టీ షాపులో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తుండగా వైమానిక దాడి
బ్యాంకాక్: మయన్మార్‌లోని సగాయింగ్ ప్రాంతం మయకాన్ గ్రామంలో ఘోరం జరిగిపోయింది. టీ షాపులోని టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్ తిలకిస్తుండగా, మయన్మార్ సైన్యం వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 18 మంది సాధారణ ప్రజలు మృతిచెందారు. ఈ నెల 5వ తేదీన జరిగిన ఈ సంఘటన వివరాలను స్థానిక స్వతంత్ర ఆన్‌లైన్ మీడియా సంస్థ సోమవారం వెల్లడించింది.
మరో 20 మందికి గాయపడినట్లు తెలియజేసింది. ప్రజాస్వామ్య అనుకూల సాయుధ పోరాటాలపై మయన్మార్ విరుచుకుపడుతోంది. త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తాజా దాడి చర్చనీయాంశంగా మారింది. మయన్మార్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని 2021 ఫిబ్రవరి 1న సైన్యం కూలదోసింది. అప్పటినుంచి దేశంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. జనం భయంభయంగా బతుకుతున్నారు.


