపరేట్ డైట్ వీలు కాదు. అందుకే, మనం చేసుకునే ఫుడ్స్‌లోనే ఏది బెస్ట్ అనేది తెలుసుకుని తినాలి. అందుకే మనం ఇంట్లో రెగ్యులర్‌గా చేసుకునే ΄పోహా, ఉప్మా రెండింటిలో బరువు తగ్గడానికి ఏది మంచిదో తెలుసుకోండి.
ఉప్మా, పోహా.. చాలా ఈజీగా అయ్యే బ్రేక్‌ఫాస్ట్. అందరికీ అందుబాటులో ఉండే పదార్థాలతో ప్రిపరేషన్ కూడా సులువు కావడం వల్ల ఈ రెండింటినే ఎక్కువగా ఇంట్లో చేస్తుంటారు. అయితే, బరువు తగ్గాలనుకునేవారు ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో చేసే ఇలాంటి ఫుడ్స్‌ని కూడా తీసుకోవచ్చు. ఇక పోహాహా, ఉప్మాలో ఏది త్వరగా బరువు తగ్గడానికి తోడ్పడుతుందో చూద్దామా మరి!
బరువు తగ్గడం కోసం చాలామంది తిండిని బాగా తగ్గిస్తుంటారు. అయితే నిజానికి ఐరన్, ప్రొటీన్, ఫైబర్ వంటి పోషకాలన్నీ అవసరం. రెండూ పదార్థాల్లోనూపోహాషకాలు ఉన్నప్పటికీ మన ఆరోగ్యాన్ని బట్టి, మన శరీరానికి కావాల్సిన పోహాషకాలని బట్టి ఏం తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం
పోహా
పోహాలోని అటుకులు త్వరగా జీర్ణం అవుతాయి. ఇక పోషకాలవిషయానికొస్తే పోహాలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఐరన్ లోపం ఉన్నవారు ఇది తీసుకోవడం మంచిది. పోహాని మరింత ఆరోగ్యంగా మార్చాలంటే బఠానీలు, పల్లీలు, నిమ్మరసం ఇలా మనకి పోషకాలని పెంచే
ఏ పదార్థాన్నైనా చేర్చుకోవచ్చు.
కేలరీలు...
పోహాలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడం సులువు. ప్రొటీన్ మాత్రం తక్కువగా ఉంటుంది. అందుకే, ప్రొటీన్ అవసరాల కోసం పోహాతో పాటు ఉడికించిన గుడ్లు, పెరుగు, పనీర్, పప్పు, శనగలతో కలిపి తీసుకోండి. మీకు నచ్చితే పనీర్, శనగల్ని పోహా చేసినప్పుడే కలిపి చేయొచ్చు.
ఉప్మా
ఉప్మాని రవ్వతో తయారుచేస్తారు. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి, బాడీకి శక్తి నెమ్మదిగా అందుతుంది. దీనిని తీసుకున్నప్పుడు కడుపు ఎక్కువసేపు నిండినట్లుగా ఉంటుంది. దీంతో తొందరగా ఆకలి కాదు. అనవసరమైన క్రేవింగ్స్ ఉండవు. జంక్ ఫుడ్ జోలికి పోహారు.
హెల్దీగా మారాలంటే
ఉప్మా కానీ పోహాలో కానీ క్యారెట్స్, బఠానీలు, బీన్స్, కరివేపాకు, వేరుశనగల్ని యాడ్ చేసుకోవాలి. దీంతో అవి మరింత పోహాషకంగా మారుతుంది. వెయిట్‌లాస్ అయ్యేవారికి ఇది మంచి ఆప్షన్. అయితే, మంచిది కదా అని ఎక్కువగా తీసుకుంటే కేలరీలు పెరుగుతాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. తక్కువ నూనె... ఎక్కువగా కూరగాయలు, ప్రోటీన్‌తో కలిపి తీసుకుంటే ఈ రెండూ ఆరోగ్యకరమైనవే. బరువు తగ్గడానికి పోహాహా, ఉప్మా రెండింటిలో బరువు తగ్గేందుకు రెండూ హెల్దీనే. మనం సరైన క్వాంటిటీలో అందులో వేసిన పదార్థాలని బట్టి అది హెల్ప్ అవుతుంది. ఎక్కువగా కూరగాయలు, చిరుధాన్యాలు, మొలకల వంటివి చేయడం వల్ల మనకి కావాల్సిన పోహాషకాలన్నీ అందుతాయి. మీకు త్వరగా జీర్ణమై ఐరన్ ఎక్కువగా అందాలనుకుంటే ΄పోహా బెస్ట్ ఆప్షన్. అదే కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండాలనుకుంటే ఉప్మా బెస్ట్. మీ వీలుని బట్టి, మీకు ఏ ఫుడ్ సూట్ అవుతుందనే బట్టి, మీకు ఏ బ్రేక్ ఫాస్ట్ నచ్చుతుందనేదాన్ని బట్టి దానిని ఎంచుకుని ఆరోగ్యకరమైన పదార్థాలని యాడ్ చేసుకుని తక్కువగా తింటూ ఎక్కువ కేలరీలని బర్న్ చేస్తే రెండింటితో కూడా మీరు బరువు తగ్గొచ్చు.


