
2.5 లక్షల కార్ల అమ్మకాలు
మారుతి సుజుకీ అరుదైన రికార్డు
ఎంట్రీ లెవల్ కార్లకు భారీగా డిమాండ్ నెలకొనడంతో మారుతీ సుజుకీ గడిచిన 4 వారాల్లో 4 లక్షల బుకింగ్స్ సాధించింది. రికార్డు స్థాయిలో 2.5 లక్షల యూనిట్లను విక్రయించింది. ‘జీఎస్‌టీ రేట్ల క్రమబద్ధీకరణ తర్వాత కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రావడంతో ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. గడిచిన నెల రోజుల్లో మొత్తం 4 లక్షల బుకింగ్స్ నమోదయ్యాయి. అంటే వారానికి ఒక లక్ష బుకింగ్స్. ఇదే సమయంలో 2.5 లక్షల కార్ల అమ్మకాలు జరిగాయి. కంపెనీకిది అత్యుత్తమ పండుగ సీజన్‌గా నిలిచింది’ అని మారుతీ సుజుకీ సీనియర్ అధికారి పార్థో బెనర్జీ తెలిపారు.
ముఖ్యంగా చిన్న కార్ల విభాగానికి చెందిన ఆల్టో, సెలెరియో, వేగనాన్, ఎస్–ప్రెస్సో మొత్తం 80,000 బుకింగ్‌లు నమోదయ్యాయని తెలిపారు. జీఎస్‌టీ 2.0 అమలు తర్వాత రేట్లు దిగిరావడంతో కంపెనీ మొత్తం అమ్మకాల్లో 16.7%గా ఉండే చిన్న కార్ల వాటా 21.5 శాతానికి పెరిగిందన్నారు. తొలిసారి కార్లను కొనేందుకు షోరూంను సందర్శిస్తున్న కస్టమర్ల సంఖ్య పెరుగుతుండటంతో వినియోగ స్వభావం ద్విచక్ర వాహనాల నుంచి కార్లకు మారే స్వభావాన్ని సూచిస్తుందన్నారు.
ఇదీ చదవండి: ఓ మై గోల్డ్!