యూజర్లు సేఫ్.. మోసాలకు చెక్! | Airtel Partners With Google For Enhanced Messaging Security And Spam Filtering, More Details Inside | Sakshi
Sakshi News home page

Airtel: యూజర్లు సేఫ్.. మోసాలకు చెక్!

Mar 1 2026 6:16 PM | Updated on Mar 1 2026 6:46 PM

Airtel and Google Collaborate to Advance Spam Protection in India

భారతదేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారులకు సురక్షితమైన మెసేజింగ్ అనుభవాన్ని అందించడానికి గూగుల్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. దీంతో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ ఇంటెలిజెన్స్‌ను గూగుల్ రిచ్ కమ్యూనికేషన్స్ సర్వీసెస్ (RCS) ప్లాట్‌ఫామ్ & స్పామ్ ఫిల్టరింగ్‌తో కలపడం ద్వారా వినియోగదారులకు మెరుగైన రక్షణ కలిగిన మెసేజింగ్ సేవలను అందించనున్నారు.

గత 1.5 సంవత్సరాలుగా.. ఎయిర్‌టెల్ స్పామ్ కాల్స్ అండ్ డిజిటల్ మోసాలపై పోరాడుతోంది. ఏఐ బేస్డ్ విధానాలను ఉపయోగించి కంపెనీ ఇప్పటి వరకు 71 బిలియన్ స్పామ్ కాల్స్, 2.9 బిలియన్ స్పామ్ SMSలను అడ్డుకుంది. దీంతో సంస్థ ఆర్ధిక నష్టాల విలువ 68.7 వరకు తగ్గాయి. ఇది వినియోగదారుల పట్ల కంపెనీకున్న నిబద్ధతను స్పష్టంగా చూపిస్తుంది.

అయితే.. టెలికాం నెట్‌వర్క్‌లకు ఉన్న భద్రతా ప్రమాణాలు ఇతర మెసేజింగ్ యాప్స్‌లో పూర్తిగా అమలు కావడం లేదు. దీనిని అదనుగా తీసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు ఆర్ధిక మోసాలకు పాల్పడుతున్నారు. స్పామ్ మెసేజస్ పంపిస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఎయిర్‌టెల్.. గూగుల్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. మొత్తం మీద వినియోగదారుల భద్రతకు సంస్థ గొప్ప నిర్ణయం తీసుకుంది.

ఉపయోగాలు
➤సందేశం పంపిన వారి గుర్తింపును చెక్ చేయవచ్చు.
➤వినియోగదారుల డీఎన్‌డీ సెట్టింగ్స్‌కు అనుగుణంగా మెసేజ్‌లను ప్రకటన లేదా అవసరమైన మెసేజ్‌లుగా వేరు చేసుకోవచ్చు.
➤స్పామ్ బిజినెస్ మెసేజ్‌లు మీ ఫోన్‌కు రాకుండా చేసుకోవచ్చు.
➤హానికరమైన లేదా మోసపూరిత లింకులను ముందుగానే గుర్తించి బ్లాక్ చేసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement