బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో.. ఇతర లోహాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ప్లాటినం ధరలు కూడా దూసుకెళ్తున్నాయి, ఇదే వరుసలో రాగి రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు లిథియం కూడా ఇదే వరుసలోకి చేరింది.
బంగారం అనేది కేవలం ఒక లోహంగా మాత్రమే కాకుండా.. మన దేశంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇండియాలో గోల్డ్‌ను సెంటిమెంట్‌గా భావించేవారి ఎక్కువగా ఉందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. దీనిని కొందరు ఆస్తిగా కూడా పరిగణిస్తారు. ఈ కారణాల వల్లనే ఇందులో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య ఎక్కువగా ఉంది.
లిథియంకు డిమాండ్
ఇప్పుడు బంగారం, వెండి మాదిరిగానే.. లిథియంకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దీనిని బ్యాటరీల తయారీలో, ఎలక్టిక్ వెహికల్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, కెమెరాలు, ల్యాప్‌టాప్‌లలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా.. ఇంధన, క్లిన్ ఎనర్జీ వంటి రంగాల్లో కూడా దీని వినియోగం చాలా ఎక్కువైంది. కాబట్టి చాలామంది ఇందులో కూడా పెట్టుబడులు పెడుతున్నారు.
సాధారణ లేదా పాత బ్యాటరీలతో పోలిస్తే.. లిథియం అయాన్ బ్యాటరీలు చాలా మన్నికైనవి. ఛార్జింగ్ కూడా వేగంగా ఉంటుంది. కాబట్టి దీనిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలు ఎక్కువగా వినియోగిస్తారు. రాబోయే రోజుల్లో ఈవీల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లిథియం డిమాండ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.
ప్రపంచంలో ఎక్కువ లిథియం నిల్వలు
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ లిథియం నిల్వలు కలిగిన దేశాల జాబొత్యలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో చిలీ, అర్జెంటీనా, బొలీవియా, చైనా ఉన్నాయి. ఈ దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో లిథియం నిల్వలు కొంత తక్కువే. అయితే మనదేశంలో లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్ మొదలైనవి ఉన్నాయి. కాబట్టి.. భవిష్యత్తులో లిథియంను ఇండియా దిగుమతి చేసుకుపోవాల్సిన అవసరం వచ్చే అవకాశం లేకపోలేదు.
ఇదీ చదవండి: అటెన్షన్.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!


