మార్చి 2026 నుంచి ఏటీఎమ్‌లో రూ.500 నోట్లు రావా.. నిజమెంత? | RBI to Stop Rs 500 Notes From ATMs by March 2026 | Sakshi
Sakshi News home page

మార్చి 2026 నుంచి ఏటీఎమ్‌లో రూ.500 నోట్లు రావా.. నిజమెంత?

Jan 7 2026 4:21 PM | Updated on Jan 7 2026 4:51 PM

RBI to Stop Rs 500 Notes From ATMs by March 2026

భారతదేశంలో పలుమార్లు నోట్ల రద్దు జరిగింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఇందులో 2026 మార్చి నుంచి ఏటీఎంల నుంచి రూ. 500 నోట్లు రావని ఉంది. దీనిపై ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో(PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగంలో స్పందించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చి 2026 నాటికి రూ. 500 నోట్ల చెలామణిని నిలిపివేస్తుందని కొన్ని సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయి. దీనిపై పీఐబీ స్పందిస్తూ.. ''ఇది తప్పు అని వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఇలాంటి ప్రకటన చేయలేదు. రూ. 500 నోట్లు చెలామణిలోనే ఉంటాయి. యధావిధిగా ఏటీఎంల నుంచి కూడా తీసుకోవచ్చు'' అని స్పష్టం చేసింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని పేర్కొంది.

ఇదీ చదవండి: అటెన్షన్‌.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!

ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లు
భారతదేశంలో ప్రస్తుతం రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు చెలామణిలో ఉన్నాయి. అయితే ఏటీఎం నుంచి రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు వస్తాయి. కొన్ని ఏటీఎంలలో కేవలం రూ. 500 నోట్లు మాత్రమే వస్తాయి. మొత్తం మీద రూ. 500 నోట్లు రద్దు కావని పీఐబీ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement