అందరూ సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో బతకాలని అనుకుంటాం. అయితే అందుకు కావల్సిన ప్రధాన సూత్రాన్ని మిస్ అవుతాం. కాదుకాదు విస్మరిస్తాం అనాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ విషయాన్ని రూఢీ చేసి మరి చెబుతున్నాడు ఈ శతాధిక వృద్దుడు. అంతేగాదు ఆరోగ్యానికి కావాలసిన కీలకమైన దాని గురించి కనువిప్పు కలిగించేలా చెబుతున్నాడు. మరి అదేంటో చకచక చదివేయండి మరి..
అతడే 1919లో జన్మించిన ఓవెన్ ఫైలర్(Owen Filer). బ్రిటన్‌కి చెందిన ఆయన మిలటరీ పోలీస్‌లో సైనికుడిగా సేవలందించారు. అంతేగాదు రెండో ప్రపంచయుద్ధంలో రాయల్ వెల్ష్ ఫ్యూసిలియర్స్‌గా 1945లో విక్టరీ ఆప్ జపాన్ డేఝ(జపాన్‌పై విజయం సాధించిన రోజు) భారత్‌లో మోహరించారు. అంటే రెండో ప్రపంచయుద్ధం నాటి వ్యక్తి. ఇప్పటి వరకు బతికి ఉండటం మాములు విషయం కాదుకదా..!. ఈ విషయాన్నే అతడిని కలిసిన ప్రతిఒక్కరూ అడుగుతారు, ఆశ్చర్యపోతారు.
ఇది ఫైలర్‌కి మాములే. అయితే అందరు అతడడిని ఆరోగ్య రహస్యం ఏంటి..ఎలాంటి ఫుడ్ తింటారు, ఎలా ఉండాలని అడుగుతుంటారని చెబుతున్నాడు రాయల్ వెల్స్. అయితే అతడు మాత్రం నిరంతరం పనిచేస్తూ ఉండాలని, జీవితాన్ని పద్ధతిగా గడపాలని అంటున్నాడు. తానెప్పుడూ అలాగే జీవించానని అంటున్నాడు. తన ఇష్టమైన ఫుడ్ గురించి ఇలా చెప్పాడు. కాడ్ లేదా హేక్ చేపలంటే మహా ఇష్టమని, అయితే అవి ఇప్పుడు అత్యంత ధర పలుకుతున్నాయని అన్నాడు.
అలాగే తానెప్పుడూ అతిగా తినలేదన్నారు. తాను క్రమం తప్పకుండా చిప్స్, చేపలు తినేవాడనని అదే తన ఆరోగ్య రహస్యమని నవ్వుతూ చెబుతున్నాడు. నిజానికి తాను ఇంత కాలం జీవిస్తానని కలలో కూడా అనుకోలేదని అంటున్నాడు. అయితే తాను జీవితకాలం కష్టపడి పనిచేస్తూనే ఉన్నానని, అదే తన దీర్ఘాయువుకి కారణమని అన్నారు. అన్నింటికంటే ప్రతి ఒక్కరికి జీవించడం తెలియాలి, అలాగే మన బుర్రకి ఖాళీ దొరకకుండా నిరంతరం పనిచేస్తూ ఉండాలని అంటున్నారాయన.
అంతేగాదు ఫైలర్, ప్రతి ఉదయం ఒక స్పష్టమైన లక్ష్యంతో నిద్రలేస్తాడట. శుభ్రమైన చొక్కా, టై ధరించడం నుంచి బూట్లు పాలిష్ చేయడం వరకు ప్రతీది ఆయనే స్వయంగా చేసుకుంటారని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా, ఫైలర్‌కి పదిమంది మనవరాళ్లు /మనవళ్లు, 15 మంది మునిమనవళ్లు /మనవరాళ్లు ఉన్నారట. నిజంగా ఈ యుద్ధ వీరుడు ఓ అద్భుతం కదూ..!
ఇదీ చదవండి: రూ. వెయ్యితో ప్రారంభించి..రూ. 5 కోట్ల సామ్రాజ్యం! గృహిణి సృష్టించిన అద్భుతం


