ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ సంస్థ శాంసంగ్ సరికొత్త మోడల్ టెలివిజన్‌ను తీసుకొచ్చింది. ‘సీఈఎస్ 2026’లో ప్రపంచంలోనే మొట్టమొదటి 130-అంగుళాల మైక్రో ఆర్‌జీబీ టీవీ (R95H మోడల్)ను ఆవిష్కరించింది. ఇది శాంసంగ్ ఇప్పటివరకు రూపొందించిన అతిపెద్ద మైక్రో ఆర్‌జీబీ డిస్‌ప్లే మాత్రమే కాదు, అల్ట్రా-ప్రీమియం టీవీల డిజైన్, టెక్నాలజీలో ఒక కొత్త దిశను సూచిస్తోంది.
“మైక్రో ఆర్‌జీబీ మా పిక్చర్ క్వాలిటీ ఆవిష్కరణలో అత్యున్నత స్థాయి. ఈ 130-అంగుళాల మోడల్ ఆ దృష్టిని మరింత ముందుకు తీసుకెళ్తుంది” అని శాంసంగ్ విజువల్ డిస్‌ప్లే బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హన్ లీ తెలిపారు. “టెక్నాలజీని కళగా మలిచే మా ఒరిజినల్ డిజైన్ తత్వాన్ని ఆధునిక ఇంజనీరింగ్‌తో మళ్లీ పరిచయం చేస్తున్నాం” అన్నారు.
టీవీ ఫీచర్లు
ఈ మైక్రో ఆర్‌జీబీ టీవీ భారీ పరిమాణం, నెక్స్ట్-జనరేషన్ కలర్ టెక్నాలజీ, ప్రీమియం డిజైన్‌ల సమ్మేళనం. ‘టైమ్‌లెస్ ఫ్రేమ్’ డిజైన్‌తో రూపొందిన ఈ టీవీ, గదిలో ఒక సాధారణ స్క్రీన్‌లా కాకుండా ఒక విశాలమైన, లీనమయ్యే కళాఖండంలా కనిపిస్తుంది.
130-అంగుళాల మోడల్‌లో మైక్రో ఆర్‌జీబీ ఏఐ ఇంజిన్ ప్రో, కలర్ బూస్టర్ ప్రో, హెచ్‌డీఆర్ ప్రో వంటి అధునాతన టెక్నాలజీలు ఉన్నాయి. ఇవి ఏఐ సహాయంతో రంగుల స్పష్టత, కాంట్రాస్ట్, వివరాలను మెరుగుపరుస్తాయి.
మైక్రో ఆర్‌జీబీ ప్రెసిషన్ కలర్ 100 ద్వారా 100% బీటీ.2020 వైడ్ కలర్ గ్యామట్‌ను అందిస్తుంది. వీడీఈ సర్టిఫికేషన్‌తో, నిజ జీవితానికి దగ్గరగా రంగులను ప్రదర్శిస్తుంది. శాంసంగ్ గ్లేర్ ఫ్రీ టెక్నాలజీ ప్రతిబింబాలను తగ్గించి అన్ని లైటింగ్ పరిస్థితుల్లో స్పష్టమైన వీక్షణను ఇస్తుంది.
ఈ టీవీ హెచ్‌డీఆర్10+ అడ్వాన్స్‌డ్, ఎక్లిప్సా ఆడియో, అలాగే మెరుగైన విజన్ ఏఐ కంపానియన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఏఐ ఫుట్‌బాల్ మోడ్ ప్రో, ఏఐ సౌండ్ కంట్రోలర్ ప్రో, లైవ్ ట్రాన్స్‌లేట్, జనరేటివ్ వాల్‌పేపర్, మైక్రోసాఫ్ట్ కోపైలట్, పెర్‌ప్లెక్సిటీ వంటి ఫీచర్లతో స్మార్ట్ అనుభవాన్ని అందిస్తుంది.


