పది నెలల్లో 45 కిలోలు..! వైరల్‌గా ఆమె డైట్‌ ప్లాన్‌.. | From 115 Kg To 70 Kg In 10 Months, Sakshi Singh Shares Her Weight Loss Journey, Diet Secrets And Daily High Protein Meal Plan | Sakshi
Sakshi News home page

పది నెలల్లో 45 కిలోలు..! వైరల్‌గా ఆమె డైట్‌ ప్లాన్‌..

Oct 7 2026 12:13 PM | Updated on Oct 7 2026 12:25 PM

Weight Loss: This Woman Dropped 45 Kg In 10 Months

బరువు తగ్గడానికి కేవలం వ్యాయామం మాత్రమే సరిపోదు అని అంటోంది కంటెంట్‌ క్రియేటర్‌ సాక్షి సింగ్‌. ఆరోగ్యకరమైన బరువులో ప్రధాన పాత్ర పోషించేది ఆహారం మాత్రమేనని అంటోంది సాక్షి. కేలరీల లోటు కొవ్వు కరగడానికి దారితీస్తుందని చెబుతోంది. ఎంత తింటారు, ఏమి తింటారు, అనేదానికి స్ట్రిక్ట్‌ కట్టుబడి ఉండటంపైనే బరువు తగ్గడం అనేది ఆధారపడి ఉంటుందని చెబుతోంది. అలా చేసే తాను పది నెలల్లో ఏకంగా 45 కిలోలు తగ్గినట్లు వెల్లడించింది. మరి అదెలాగా ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.

కంటెంట్‌ క్రియేటర్‌ సాక్షి సింగ్‌ ఇటీవల తన బరువు తగ్గే ప్రయాణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ పంచుకున్నారు. తాను సుమారు 115 కేజీల బరువు ఉండేదాన్ని అని, జస్ట్‌ పదినెల్లో 45 కేజీలకు పైగా బరువు తగ్గి 70 కేజీలకు చేరుకున్నట్లు తెలిపారు. తాను వెయిట్‌లాస్‌ జర్నీ ప్రారంభించినప్పుడు సుమారు 2800 కేలరీలు తీసుకోవడం తోపాటు ఫైబర్‌, ప్రోటీన్‌ తీసుకునేలా కేర్‌ తీసుకున్నట్లు తెలిపింది. 

ఇక్కడ కేలరీల లోటు అనేది ప్రతి ఒక్కరికి ఒక్కోలా ఉంటుందని అంటోంది. ఆ రోజు కార్యకలాపాలననుసరించి కేలరీల లోటు మారుతుంటుందని చెబుతోంది. ఒక రోజులో తాను ఏమి తీసుకుంటుందో కూడా వివరించింది ఇలా. తన రోజుని బ్లూటీ, జీలకర్ర, వామునీరు లేదా నిమ్మ -తేనె నీటితో ప్రారంభించి ఉదయం 8 గంటల కల్లా అల్పాహారం తీసుకుంటానని చెప్పింది. ఒకేరకం టిఫిన్‌ కాకుండా అన్ని సముతుల్యంగా ఉండేలా ఫుడ్‌ని మారుస్తానని చెప్పారు. 

తక్కువ కొవ్వు ఉన్న పన్నీర్‌, పెసరపప్పు, శనగపిండి చీలా, పెరుగు వంటివి తప్పనిసరి అని అంటోంది. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక రోజు పనీర్‌ లేదా పెసరపప్పు ఉప్మా, పసరపప్పు ఇడ్లీ, మూంగ్‌లెట్‌, పనీర్‌ కూరతో చేసిన రాగి దోస, పనీర్‌తో కూడిన వెజిటబుల్‌ మసాలా ఓట్స్‌. అంటే అల్పాహారంలో కేవలం 20 నుంచి 30 గ్రాముల ప్రోటీన్‌ తోపాటు 300 నుంచి 450 కేలరీలను లక్ష్యంగా పెట్టుకుంటానని అన్నారు. మధ్యాహ్న భోజనానికి పనీర్‌తో బ్రౌన్‌ రైస్‌, మూంగ్‌దాల్‌ ఖిచిడి, గోధుమ ఊక లేదా జొన్న రొట్టెతో సోయా మటర్‌ సబ్జీ, రొట్టెతో మసూర్‌ పప్పు, రొట్టెతో పాలకూర పప్పు, వంటివి మార్చి తీసుకుంటుంటానని తెలిపింది. 

అప్పడప్పుడు నెయ్యి లేదా నూనె లేకుండా తయారు చేసిన పనీర్‌ లేదా చికెన్‌ కూడా తీసుకుంటానని చెప్పుకొచ్చింది. ప్రోటీన్‌ తోపాటు ఫైబర్‌ తీసుకోవడం కూడా ముఖ్యం కాబట్టి..మధ్యాహ్న భోజనం తోపాటు దోసకాయ, క్యారెట్‌, ఉల్లిపాయలతో చేసిన సలాడ్‌ తప్పనిసరి అని చెప్పుకొచ్చింది. ఈ భోజనాల్లో సుమారు 400 నుంచి 650 కేలరీలు, అలాగే 25 నుంచి 50 గ్రాముల ప్రోటీన్‌ ఉందని చెప్పుకొచ్చింది. స్నాక్‌గా పండు, ఖాక్రా, వేయించిన శనగలు, మఖానా లేదా కొన్ని నట్స్‌ తీసుకుంటానని, అవి సుమారు 100 నుంచి 200 కేలరీలకు మించకూడదని చెప్పుకొచ్చింది. 

రాత్రి భోజనానికి వేయించిన కూరగాయలతో పనీర్‌ లేదా చికెన్‌ క్లియర్‌ సూప్‌, కూరగాయలతో మూంగ్‌దాల్‌ సూప్‌, ఒక మైదా లేని బ్రెడ్‌ ముక్కతో వెజిటబుల్‌ సూప్‌ లేదా కూరగాయలతో నిమ్మ కొత్తిమీర సూప్‌ వంటివి తీసుకుంటానని చెప్పుకొచ్చింది. బాగా ఆకలి వేసిన రోజుల్లో గోధుమ ఊక రొట్టెతో పాలకూర పప్పుని ప్రత్యామ్నాయంగా తీసుకుంటానని అన్నారు. అంటే రోజుకి సుమారు 1400 నుంచి 1700 కేలరీలు దాదాపు 85 నుంచి 120 గ్రాముల ప్రోటీన్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అలా నెమ్మదిగా 500 లేదా అంతకంటే ఎక్కువ కేలరీల లోటుని సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగానని అన్నారు. 

ఎక్కడ కూడా కఠినమైన భోజన ప్లాన్‌ జోలికి వెళ్లలేదని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూనే బరువు తగ్గేలా చూసుకున్నట్లు పేర్కొంది. ఈమె ఆరోగ్యకరమైన నచ్చిన ఆహారం తీసుకుంటూ సమతుల్యతకు పీట వేస్తూ బరువు తగ్గేలా కేర్‌ తీసుకుంది సాక్షి సింగ్‌. అంటే మనం తినేదానిపై అదుపు అవగాహన ఉంటే ఎంత కొండలా పేరుకున్న బరువైనా తగ్గుతుందని ఈ కంటెంట్‌ క్రియేటర్‌ సాక్షిసింగ్‌ తన వెయిట్‌లాస్‌ జర్నీతో నిరూపించింద కదూ..!.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

ఇదీ చదవండి: మీరు రీజనబుల్‌ ఎకామడేషన్‌ కోరవచ్చు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement