పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన గోల్డ్ రేటు! | Gold Prices Drop Again in India Know The Details | Sakshi
Sakshi News home page

పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!

Mar 5 2026 8:40 PM | Updated on Mar 5 2026 8:46 PM

Gold Prices Drop Again in India Know The Details

మార్చి 2నుంచి భారతదేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు, సాయంత్రానికి ఇంకొంత తగ్గుముఖం పెట్టింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనయ్యాయి. ఈ కథనంలో తాజా ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,49,900 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,49,300 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,63,530 రూపాయల నుంచి రూ. 1,62,880 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.

ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఉదయం రూ. 1,50,050 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 1,49,450 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల రేటు 1,63,680 రూపాయల వద్ద నుంచి రూ. 1,63,030 వద్దకు చేరింది.

ఇక చెన్నైలో మాత్రం.. గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 151200 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 164950 వద్దనే ఉన్నాయి.

ఇదీ చదవండి: ఇంటర్ చదివి.. రూ.300 కోట్ల బిజినెస్!

Advertisement
 
Advertisement
Advertisement