మెర్సిడెస్ బెంజ్ రీకాల్.. ఈ మోడల్స్‌పై ఎఫెక్ట్! | Mercedes Benz Recalls CLE AMG CLE And AMG C Class Know The Details | Sakshi
Sakshi News home page

మెర్సిడెస్ బెంజ్ రీకాల్.. ఈ మోడల్స్‌పై ఎఫెక్ట్!

Feb 21 2026 2:46 PM | Updated on Feb 21 2026 2:58 PM

Mercedes Benz Recalls CLE AMG CLE And AMG C Class Know The Details

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన సీఎల్ఈ, ఏఎంజీ సీఎల్ఈ, ఏఎంజీ సీ-క్లాస్ మొదళ్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి?, సమస్యను పరిష్కరించుకోవడం కోసం కస్టమర్లు డబ్బు చెల్లించాలా? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా.. ఎమర్జెన్సీ స్టాప్ అసిస్ట్ ఫీచర్‌ పనిచేయకుండా పోతుంది. దీనివల్ల అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఈ రీకాల్ ప్రభావం.. 2024-25 మధ్య తయారైన సీఎల్ఈ మోడల్స్, 2025లో తయారైన ఏఎంజీ సీఎల్ఈ మోడల్స్, 2024 అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో తయారైన సీ క్లాస్ మోడల్స్ మీద పడుతుంది.

రీకాల్ సమాచారాన్ని కంపెనీ కస్టమర్లకు మెయిల్స్, మెసేజస్ రూపంలో తెలియజేస్తుంది. ప్రభావితమైన మోడల్స్ అన్నింటికీ ఉచితంగా సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి కస్టమర్లు దీనికోసం ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement