ఒక్క చార్జ్‌ 543 కి.మీ. రేంజ్‌ | Maruti Suzuki launches e Vitara at Rs 10. 99 lakh | Sakshi
Sakshi News home page

ఒక్క చార్జ్‌ 543 కి.మీ. రేంజ్‌

Feb 18 2026 1:14 AM | Updated on Feb 18 2026 12:17 PM

Maruti Suzuki launches e Vitara at Rs 10. 99 lakh

ఈవీ సెగ్మెంట్లోకి మారుతీ మాస్‌ ఎంట్రీ 

ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా దేశీయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల సెగ్మెంట్లోకి లాంఛనంగా ప్రవేశించింది. తమ తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహనం ఈ–విటారాను ఆవిష్కరించింది. బ్యాటరీ యాజ్‌ ఎ సరీ్వస్‌ (బీఏఏఎస్‌) ఓనర్‌షిప్‌ ప్లాన్‌ కింద దీని ధర రూ. 10.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీ యూసేజీ చార్జీ కిలోమీటరుకు రూ. 3.99 చొప్పున ఉంటుంది. 61కేడబ్ల్యూహెచ్, 49కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లతో లభించే ఈ–విటారా 543 కి.మీ. వరకు రేంజినిస్తుంది. తొలినాళ్లలో తీసుకున్నవారికి మారుతీ సుజుకీ డీలర్‌ లొకేషన్లలో ఏడాది పాటు చార్జింగ్‌ కాంప్లిమెంటరీగా లభిస్తుంది.

అలాగే 3 ఏళ్ల ఓనర్‌షిప్‌ ప్లాన్‌తో 60 శాతం విలువ వరకు అష్యూర్డ్‌ బైబ్యాక్‌ ఆప్షన్‌ ఉంటుంది.  ఈ–విటారా యజమానులు కాంప్లిమెంటరీగా 7.4 కేడబ్ల్యూ ఏసీ వాల్‌ బాక్స్‌ చార్జర్‌తో పాటు ఇన్‌స్టాలేషన్‌ ఉచితంగా పొందవచ్చు. మార్చి 31 వరకు ఈ ప్రారంభ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. రూ. 21,000తో కస్టమర్లు దీన్ని బుక్‌ చేసుకోవచ్చని వివరించింది. 

పటిష్టమైన వ్యవస్థ..: దీన్ని మార్కెట్లో ప్రవేశపెట్టడానికి ముందుగా ఈవీల వినియోగంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించే వ్యవస్థలను పటిష్టంగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టినట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌  పార్థో బెనర్జీ తెలిపారు. పబ్లిక్‌ చార్జింగ్‌ మౌలిక సదుపాయాలు, ఆఫ్టర్‌ సేల్స్‌..సరీ్వస్‌ నెట్‌వర్క్‌ మొదలైన విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్నట్లు బెనర్జీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement