సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా ఒక ట్వీట్ చేసారు. ఇందులో ''ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినప్పుడు ధనవంతులు కావడం ఎలా'' అనే విషయం వెల్లడించారు.
ధనవంతుడిని $లో కొలుస్తారు.
సంపన్నుడిని TIMEలో కొలుస్తారు.
ఉదాహరణకు ఒక ధనవంతుడు ఇలా అనవచ్చు: “నా దగ్గర బ్యాంకులో $1 మిలియన్ ఉంది.
ఒక సంపన్నుడు ఇలా అనవచ్చు: “నేను ఈ రోజు పని చేయకపోయినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏడు నెలలు జీవించగలను.
ఇప్పుడు చెప్పు.. నువ్వు డబ్బు ఎక్కువగా సంపాదించడానికి పనిచేస్తున్నావా?, లేక దీర్ఘకాలంగా సంపదను నిర్మించుకుని నిజమైన ధనవంతుడు కావడానికి పనిచేస్తున్నావా?. ధనవంతుడు డబ్బు సంపాదించాలి, సంపన్నుడి కోసం డబ్బు పనిచేస్తుందని కియోసాకి పేర్కొన్నారు.
ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో, అనేక ఆస్తుల ధరలు తగ్గుతాయి. తక్కువ ధరకు మంచి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో మరింత ధనవంతులు అవ్వొచ్చు. నేను మూడు ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ సూత్రాన్నే పాటించాను.
ఆర్థిక సంక్షోభం సమయంలో మీ సంపదను పెంచుకోవడానికి మీరు ఏమి చేస్తారు?. ఇప్పుడే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే కఠినమైన ఆర్థిక పరిస్థితులు తలత్తే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండు అని కియోసాకి ట్వీట్ ముగించారు.
LESSON # 7:: How to get richer as the world economies crash:
Are you working to get rich or are you working to get wealthy?
Definitions:
Rich is measured in $.
Wealth is measured in TIME.
For example a rich person might say: “I have $1 million in the bank.”
A wealthy…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 8, 2025


