
వంటగదిని ఎంత శుభ్రం చేసినా ఎక్కడో ఒక మూల ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. సులభంగా శుభ్రం ఒకటే కాదు, ఈజీగా తెగేలా కత్తులను పదునుగా ఉంచుకోవడం, చాలా సులువుగా స్టవ్‌ను శుభ్రం చేసుకోవడం, ఈజీగా వంట చేయడం ఇవన్నీ పెద్ద టాస్క్‌లే. అందుకే ఇవాల్టీ టిప్ ఆఫ్ ది డేలో భాగంగా కొన్ని కిచెన్ టిప్స్ గురించి తెలుసుకుందాం.
వంటగదిలో స్టవ్ మీద పాలుపొంగినా, సాంబారు లాంటి చిందిన వాటిని వెంటనే శుభ్రం చేసుకోవాలి. ముందే కూరగాలను కోయడం ద్వారా వంట కోసం సిద్ధం చేసుకుంటే వంట తొందరగా అవుతుంది. అలాగే చాకు పదునుగా ఉంటే కూరగాయలు కోయడానికి ఆసక్తిగా ఉంటుంది. ఎలక్ట్రిక్ లేదా మాన్యువల్ షార్పనర్లు సులభంగా చాకులను పదును పెట్టుకోవచ్చు. సానరాయిని ఉపయోగించి చాకును పదును చేయవచ్చు.
ఇంట్లో సెరామిక్ కప్పు ఉంటే, దాని అంచుపై చాకును రుద్దడం ద్వారా కూడా పదును చేయవచ్చు. తడి చాకులనేఅలాగే వదిలేస్తే తుప్పు పట్టే అవకాశం ఉంది, కాబట్టి వాడిన వెంటనే కడిగి, తువ్వాలు లేదా పేపర్ టవల్ తో తుడిచి పొడిగా ఉంచండి. కూరగాయలు లేదా ఇతర ఆహార పదార్థాలను తయారుచేసేటప్పుడు చెత్త వేయడం కోసం కౌంటర్‌లో ఒక గిన్నె ఉంచుకుంటే శుభ్రం చేసుకోవడం ఈజీ అవుతుంది.
మరికొన్ని
బీట్‌రూట్ హల్వా చేసేటప్పుడు ముందుగా బీట్‌రూట్‌ను పాలలో ఉడికించుకుంటే మంచి రుచి వస్తుంది.
దోసెపిండి త్వరగా పులియాలంటే కొంచెం కొబ్బరినీళ్లు కలపాలి.
టొమాటోలు త్వరగా ఉడకాలంటే... ఉడికించేటప్పుడు చెంచాడు చక్కెర వేయాలి.
కాకరకాయ వండేటప్పుడు రెండు పచ్చిమామిడి ముక్కలు వేస్తే చేదు లేకుండా ఉంటుంది.
చపాతీ పిండిలో కాసింత ఉడికించిన బంగాళదుంప ముద్దను కలిపితే చపాతీలు మృదువుగా, రుచిగా ఉంటాయి.
వంటగది దుర్వాసన.. వేస్తుంటే కమలాపండు తొక్కల్ని, లవంగాలతో కలిపి నీటిలో ఉడికిస్తే ఆ దుర్వాసన పోతుంది.