దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 90.35 పాయింట్లు తగ్గి 25,941.85 కు చేరింది. సెన్సెక్స్(Sensex) 241.18 పాయింట్లు నష్టపోయి 84,897.09 వద్ద ట్రేడవుతోంది.
హెచ్‌యూఎల్, టైటాన్, టాటా మోటార్స్ పీవీ, ఎన్టీపీసీ, బీఈఎల్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, కోటక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకీ, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్, ఐటీసీ నేతృత్వంలోని 30 సెన్సెక్స్ స్టాక్స్ ఈ రోజు నష్టాల్లో ఉన్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎటర్నల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, టెక్ ఎం, అదానీ పోర్ట్స్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
రంగాలవారీగా నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.02 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.08 శాతం పెరిగాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా సూచీలు వరుసగా 0.7 శాతం, 0.3 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


