కూర్చుని తింటే కొండలైన కరిగిపోతాయనే మాట చాలామంది వినే ఉంటారు. కానీ అంబానీ సంపదను రోజుకు రూ. 5కోట్లు చొప్పున ఖర్చు చేస్తే.. కరిగిపోవడానికి ఏకంగా వందల సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. దీని గురించి మరింత సమాచారం.. వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. ప్రస్తుతం ప్రపంచంలోనే 16వ ధనవంతుడు. ఆయన నికర విలువ దాదాపు USD 113.5 బిలియన్లు, అంటే దాదాపు రూ. 1,01,40,00,00,00,000 కోట్లు. ఈ సంపదను రోజుకు ఐదు కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేస్తే.. మొత్తం కరిగిపోవడానికి 2,02,800 రోజులు అవుతుంది. సంవత్సరాల రూపంలో చెప్పాలంటే 555 ఏళ్లు (2,02,800 ÷ 365) పడుతుందన్నమాట.
రిలయన్స్ ఆదాయం ఇలా..
1966లో ధీరూభాయ్ సారథ్యంలో ఒక చిన్న వస్త్ర తయారీదారుగా ప్రారంభమైన.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇప్పుడు దాదాపు 125 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది. రిలయన్స్.. పెట్రోకెమికల్స్, చమురు, గ్యాస్, టెలికాం, రిటైల్, మీడియా, ఆర్థిక సేవలతో సహా అనేక రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, ముఖేష్ అంబానీ & అతని తమ్ముడు అనిల్ అంబానీ కుటుంబ వ్యాపారాన్ని పంచుకున్నారు.


