పెట్టుబడులు, ఆర్థిక విషయాలపై ఎప్పకప్పుడు వ్యాఖ్యానించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా మరో హెచ్చరికను జారీ చేశారు. "చరిత్రలో అతిపెద్ద క్రాష్" ప్రారంభమైందంటూ సోషల్ ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
2013లో తాను ప్రచురించిన పుస్తకం రిచ్ డాడ్స్ ప్రొఫెసీని ప్రస్తావిస్తూ దశాబ్దం క్రితం తాను అంచనా వేసిన ప్రపంచ మాంద్యం ఇప్పుడు బయటపడుతోందని, ఇది ఒక్క అమెరికాను మాత్రమే కాకుండా యూరప్, ఆసియాను కూడా ప్రభావితం చేస్తుందని చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వేగవంతమైన పురోగతి ఉద్యోగాలను ఊడ్చేస్తుందని, ఇది జరిగితే వాణిజ్య, నివాస రియల్ ఎస్టేట్ రెండింటిలోనూ భారీ పతనం తప్పదని రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) నమ్ముతున్నారు.
బంగారం, వెండి.. కొనాల్సిందిప్పుడే..
తన దీర్ఘకాల పెట్టుబడి అభిప్రాయాలను పునరుద్ఘాటిస్తూ, కియోసాకి బంగారం (Gold), వెండి, బిట్ కాయిన్, ఎథేరియం హోల్డింగ్స్ ను పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తన ఫాలోవర్లకు సూచించారు. ముఖ్యంగా ఈ పరిస్థితిలో వెండి కొనడం ఉత్తమం, సురక్షితమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక ఔన్స్‌కు 50 డాలర్ల వద్ద ఉన్న వెండి (Silver Price) త్వరలో 70 డాలర్లకి పెరుగుతుందని, 2026 నాటికి అయితే 200 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.
ఇది చదివారా? బిట్‌కాయిన్ క్రాష్: కియోసాకి షాకింగ్ ప్రకటన
ధనవంతులవుతారు!
"శుభవార్త ఏమిటంటే, లక్షలాది మంది తమ సంపదను పోగుట్టుకుంటున్నా... మీరు సిద్ధంగా ఉంటే... ఈ క్రాష్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది"అని కియోసాకి రాసుకొచ్చారు. ఈ క్రాష్ నుంచి సంపన్నులు అయ్యేందుకు మరిన్ని మార్గాలను రానున్న ట్వీట్‌లలో వివరిస్తానన్నారు.
BIGGEST CRASH IN HISTORY STARTING
In 2013 I published RICH DADs PROPHECY predicting the biggest crash in history was coming.
Unfortunately that crash has arrived.
It’s not just the US. Europe and Asia are crashing.
AI will wipe out jobs and when jobs crash office and…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 23, 2025


