భారతదేశంలో ఆటోమొబైల్ రంగం రోజురోజుకి విస్తరిస్తూనే ఉంది. కొత్త కంపెనీలు వస్తున్నాయ్. కొత్త ఉత్పత్తులు లాంచ్ అవుతున్నాయి. కొనుగోలుదారులు ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ కొనుగోలు చేయడానికి అమితమైన ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల ప్రతి నెలా కార్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ కథనంలో గత నెలలో ఎక్కువమంది కొన్న టాప్ 10 కార్ల గురించి తెలుసుకుందాం.
➤టాటా నెక్సాన్: 22,434 యూనిట్లు
➤మారుతి సుజుకి డిజైర్: 21,082 యూనిట్లు
➤మారుతి సుజుకి స్విఫ్ట్: 19,733 యూనిట్లు
➤టాటా పంచ్: 18,753 యూనిట్లు
➤హ్యుందాయ్ క్రెటా: 17,344 యూనిట్లు
➤మారుతి సుజుకి ఎర్టిగా: 16,197 యూనిట్లు
➤మహీంద్రా స్కార్పియో: 15,616 యూనిట్లు
➤మారుతి సుజుకి ఫ్రాంక్స్: 15,058 యూనిట్లు
➤మారుతి సుజుకి వ్యాగన్ఆర్: 14,619 యూనిట్లు
➤మారుతి సుజుకి బ్రెజా: 13,947 యూనిట్లు
నవంబర్ 2025లో ఎక్కువమంది కొనుగోలు చేసిన కార్ల జాబితాలో.. 22434 యూనిట్ల అమ్మకాలతో టాటా నెక్సాన్ నిలిచింది. తరువాత జాబితాలో డిజైర్, స్విఫ్ట్ నిలిచాయి. వ్యాగన్ఆర్, బ్రెజా కార్లు చివరి వరుసలో నిలిచాయి. ఎక్కువమంది కొన్న టాప్ 10 కార్ల జాబితాలో ఆరు మారుతి సుజుకి కార్లు, రెండు టాటా కార్లు, ఒక హ్యుందాయ్ కారు ఉన్నాయి.
నవంబర్ నెలలో అత్యధిక అమ్మకాలు పొందిన టాటా నెక్సాన్.. పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ రూపాల్లో అందుబాటులో ఉంది. ఇది మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి.. అత్యుత్తమ పనితీరును అందిస్తుండటం కారణంగా ప్రారంభం నుంచి మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. నెక్సాన్ ప్రారంభ ధర రూ. 7.32 లక్షలు (ఎక్స్ షోరూమ్).
ఇదీ చదవండి: కస్టమర్లకు అలర్ట్: హెచ్‌డీఎఫ్‌సీ సేవలు రెండు రోజులు బంద్!


