నానోతో పాత ఫొటోలు కొత్తగా! | Introducing Nano Banana Pro | Sakshi
Sakshi News home page

నానోతో పాత ఫొటోలు కొత్తగా!

Nov 28 2025 1:03 AM | Updated on Nov 28 2025 1:03 AM

Introducing Nano Banana Pro

సాంకేతికత

పాత ఫొటోల్లో అపురూపమైనవి ఉంటాయి. అవి రంగు వెలిసి పాడవుతుంటే అయ్యో అనిపిస్తుంది. పాడైపోతున్న ఫొటోలు కొత్తగా మెరిసి పోవడానికి గూగుల్‌ నానో బనానా ప్రొ ఉపయోగపడుతుంది.

‘ఈ పాత ఫొటోను సహజ రంగులు, స్పష్టమైన వివరాలు, లైటింగ్‌తో రీస్టోర్‌ చేయండి, ఒరిజినల్‌ స్టైల్‌ మిస్‌ కాకుండా గీతలు, మరకలను తొలగించండి’లాంటి జనరల్‌ రిస్టోరేషన్‌ ప్రాంప్ట్‌లతో పాటు పోర్ట్రయిట్‌ రీస్టోరేషన్, కలర్‌ కరెక్షన్‌ ప్రాంప్ట్‌ రీబిల్డింగ్‌. టోర్న్‌ సెక్షన్‌లాంటి ప్రాంప్ట్‌లు ఇవ్వవచ్చు.

కొన్ని టిప్స్‌:....
→ అతిగా మార్పులు చేయడం వల్ల ఫొటో సహజత్వం కోల్పోతుంది 
→ ప్రతి కాలానికీ తనదైన కలర్‌ థీమ్‌ ఉంటుంది. ఆ థీమ్‌కు తగ్గ కలర్‌నే వాడితే బాగుంటుంది.
→ షాడోస్‌ ఫొటోలకు సహజత్వాన్ని ఇస్తాయి. పాత ఫొటోలలో టూ మెనీ షాడోస్, హైలైట్స్‌ తొలగించడం వల్ల ఫొటో ఫ్లాట్‌గా కనిపిస్తుంది 
→ చాలామంది ‘ఫిక్స్‌ దిస్‌ ఫొటో’ అని మొక్కుబడిగా ప్రాంప్ట్‌ ఇచ్చి వదిలేస్తుంటారు. దీని వల్ల ఫొటోలో ఫేసియల్‌ ఫీచర్స్‌ అసహజంగా కనిపిస్తాయి.
→ వోవర్‌–షార్పెనింగ్‌ వద్దు.
→ ఒరిజినల్, రిస్టోర్డ్‌ వర్షన్‌లను పక్కపక్కన పెట్టుకొని ఎప్పటికప్పుడు పోల్చి చూసుకోవాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement