సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకునే దిశగా అమెజాన్ ఇంటర్–స్టేట్ ఎక్స్‌ప్రెస్ డెలివరీ (ఐఎక్స్‌డీ) ప్రోగ్రాంలో చేరినట్లు ఈ–కామర్స్ సంస్థ నిహార్ ఇన్ఫో గ్లోబల్ ఎండీ దివ్యేష్ నిహార్ తెలిపారు. ఐఎక్స్‌డీ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో జీఎస్‌టీ రిజిస్ట్రేషన్లు పొందినట్లు పేర్కొన్నారు.
ఇప్పటివరకు కంపెనీ రెండు వేర్‌హౌస్‌లతో కార్యకలాపాలు సాగిస్తుండగా, ప్రోగ్రాంలో చేరడంతో సదరు రాష్ట్రాల్లోని 20కి పైగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను ఉపయోగించుకోవడానికి వీలవుతుందని పేర్కొన్నారు.
సమర్ధవంతంగా నిల్వలను పాటించేందుకు, వ్యయాల భారాన్ని తగ్గించుకుని దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్, పంపిణీ సామర్థ్యాలను పెంచుకునేందుకు, వేగవంతంగా డెలివరీలు చేసేందుకు ఇది తోడ్పడుతుందని వివరించారు. కంపెనీ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు మొదలైనవి ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లలో విక్రయిస్తోంది.


