దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. రూపాయి బలహీనత, ఎఫ్‌ఐఐ అమ్మకాల ప్రభావం దలాల్ స్ట్రీట్ లో ఇంకా కొనసాగుతోంది. యూఎస్ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడంతో గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లలో ఒత్తిడి పెరిగింది. స్థిరమైన మూలధన ప్రవాహాలు, యూఎస్ తో వాణిజ్య చర్చలపై నిరంతర అనిశ్చితి, స్థిరమైన డాలర్ డిమాండ్ కారణంగా రూపాయి విలువ నిన్న డాలర్ మార్కుకు 90 వరకు జారిపోయింది.
ఈరోజు ఉదయం 09:31 సమయానికి నిఫ్టీ(Nifty) 8 పాయింట్లు పెరిగి 25,994కు చేరింది. సెన్సెక్స్(Sensex) 44 పాయింట్లు లాభపడి 85,151 వద్ద ట్రేడవుతోంది.
విస్తృత మార్కెట్లలో ఎన్ఎస్ఈ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ మిశ్రమంగా ఉన్నాయి.
హెచ్‌యూఎల్, టైటాన్, ఎటర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, ట్రెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్ పీవీ, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ రోజు సెన్సెక్స్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ ఎం, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్ మాత్రమే లాభపడ్డాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


