అప్పుడప్పుడు నిర్వహణ పనుల వల్ల బ్యాంకుల సేవలకు అంతరాయం కలుగుతుంది. ఈ సమయంలో బ్యాంకింగ్ సేవలు (నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు) తాత్కాలికంగా నిలిచిపోతాయి. ఈ విషయాన్ని బ్యాంకులు ముందుగానే తమ కస్టమర్లకు తెలియజేస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా ఇలాంటి ప్రకటనే వెల్లడించింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పంపిన సందేశం ప్రకారం.. 2025 డిసెంబర్ 13 తెల్లవారు జామున 2.30 గంటల నుంచి ఉదయం 6:30గంటల (నాలుగు గంటలు) వరకు, అలాగే 21వ తేదీన తెల్లవారు జాము 2.30 గంటల నుంచి ఉదయం 6:30 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవు. ఈ బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసిన యూపీఐ సేవలు కూడా ఆ సమయంలో పనిచేయవని హెచ్‌డీఎఫ్‌సీ స్పష్టం చేసింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేవలు పనిచేయని సమయంలో PayZapp ఉపయోగించుకోవచ్చని సిఫార్సు చేసింది. కేవలం రెండు రోజులు, నిర్దిష్ట సమయాల్లో మాత్రమే బ్యాంకింగ్ సేవలు పనిచేయవు. మిగిలిన సమయంలో అన్ని సేవలు యధావిధిగా పనిచేస్తాయి.
ఇదీ చదవండి: వరల్డ్ ఎకనామిక్ క్రాష్: ఇప్పుడే ప్లాన్ చేసుకోండి..


