ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ పరిచయం చేసే రిలయన్స్ జియో.. తాజాగా రూ. 365 ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఎంత?, డేటా, ఎస్ఎమ్ఎస్ వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
రూ. 365 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా.. కస్టమర్లు 25 జీబీ డేటా పొందవచ్చు. రోజుకు 100 ఎస్‌ఎమ్ఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ 30 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చు. ఇవి కాకుండా.. యూజర్లు మూడు నెలల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్ & టీవీ యాక్సెస్‌ను పొందవచ్చు.
జియోఏఐ క్లౌడ్ కింద 50 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. కంపెనీ గూగుల్ జెమిని ప్రో ప్లాన్‌ను కూడా అందిస్తోంది. అంతే కాకుండా.. రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్లాన్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. అయితే, దీనిని యాక్టివేట్ చేయాలి. ఈ ప్లాన్‌ను ఉపయోగించడానికి మీరు 18 ఏళ్లు పైబడి ఉండాలని గుర్తుంచుకోండి.
ఇదీ చదవండి: ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్!


