రాజసం ఉట్టిపడే పాల నురుగు డ్రెస్‌లో కరీనా బ్యూటీఫుల్‌ లుక్‌..! | Kareena Kapoor Makes Rs 74,500 Emerald Diamond Brooch | Sakshi
Sakshi News home page

Kareena Kapoor: రాజసం ఉట్టిపడే పాల నురుగు డ్రెస్‌లో కరీనా బ్యూటీఫుల్‌ లుక్‌..! ఏకంగా రూ. 74 వేలు..

Nov 19 2026 11:03 AM | Updated on Nov 19 2026 11:03 AM

Kareena Kapoor Makes Rs 74,500 Emerald Diamond Brooch

ప్రిన్స్‌ విలియం, కేట్‌ మిడిల్టన్‌లు మూడు రోజుల భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన నేపథ్యంలోనే ముంబైలోని కరణ్‌ జోహార్‌ ధర్మ ప్రొడక్షన్స్‌ను సందర్శించారు. అక్కడ ఎర్త్‌షాట్ ప్రైజ్ 2026లో గ్రీన్ కార్పెట్‌పై అద్భుతంగా కనిపించిన తర్వాత, ఈ రాజ దంపతులకు ఘన స్వాగతం లభించింది. డిసెంబర్‌లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న 'కభీ ఖుషీ కభీ గమ్' చిత్రంలోని పాటలతో ప్రదర్శనలు కూడా జరిగాయి. 

ఆ రాజదంపతులతో కరణ్‌ మాత్రమే సంభాషించలేదు, కరీనా, సైఫ్‌ అలీలతో సైతం మాట్లాడారు. ఆ రాజదంపతులను కలవడానికి బాలీవుడ్‌ బ్యూటీ కరీనా రాజసం ఉట్టిపడే తెల్లటి దుస్తులను ఎంచుకున్నారు. అంచు వెంబడి క్లిష్టమైన ఎంబ్రాయిడరీ ఉన్న తెల్లని స్కర్ట్‌ను, గుడ్డు పెంకులాంటి తెల్లని బ్లేజర్‌ని జత చేశారు. ఆ కాస్యూమ్‌కి తగినట్లుగా ముత్యాల చెవిపోగులను జత చేశారు. కొన్ని ఉంగరాలు, వజ్రపచ్చ బ్రోచ్‌ను అలంకరణగా ధరించారు. నూర్ జ్యువెల్స్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ బ్రోచ్ ధర రూ. 74,500. శిల్పకళతో తీర్చిదిద్దిన ఈ ఆభరణంలో మెరిసే వజ్రాలు, బేరిపండు ఆకారంలో ఒక పచ్చరాయి ఉన్నాయి. '

ఈ బ్రోచ్‌ కేవలం అలంకరణకు మించి ‘ధరించగలిగే కళ’. అని సదరు బ్రాండ్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. తెలుపు రంగు థీమ్‌కు అనుగుణంగా గోళ్లకు తెలుపు రంగు నెయిల్‌పాలిష్‌ను వేసుకుంది. ఇక మేకప్‌ విషయానికి వస్తే.. పింక్ బ్లష్, లేత గులాబీ రంగు లిప్‌స్టిక్ న్యూడ్ ఐషాడోతో తన లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకుంది. ‍కాగా, కరీన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది. "హిందీ సినిమాపై మా ఇద్దరికీ ఉన్న ప్రేమ గురించి, యూకే వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో మా చిత్రాలు ఏర్పరచుకున్న బంధం గురించి మాట్లాడటానికి వేల్స్ యువరాజు గారిని కలవడం నిజంగా దక్కిన గౌరవం. 'కభీ ఖుషీ కభీ గమ్' 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ తరుణంలో ఇది మరింత ప్రత్యేకంగా అనిపిస్తోంది". 

 

ఈ చిత్రం తన హృదయాన్ని యూకేకి ఎంతో దగ్గరగా తీసుకువచ్చింది," అని పేర్కొంది పోస్ట్‌లో. ఇక కరణ్‌ జోహార్‌ కూడా వేల్స్‌​ యువరాజు మా ధర్మ ప్రొడక్షన్స్‌ సందర్శించడం చాలా అద్భుతంగా, అదృష్టంగా, గౌరవంగా అనిపించింది. ఆయన భారతీయ సినిమా సామర్థ్యం గురించి, అలాగే అన్ని భారతీయ భాషలలో చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎలా ఆరాధిస్తున్నారో మాట్లాడరని అన్నారు. ఆయనకు కభీ ఖుషీ కభీ గమ్' క్లిప్పులు చూపిస్తున్నప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు దర్శకుడు కరణ్‌.

 

ఇదీ చదవండి: అప్పులే అతడి కెరీర్‌ని మార్చేశాయి..గూగుల్‌ ఉద్యోగం నుంచి వ్యవస్థాపకుడిగా..!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement