బుధవారం ఉదయం.. పెరిగిన బంగారం ధరలు, 24 గంటలు పూర్తి కాకూండానే తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేట్లలో గంటల వ్యవధిలోనే గణనీయమైన మార్పు కనిపించింది. ఈ కథనంలో తాజా పసిడి ధరలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడలలో రూ. 127850 వద్ద ఉన్న 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికే 500 రూపాయలు తగ్గింది. దీంతో రేటు రూ. 126750 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 550 తగ్గడంతో రూ. 138270 వద్ద నిలిచింది. బెంగళూరు, ముంబై మొదలైన నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
చెన్నై నగరంలో కూడా గోల్డ్ రేటు వరుసగా రూ. 300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 330 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) తగ్గింది. కొత్త ధరలు రూ. 1,28,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,39,640 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్). అయితే ఢిల్లీలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ రేటు ఉదయం ఎలా ఉందో.. సాయంత్రానికి అలాగే ఉంది.
వెండి ధరలు కూడా తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో రూ. 2.83 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. సాయంత్రానికి 2.77 లక్షల రూపాయల వద్దకు చేరింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు సైతం చెబుతున్నారు. సంక్రాంతి నాటికి వెండి రేటు రూ. 3 లక్షలకు చేరుతుందని కొందరు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: మార్చి 2026 నుంచి ఏటీఎమ్‌లో రూ.500 నోట్లు రావా.. నిజమెంత?


