బిహార్‌లోని మోకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె శివాంగి సింగ్ వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం జరిగిన ఈ వేడుకకు సుమారు 10 లక్షల మంది హాజరైనట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఈ సంఖ్యను అధికారికంగా నిర్ధారించలేదు.
నద్వాన్ గ్రామంలో జరిగిన ఈ పెళ్లికి భారీగా జనం తరలిరావడంతో నిర్వాహకులు ఏర్పాట్లను అదుపు చేయలేకపోయారు. దీంతో కొందరు అతిథులు ప్లేట్లకు బదులుగా గ్లాసుల్లో ఆహారం తీసుకోగా, మరికొందరు పెద్ద వంట పాత్రల నుంచే ఆహారం తీసుకున్నారు. ఇంకొందరు కార్టన్ బాక్సుల్లో ఆహారాన్ని తీసుకెళ్లారు. స్వీట్ల కోసం కూడా అతిథులు ఎగబడిన వీడియోలు వైరల్‌గా మారాయి.
देखिए, किस तरह से लोग सब्जी लूटकर खा रहे हैं। अनंत सिंह की बेटी की शादी में कई लोगों को खाना तक नसीब नहीं हुआ। https://t.co/hp5R7DgPUr
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) November 25, 2026
అయితే అనంత్ సింగ్ ఇచ్చిన బహిరంగ ఆహ్వానం కారణంగా భారీగా జనం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి విందు సందర్భంగా 5 నుంచి 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ వేడుకకు కార్లు, ట్రాక్టర్లు, కాలినడకన ప్రజలు భారీగా చేరుకున్నారు.
కాగా.. ఈ వివాహ వేడుకలో భారీ వంటశాల, గుర్రపు పందెం, థార్ ఎస్‌యూవీ, వీఐపీల కోసం హెలిప్యాడ్‌తో పాటు టెంట్ సిటీ వంటి ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అయితే శివాంగి సింగ్.. కమాండెంట్ రణ్‌విజయ్ కుమార్ కుమారుడు రిషికేశ్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. రిషికేశ్ అట్లాంటాలోని జార్జియా స్టేట్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు.
ఇదీ చదవండి: 26/11 దాడులు: కసబ్‌కు శిక్షణనిచ్చిన రాక్షసుడు ఎవరు?


