నవరాత్రుల వేడుకల్లో నార్త్ ఇండియాలో దాండియా, గర్బా వంటి నృత్య ప్రదర్శనలతో కోలహాలంగా ఉంటాయి. అయితే ఈసారి ఉత్తరప్రదేశ్లోని బుందేల్ ఖండ్లో జరిగిన గర్భా అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. వీరనారుల్లా మహిళలు చేసిన గర్బా నృత్య ప్రదర్శన భక్తిభావం తోపాటు చక్కటి సందేశాన్ని కూడా ఇవ్వడం విశేషం. మొత్తం 15 మంది మహిళలతో కూడిన 'మా చండికా ఉత్సవ్ సమితి' నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 350 మందిదాక మహిళలు, చిన్నారులు పాల్గొని కత్తులతో అద్భుతంగా గర్బా నృత్యం చేశారు.
వాళ్లంతా భక్తిభావం, మహిళా సాధికారత, ఆత్మరక్షణ వంటి శక్తిమంతమైన సందేశాలతో నృత్య ప్రదర్శన ఇచ్చారు. సింపుల్గా చెప్పాలంటే రాణి లక్ష్మీబాయి ధైర్యసాహసాలను ప్రదర్శించారు ఆ నృత్యంలో. ముఖ్యంగా కత్తిసాము ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మహిళలు తమ ప్రదర్శన ద్వారా స్త్రీత్వాన్ని ప్రదర్శిస్తూనే అనుచితన ప్రవర్తనను ఎదురించగలమని, అలాగే అవసరమైనప్పుడు తమను తాము రక్షించుకోగలమని బలమైన సందేశాన్ని ఇచ్చారు.
అక్కడ వరుసగా తొమ్మిదో ఏట జరుగుతన్న ఈ గర్భా నృత్యం కోసం వాళ్లంతా పది రోజుల పాటు శిక్షణ తీసుకుని మరి పాల్గొనడం విశేషం. కాగా, పెద్దపెద్ద నగరాలకే పరిమితమైన ఈ నృత్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ ప్రదర్శన నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
#WATCH | 350+ Women Perform Garba With Swords In Uttar Pradesh's Mahoba, Send Message Of Empowerment #garba #uttarpradesh https://t.co/OAACBLgFtR
— NDTV (@ndtv) October 14, 2026
ఇదీ చదవండి: ఒళ్లు గగుర్పొడిచే భక్తి విన్యాసం..! ఏకంగా 2,516 పదునైన మేకులపై పడుకుని..


