చెక్‌బౌన్స్‌ కేసు.. రాజీ పద్ధతిలో కేసు కొట్టివేయలేరు! | Cheque bounce case cannot be dismissed through a compromise settlement | Sakshi
Sakshi News home page

చెక్‌బౌన్స్‌ కేసు.. రాజీ పద్ధతిలో కేసు కొట్టివేయలేరు!

Oct 28 2026 4:30 AM | Updated on Oct 28 2026 4:30 AM

Cheque bounce case cannot be dismissed through a compromise settlement

లీగల్‌

నామీద రెండు చెక్కు బౌన్స్ కేసులు ఉన్నాయి. రెండూ ఒకే లావాదేవీకి సంబంధించిన వేర్వేరు చెక్కులు. నా భర్త బిజినెస్‌ లావాదేవీ కోసం చెక్కులు ఇచ్చాను. ట్రైల్‌ మొదలుకాక ముందు కాంప్రమైజ్‌ అవుదామని పార్టీని డిగాను. కేసు పెట్టిన అతను కాంప్రమైజ్‌ కావాలంటే మూడింతల డబ్బు కావాలి అని అడుగుతున్నాడు. అంటే 10 లక్షలకి 30 లక్షలన్నమాట! జడ్జిగారికి చెప్తే ‘‘అతను కాంప్రమైజ్‌ అవకపోతే నేను ఏమీ చేయలేను’’ అంటున్నారు. డబ్బు కట్టేస్తాను అని చెప్పినా అతని సమ్మతి అవసరమా? ఇప్పుడు కేసు నడపాల్సిందే అంటారా? నాకు ఏదైనా పరిష్కారం ఉందా?
– మీనాక్షి, గుంటూరు

నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ లోని సెక్షన్‌ 147 ప్రకారం చెక్కు బౌన్స్ కేసులు కాంప్రమైజ్‌ /రాజీ (కాంపౌండ్‌) చేసుకోవచ్చు. అయితే భారతీయ న్యాయ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ ) సెక్షన్‌ 359 పూర్వం సీ.ఆర్‌.పి.సి. సెక్షన్‌ 320లో సూచించిన విధంగా రాజీ విధానాన్ని నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ సూచించలేదు. బహుశా అందుకే మీటర్స్‌ – ఇన్‌స్ట్రుమెంట్స్‌ 2018 అనే కేసులో సుప్రీం కోర్టు సెక్షన్‌ 147 కింద కేసుని రాజీ చేయడానికి ఫిర్యాదుదారుని సమ్మతి తప్పనిసరి ఏమీ కాదని వ్యాఖ్యానించింది. 

ఆ తర్వాత చాలా కేసులలో ఫిర్యాదుదారుని సమ్మతి లేకుండా కూడా పలు కోర్టులు చెక్‌ బౌన్స్ కేసులలో నిందితుడు ముందుకు వచ్చి డబ్బులు కట్టేస్తాను అంటే కేసులను రాజీ జరిగినట్టు పరిగణించి మూసివేశాయి. కానీ ‘త్వరితగతిన చెక్‌ బౌన్స్ కేసులను తేల్చాలి అంటూ 2021లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో అలా కుదరదు, ఫిర్యాదుదారుని అంగీకారం తప్పనిసరి అని చెప్పింది. అందుకనే మీ కేసులో జడ్జిగారు ఫిర్యాదుదారుని అంగీకారం తప్పనిసరి అని చె΄్పారు. ప్రస్తుతానికి రాజీ పద్ధతిలో కేసును కొట్టివేయడం కుదరదు కనుక మీరు హైకోర్టును ఆశ్రయించి మీ ఉద్దేశాన్ని కూడా తెలుపుతూ క్వాష్‌ చేయమని కోరవచ్చు. హైకోర్టు బీ. ఎన్‌. ఎస్‌.ఎస్‌. సెక్షన్‌ 528 కింద తన ప్రత్యేక అధికారంతో మాత్రమే చేసే వీలు ఉంది. లేకపోతే మీరు కేసు నడపాల్సిందే.

శ్రీకాంత్‌ చింతల 
హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement