బెస్ట్ పెర్ఫార్మన్స్ కోసం.. ఇదిగో టాప్ 5 కార్లు! | Top 5 Affordable Turbo Petrol SUV Cars In India With Best Performance And Fuel Efficiency | Sakshi
Sakshi News home page

బెస్ట్ పెర్ఫార్మన్స్ కోసం.. ఇదిగో టాప్ 5 కార్లు!

Mar 1 2026 4:57 PM | Updated on Mar 1 2026 6:23 PM

Cheap and Best Turbo Petrol SUVs in India

భారతదేశంలో లెక్కకు మించిన కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో డీజిల్, పెట్రోల్, టర్బో పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ మోడల్స్ ఉన్నాయి. అయితే ఎక్కువ పవర్, టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తూ.. మెరుగైన ఇంధన సామర్థ్యం కావాలనుకునేవారు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కలిగిన వేరియంట్స్ ఎంచుకుంటారు. కాబట్టి ఈ కథనంలో కొంత తక్కువ ధర వద్ద అందుబాటులో ఉండే.. ఐదు బెస్ట్ టర్బో-పెట్రోల్ కార్లను గురించి తెలుసుకుందాం.

టాటా నెక్సాన్
రూ.7.31 లక్షల ధర వద్ద అందుబాటులో ఉండే.. టాటా నెక్సాన్ చెప్పుకోదగ్గ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగిన అత్యంత సరసమైన కాంపాక్ట్ SUV. ఇందులోని 1.2 లీటర్ యూనిట్ 120 హార్స్ పవర్, 170 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మాన్యువల్ AMT & DCTతో సహా మల్టిపుల్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. రోజువారీ వినియోగానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

స్కోడా కైలాక్
కైలాక్ 1.0-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 115hp & 178Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. కొనుగోలుదారులు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ మధ్య ఎంచుకోవచ్చు. ఇంజిన్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. దీని ధర రూ. 7.59 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

టాటా పంచ్
టాటా పంచ్ టాప్ ట్రిమ్‌.. నెక్సాన్ కంటే శక్తివంతమైన 120hp టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. నెక్సాన్ మాదిరిగా కాకుండా, ఈ సెటప్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఇంజిన్ సరళంగా ప్రతిస్పందించేలా అనిపిస్తుంది. దీని ధర రూ. 8.29 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

కియా సిరోస్
సిరోస్ కారు.. వెన్యూ, ఐ20 & సోనెట్ మాదిరిగానే అదే టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. రూ.8.67 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు.. అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇది కేవలం టర్బో పెట్రోల్ ఎంపికలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

నిస్సాన్ మాగ్నైట్
రూ. 8.70 లక్షల ధర వద్ద లభించే నిస్సాన్ మాగ్నైట్ కారు.. 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ పొందుతుంది. ఇది నగర ప్రయాణానికి, హైవేపై వెళ్లడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ట్రాఫిక్ సమయంలో కూడా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్మూత్‌గా ఉంటుంది. కాబట్టి డ్రైవర్ అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement