ఒకప్పుడు 20 రోటీలు, 20 ఆమ్లెట్లు..కానీ సడెన్‌గా ఓమాడ్‌ డైట్‌!: యోగ్‌రాజ్‌ సింగ్‌ | Health Tips: Yograj Singh once OMAD Diet | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు 20 రోటీలు, 20 ఆమ్లెట్లు..కానీ సడెన్‌గా ఓమాడ్‌ డైట్‌!: యోగ్‌రాజ్‌ సింగ్‌

Oct 15 2026 1:59 PM | Updated on Oct 15 2026 2:58 PM

Health Tips: Yograj Singh once OMAD Diet

భారత మాజీ స్టార్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇప్పుడు తన ఆహారపు అలవాట్ల కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. 68 ఏళ్ల వయసులో ఇంత చురుగ్గా ఉండటానికి తాను పాటించే ఆహారపు అలవాట్లే అంటూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఒకప్పుడు అధికంగా తినేవాడినని, ఇప్పుడు ఒక్కపూట భోజనానికి పరిమితమైనట్లు చెప్పుకొచ్చారు. ఇలా ఆకస్మికంగా మార్పులు చేసుకోవడం ఎంత వరకు మంచిది?, ఓమాడ్‌ డైట్‌ నిజంగా బరువు తగ్గడానికి చాలా మంచిదా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారు..

రిటైర్డ్‌ క్రికెటర్‌ 68 ఏళ్ల యోగ్‌రాజ్‌ ఒకప్పుడు తాను తెగ తినేవాడినని, తన ఆహారపు అలవాట్లు చూసి తండ్రి సైతం ఫైర్‌ అయ్యేవారని చెప్పుకొచ్చారు. ఏకంగా 20 రోటీలు, 20 ఆమ్లేట్లు తినేవాడినని, మళ్లీ కాసేపటికి ఆకలి అంటూ ఏదైనా పెట్టమని కోరడంతో తన తండ్రి వీడిని డాక్టర్‌ దగ్గరికి తీసుకుపోండి..ఎంత తింటున్నాడో తెలియకుండా స్వాహా చేసేస్తున్నాడని మండిపడేవారని చెప్పుకొచ్చాడు. 

అంతలా బాగా తినేవాడినని, అయినప్పటికీ..వ్యాయామం, వర్కౌట్లు, గుర్రపు స్వారీ అన్ని చేసేవాడినని చెప్పుకొచ్చారు. పైగా తనలా శుభ్రంగా తింటూ అన్నింటిని ఆస్వాదించడం కూడా ఓ అదృష్టం అని తెగ ఫీలయ్యేవాడినని చెప్పుకొచ్చారు. అయితే క్రమంగా పరిస్థితులు మారాయని చెప్పారు. వయసు రీత్యా జీవక్రియ నెమ్మదించడంతో ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలని అర్థమైందన్నారు. 

ప్రస్తుతం తాను ఓమాడ్‌ డైట్‌ పాటిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు రోజుకి ఒక్కపూటే తింటానని..అంటే 24 గంటలకొకసారి తింటానని చెప్పారు. వయసు పెరిగే కొద్దీ ఆహారం తగ్గించుకుంటూనే ఆరోగ్యం అని అర్థమైందన్నారు. ఎంత ఉపవాసం ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నాడు యోగ్‌రాజ్‌

నిపుణులు ఏం చెబుతున్నారంటే..
రోజుకు ఒక భోజనం లేదా ఓమాడ్‌ డైట్‌ అనేది అందరికీ వర్తించదని అన్నారు. ఒక్క భోజనంలో తీసుకునే పోషకాల సమృద్ధి రీత్యా.. సరిపడుతుందే తప్ప..మాములుగా అది అంత సరైనది కాదన్నారు. కేలరీలు లోటు పరంగా మంచిదే అయినా..ఒక్క మీల్ ప్లేట్‌లో శరీరానికి సరిపడా పోషకాలు తప్పనిసరి అని గుర్తురెగలని అన్నారు. 

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం అన్నారు. ప్రతి ఒక్కరికి తగిన భోజనం, వేళకు నిద్ర అనేది అత్యంత ముఖ్యం అని నొక్కి చెప్పారు. రోజు రెండు లేదా మూడు పూటలా నిరంభ్యంతరంగా తినొచ్చని కేలరీల లోటుని పాటిస్తూ సమతుల్యంగా తీసుకుంటే బరువు అదుపులో ఉండటమే గాక హెల్దీగా కూడా ఉంటామని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇదీ చదవండి: ఇది కదా మహిళా శక్తి! 350 మంది మహిళల వీర గర్బా..వీడియో వైరల్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement