బరువు తగ్గే జర్నీలో ఒక్కోక్కరూ..ఒక్కో విధానాన్ని అనుసరిస్తారు. ఏదీ ఏమైనా చివరకు ఆరోగ్యకరమైన విధానంలో స్లిమ్‌గా అవ్వడమే అంతిమ లక్ష్యం. వారి ఆరోగ్య పరిస్థితి, శారీరక పరిమితుల దృష్ట్యా ఒక్కోరకమైన డైట్, వర్కౌట్లను అనుసరించి స్లిమ్ అవుతుంటారు. ఇక్కడ రష్మీ యాదవ్ అనే మహళ జస్ట్ నాలుగు సాధారణ నియామాలతో రెండు నెలల్లో ఆరు నెలలు తగ్గి చూపించింది. అది కూడా క్రమం తప్పకుండా గుడ్డు తీసుకుంటూ తగ్గిందామె. అదెలాగో సవివరంగా తెలుసుకుందామా..!.
రెండు నెలల్లో ఆరు కిలోలు తగ్గడానికి..
ప్రోటీన్ తీసుకోవడం పెంచండి..
తగినంత ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తీసుకునేలా కేర్ తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లో మూడు గుడ్డుల తెల్లసొన, రాత్రి భోజనంలో మరో మూడు గుడ్లు తప్పనిసరిగా తీసుకునేదట. మంగళ, గురువారాల్లో పనీర్ తీసుకునేదట. రోజులో కనీసం ఆరుగుడ్లు తెల్లసొన తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రోటీన్ ఆకలిని తగ్గిస్తుందని అంటోందామె. ప్రోటీన్ ఎక్కువసేపు పొట్ట నిండిన అనుభూతిని అందించి ఆకలిని తగ్గిస్తుందని అంటోందామె.
అలాగే అతిగా తినడాన్ని నివారిస్తుంది. సరైన ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరంలో గ్రెలిన్ స్థాయిలు తగ్గుతాయి. అదనంగా ప్రోటీన్ జీవక్రియను పెంచడానికి, కండరాల పరిమాణాన్ని కాపాడటానికి, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇవన్నీ ఆహార కోరికలను తగ్గించి, కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తాయి.
కేలరీలు లోటు..
ఏది తిన్నా..దాని పరిమాణం తగ్గించే తినమని కోరుతోంది. ప్రోటీన్ ఆహర కోరికలను నియంత్రిస్తుంది కాబట్టి అది ఉండేలా చూసుకుంటూ..పరిమితంగా తీసుకోమని చెబుతున్నారు. ప్రస్తుతం బరువు కంటే తగ్గడానికి, అలాగే బరువు అదుపులో ఉండటానికి కేలరీల లోటు తప్పనిసరని అంటోంది. శరీరం శక్తి కోసం నిల్వ ఉన్న కొవ్వుని ఉపయోగించడం ప్రారంభిస్తుంది, తద్వారా బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఇది తీవ్రమైన డైటింగ్‌తో పోలిస్తే..స్థిరమైనది, ఆరోగ్యకరమైనది. పైగా సమతుల్య పోషణకు వీలు కల్పిస్తుంది.
వాలుగా నడవడం
సమతల నేలపై నడవడంతో పోలిస్తే, వాలుగా నడవడం ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. ఇది గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేయడానికి మన శరీరాన్ని సవాలు చేస్తుంది, ఫలితంగా ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి వస్తుంది. అందువల్ల బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడానికి ఇది ఒక ప్రభావవంతమైన మార్గం. వాలుగా నడవడం వల్ల శరీరంలోని కీలక భాగాలు ఉత్తేజితమవుతాయి. తద్వారా జీవక్రియను మెరుగవుతుంది.
స్ట్రెంగ్త్ ట్రైనింగ్
బరువు 80 కేజీల కంటే ఎక్కువగా ఉంటే, మొదట్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయవద్దు. ముందుగా మొత్తం శరీర బరువును తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాతే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రారంభించండి. తాను మాత్రం ఇంట్లోనే డంబెల్స్‌తో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తానని, ఎందుకంటే చర్మం వదులుగా ఉంటే నచ్చదు కాబట్టి అని చెబుతోంది. చివరగా ఈ నాలుగు చిట్కాలు అనుసరిస్తే సత్వరమే మార్పులు చోటు చేసుకుంటాయని నమ్మకంగా చెబుతోంది రష్మీ యాదవ్. అయితే థైరాయిడ్, పీసీఓఎస్ (PCOS) వంటి సమస్యలు ఉంటే మాత్రం మరింత కేర్ తీసుకుని చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తుంది.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్వి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం.
ఇదీ చదవండి: గడ్డ అనుకుంటే ప్రెగ్నెన్సీ..! జస్ట్ ఐదు గంటల్లోనే చేతిలో బిడ్డ..


