జియోస్టార్‌తో అనుబంధ సంస్థ స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్ లిమిటెడ్(ఎస్‌టీపీఎల్) విలీనాన్ని పూర్తిచేసినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా వెల్లడించింది. స్టార్ బ్రాండ్‌తోపాటు.. గ్రూప్ కంపెనీలకు లైసెన్సులను ఎస్‌టీపీఎల్ కలిగి ఉంది. స్టార్ ఇండియాతో ఎస్‌టీపీఎల్ విలీనం(ప్రస్తుతం జియోస్టార్ ఇండియా)పై 2024 నవంబర్ 14న రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
జియోస్టార్ సైతం రిలయన్స్‌కు అనుబంధ కంపెనీకాగా.. 2025 నవంబర్ 30 నుంచి జియోస్టార్‌లో ఎస్‌టీపీఎల్ విలీనం అమల్లోకి వచ్చినట్లు తెలియజేసింది. నిజానికి రిలయన్స్ మీడియా బిజినెస్, గ్లోబల్ మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ దేశీ బిజినెస్ మధ్య భాగస్వామ్య కంపెనీగా 2024 నవంబర్‌లో జియోస్టార్ అవతరించింది. వెరసి సంయుక్త సంస్థ విలువ 8.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
దీంతో దేశీయంగా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజ ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తున్న కంపెనీ జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో రూ. 7,232 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 1,322 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జియోసినిమా, డిస్నీప్లస్ హాట్‌స్టార్ కలయికతో జియో హాట్‌స్టార్ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.


