2025 అక్టోబర్ ముగియడంతో.. వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల నివేదికలను విడుదల చేశాయి. కొత్త జీఎస్టీ అమలు, ఆఫర్స్ వంటివన్నీ సేల్స్ పెరగడానికి గణనీయంగా దోహదపడ్డాయి. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లో ఎక్కువ మంది కొనుగోలు చేసిన టాప్ 10 కార్లు ఏవి?, అమ్మకాలు ఎన్ని? అనే వివరాలు తెలుసుకుందాం.
టాటా నెక్సాన్: 22,083 యూనిట్లు
మారుతి సుజుకి డిజైర్: 20,791 యూనిట్లు
మారుతి సుజుకి ఎర్టిగా: 20,087 యూనిట్లు
మారుతి సుజుకి వ్యాగన్ఆర్: 18,970 యూనిట్లు
హ్యుందాయ్ క్రెటా: 18,381 యూనిట్లు
మహీంద్రా స్కార్పియో: 17,880 యూనిట్లు
మారుతి సుజుకి ఫ్రాంక్స్: 17,003 యూనిట్లు
మారుతి సుజుకి బాలెనో: 16,873 యూనిట్లు
టాటా పంచ్: 16,810 యూనిట్లు
మారుతి సుజుకి స్విఫ్ట్: 15,542 యూనిట్లు
భారతదేశంలో టాటా నెక్సాన్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనికి కారణం.. ఇది డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ ఆప్షన్లలో అందుబాటులో ఉండటం, అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటం కూడా. ఇక డిజైర్ అమ్మకాలు కూడా ప్రతి నెల ఆశాజనకంగానే ఉన్నాయి. మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో.. మారుతి కార్లైన ఎర్టిగా, వ్యాగన్ఆర్, బాలెనొ, స్విఫ్ట్ కూడా గత నెలలో మంచి అమ్మకాలను పొందాయి.


