అక్రమ వాకీ-టాకీ అమ్మకాలపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, మెటాకు షాక్
రూ. 10 లక్షల జరిమానా విధించిన CCPA
ఈ కామర్స్ సంస్థలకు ఇండియాలో భారీ షాక్ తగిలింది. పెద్ద ఎత్తున వాకీ-టాకీల అక్రమ అమ్మకాలు చేపట్టాయంటూ మెటా ప్లాట్‌ఫామ్‌లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ (సీసీపీఏ) జరిమానా విధించింది.
సున్నితమైన ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లపై పనిచేసే అనధికార రేడియో పరికరాల వల్ల ప్రజా భద్రత, జాతీయ భద్రతకు ప్రమాదాలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అమ్మకాలను గుర్తించినట్టు భారతదేశ వినియోగదారుల వాచ్‌డాగ్ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) తెలిపింది. జనవరి 16న 16,900 కంటే ఎక్కువ నాన్-కాంప్లైంట్ వాకీ-టాకీల జాబితాలను గుర్తించిందని (వీటినే పర్సనల్ మొబైల్ రేడియోలు (PMRలు) అని కూడా పిలుస్తారు) వీటిని తప్పనిసరి ఆమోదాలు లేకుండా విక్రయిస్తున్నట్టు గుర్తించినట్టుపేర్కొంది. ఈ కారణంగా అమెజాన్ సెల్లర్ సర్వీసెస్, ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ , మెటా, మీషోలపై రూ. 10 లక్షల జరిమానా విధించింది. అలాగే జియోమార్ట్, చిమియా, టాక్ ప్రో, మాస్క్‌మ్యాన్ టాయ్స్‌లపై ఒక్కొక్కటి ఒక లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు అథారిటీ తెలిపింది. అనేక ప్లాట్‌ఫామ్‌లు జరిమానాలు చెల్లించాయని, మిగిలిన సంస్థల నుండి చెల్లింపులు వేచి ఉన్నామని తెలిపింది.
ప్రభుత్వ అనుమతులు లేకుండా వాకీ-టాకీల , ఇతర రేడియో పరికరాలు జాబితా చేయ బడకుండా లేదా విక్రయాలు జరగకకుండా చూసుకోవాలని CCPA ఆదేశించింది. ఇందుకు ఆయా సంస్థలు క్రమం తప్పకుండా స్వీయ-ఆడిట్‌లను నిర్వహించాలని, సమ్మతి ధృవీకరణ పత్రాలను ప్రచురించాలని, నియంత్రిత వైర్‌లెస్ పరికరాలు చట్టానికి పూర్తిగా అనుగుణంగా మాత్రమే విక్రయించబడుతున్నాయని నిర్ధారించుకోవాలని కూడా ఇది కోరింది. (పండగవేళ విషాదం : చేపలకోసం ఎగబడ్డ జనం)
భారతదేశంలో వాకీ-టాకీల అమ్మకం, దిగుమతి ,వినియోగం ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885, ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫీ చట్టం, 1933, ప్రకారం తక్కువ శక్తి మరియు చాలా తక్కువ శక్తి కలిగిన షార్ట్ రేంజ్ రేడియో ఫ్రీక్వెన్సీ పరికరాల వాడకం (లైసెన్సింగ్ అవసరం నుండి మినహాయింపు) నియమాలు, 2018 ప్రకారం నియంత్రించబడతాయి.
ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి


