30 ఏళ్ల కృషి, ఉద్యోగులకు రూ. 20 కోట్ల లగ్జరీ కార్లు | Kozhikode company gifts cars worth Rs 20 crore to employees on 30th anniversary | Sakshi
Sakshi News home page

30 ఏళ్ల కృషి, ఉద్యోగులకు రూ. 20 కోట్ల లగ్జరీ కార్లు

Feb 18 2026 7:03 PM | Updated on Feb 18 2026 7:13 PM

Kozhikode company gifts cars worth Rs 20 crore to employees on 30th anniversary

కార్పొరేట్  కంపెనీలు భారీ బహుమతులతో ఉద్యోగులను సర్‌ప్రైజ్‌  చేస్తుంటాయి. భారీగా నగదు, కార్లు, ఇళ్లు లాంటి కానుకలతో వార్తల్లో నిలుస్తాయి. తాజాగా తన వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా తన ఉద్యోగులకు రూ. 20 కోట్ల విలువైన 47 కార్లను బహుమతిగా ఇచ్చింది.  వివరాలు ఇలా ఉన్నాయి.

కోజికోడ్‌కు చెందిన కంపెనీ  హైలైట్ గ్రూప్ తన 30 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ  సిబ్బందికి భారీ   బహుమతులలిచ్చి వార్షికోత్సవ సంబరాలకు మరింత వన్నె తీసుకొచ్చింది. గత మూడు దశాబ్దాలుగా కంపెనీ అభివృద్ధిలో సిబ్బంది చేసిన కృషికి గుర్తింపుగా రూ.20 కోట్ల విలువ చేసే 47 కార్లు అందించినట్టు కంపెనీ ప్రకటించింది.

బిజినెస్‌లైన్  నివేదిక ప్రకారం ఈ కార్లలో ప్రీమియ , ప్రసిద్ధ మోడళ్ల  కార్లున్నాయి. ముఖ్యంగా రేంజ్ రోవర్లు, ఆడి క్యూ8, ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్లు ఉండటం విశేషం. ఈ జాబితాలో టాటా హారియర్, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, స్కోడా కైలాక్ మోడళ్లు, ఇతర కార్లతో పాటు ఉన్నాయి. 

భారీ భవిష్యత్‌ ప్రణాళికలు
హైలైట్ గ్రూప్ ఛైర్మన్ పి.సులైమాన్ ఈ సందర్బంగా  భవిష్యత్‌ ప్రణాళికలను కూడా ప్రకటించారు.  ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మరో పది మాల్స్ అభివృద్ధిలో ఉన్నాయని  తెలిపారు. దాదాపు 10వేల మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీ 2030 నాటికి సంస్థను విస్తరించి 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సులైమాన్‌  వెల్లడించారు.

హైలైట్ గ్రూప్  విస్తరణ
హైలైట్ గ్రూప్ 1996లో కోజికోడ్‌లోస్థాపించబడింది. రిటైల్ అండ్‌ కమర్షియల్‌ వాణిజ్య అభివృద్ధితో ప్రారంభమై, నివాస, ఐటీ, మిశ్రమ వినియోగ ప్రాజెక్టులుగా విస్తరించింది. మూడు దశాబ్దాల ప్రయాణంలో హైలైట్ సంస్థ రిటైల్ స్పేస్ రంగంలో కేరళలో అగ్రగామిగా నిలిచింది. తరువాత కంపెనీ కోజికోడ్‌లో హైలైట్ మాల్‌, త్రిస్సూర్‌లోని హైలైట్ మాల్‌ను అభివృద్ధి చేసింది. క్రమంగా అంతర్జాతీయ వ్యాపారాలు,భాగస్వామ్యాలను ఆకర్షించే లక్ష్యంతో కోజికోడ్‌లో 12.5 మిలియన్ చదరపు అడుగుల వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం అంచనా వేసిన పెట్టుబడి సుమారు 680 మిలియన్‌ డాలర్లు (రూ. 623.06 కోట్లు) 

ఇదీ చదవండి: బ్లింకిట్‌కు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు

ఇదీ చదవండి : పెళ్లి కూతురిపై రూ. 8.5 కోట్ల వర్షం, కట్‌ చేస్తే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement