ప్రపంచ ఆర్థిక మాంద్యం గురించి హెచ్చరిస్తూ వరుస ట్వీట్లు చేస్తున్న రాబర్ట్ కియోసాకి.. దాన్నుంచి బయటపడి ధనవంతులు కావాలంటే ఏం చేయాలో 10 సూచనలు ఇస్తానన్నారు. వాటిలో మూడోది ఇప్పుడు వెల్లడించారు. ఈ మేరకు ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత తాజాగా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
ఆర్థిక సంక్షోభానికి చిక్కకుండా ఉండాలంటే ‘నెట్ వర్క్ మార్కెటింగ్’లో చేరాలని సూచించారు. ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి నెట్ వర్క్ మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా వ్యవస్థాపక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక పతనానికి సిద్ధం కావాలని సలహా ఇస్తున్నారు.
కృత్రిమ మేధస్సు త్వరలో మిలియన్ల ఉద్యోగాలను తొలగిస్తుందని ఇటీవలి ట్వీట్లలో వాదించారు. ఇందులో సాంప్రదాయకంగా స్థిరంగా పరిగణించబడే లేదా చట్టం, వైద్యం, వినోదం వంటి విస్తృతమైన విద్య అవసరమయ్యే వృత్తులకు కూడా మినహాయింపు ఉండదన్నారు. కియోసాకి ప్రకారం.. ఈ మార్పు చాలా మందిని స్వయం ఉపాధి, ప్రత్యామ్నాయ ఆదాయ నమూనాల వైపు నెట్టివేస్తుంది.
అల్లకల్లోలమైన ఆర్థిక వాతావరణంలో వృద్ధి చెందడానికి అవసరమైన ప్రధాన నైపుణ్యాలను పొందడానికి మల్టీ-లెవల్ మార్కెటింగ్ (MLM) అని కూడా పిలువబడే నెట్ వర్క్ మార్కెటింగ్ ఒక మార్గంగా నిలుస్తుందని కియోసాకి వర్ణిస్తున్నారు. అటువంటి వ్యాపారాలు అందించే అనేక ప్రయోజనాలను వివరించారు.
LESSON # 3: How to get richer as global economy crashes.
Join a network marketing business.
Reasons why a network marketing business will make you richer.
AI (Artificial Intelligence) will wipe out millions of jobs even jobs that required lots of schooling like lawyers,…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 3, 2025


