JioStar
-
లోకల్ కంటెంట్‌పై ఫోకస్.. రూ.32 వేల కోట్లు పెట్టుబడి
డిస్నీ-రిలయన్స్ విలీనం తర్వాత ఏర్పడిన మీడియా సంస్థ జియోస్టార్ వేగంగా వృద్ధి చెందుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.32,000-33,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఇది అంతకుముందు సంవత్సరం రూ.30,000 కోట్ల పెట్టుబడితో పోలిస్తే 7% అధికం. స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్, డిజిటల్ విస్తరణపై ఫోకస్‌గా ఉన్న కంపెనీ దేశవ్యాప్తంగా స్థానిక కంటెంట్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. లోకల్ కంటెంట్‌కు ఆదరణ పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది.వ్యూహాత్మక పెట్టుబడిగత మూడేళ్లలో జియోస్టార్ రూ.85,000 కోట్లు వెచ్చించి ప్రముఖ మీడియా సంస్థగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ముఖ్యంగా రీజినల్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ బ్రాడ్ కాస్టింగ్‌లో భారతీయ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కంపెనీ దృష్టి సారించింది. ఐపీఎల్ సీజన్లో 300 మిలియన్ల సబ్స్రైబర్లను చేరుకోవడం, క్రికెట్ పట్ల దేశంలో పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని స్ట్రీమింగ్‌లో సాంకేతిక పురోగతిని పెంచడానికి పెద్దపీట వేస్తుంది.ఇదీ చదవండి: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు వచ్చే బ్యాటరీస్థానిక కంటెంట్ విస్తరణ విభిన్న భాషా, సాంస్కృతిక ప్రేక్షకులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో జియోస్టార్ హైపర్-లోకల్, ఇండియన్ సెంట్రిక్ కంటెంట్‌పై ఆసక్తిగా ఉంది. ఇందులో ప్రాంతీయ క్రీడలు, వినోదం కీలకంగా మారబోతున్నట్లు కంపెనీ తెలిపింది. 5జీ, 4జీ నెట్వర్క్ విస్తరిస్తున్నందున జియోస్టార్ తన డిజిటల్ పంపిణీ ఛానళ్లను బలోపేతం చేస్తోంది. స్మార్ట్ టీవీలు, మొబైల్ పరికరాలు లేదా ప్రత్యక్ష ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విస్తృత ప్రేక్షకులకు కంటెంట్ అందుబాటులో ఉండేలా చూస్తోంది. -
IPL 2025: జియోహాట్‌స్టార్‌కు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం ఎన్ని కోట్లంటే?
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025' (IPL 2025) మొదలైపోయింది. సుమారు రెండు నెలల పాటు సాగే ఈ సీజన్‌కు సంబంధించిన డిజిటల్, ఓటీటీ రైట్స్ అన్నింటినీ జియోహాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఈసారి జియోహాట్‌స్టార్ ప్రకటనల ద్వారానే ఏకంగా రూ. 4,500 కోట్లు సంపాదించనుంది. దీనికోసం సంస్థ.. 32 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.ఐపీఎల్ 2025 ప్రకటన ధరలు➤టీవీ ప్రకటనలు: రూ.40 కోట్ల నుంచి రూ.240 కోట్లు➤ప్రాంతీయ టీవీ ప్రకటనలు: రూ.16 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి➤కనెక్టెడ్ టీవీ (CTV): 10 సెకన్లకు రూ.8.5 లక్షలు➤మొబైల్ ప్రకటనలు: రూ.250 వరకుస్పాన్సర్లుజియోహాట్స్టార్ స్పాన్సర్ల జాబితాలో.. మై11సర్కిల్, ఫోన్‌పే, ఎస్బీఐ, బ్రిటానియా 50-50, అమెజాన్ ప్రైమ్, డ్రీమ్11, టీవీఎస్, మారుతి, అమెజాన్ ప్రైమ్, వోల్టాస్, ఎంఆర్ఎఫ్, జాగ్వార్, ఏషియన్ పెయింట్స్, అమూల్ మొదలైన 32 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్‌లో యాడ్స్ కోసం ఇప్పటికే డీల్స్ కుదుర్చుకున్నాయి.ఇదీ చదవండి: వేలకోట్ల సంపదకు యువరాణి.. స్టార్ హీరోయిన్ కూతురు.. ఎవరో తెలుసా?జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్స్ఐపీఎల్ 2025 సమయంలో.. జియోహాట్‌స్టార్ 40 మిలియన్ల అదనపు చెల్లింపు సబ్స్క్రైబర్ల ప్రత్యేక ఆఫర్స్ అందించడం మొదలుపెట్టింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా విలీనం తర్వాత ఏర్పడిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్.. ప్రస్తుతం 62 మిలియన్ల సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. 2025 ఫిబ్రవరి 14న ఈ సంఖ్య 50 మిలియన్లు. ఈ ఐపీఎల్ 2025 సీజన్‌కు 100 మిలియన్ల సబ్స్క్రైబర్లను చేరుకోవడానికి సంస్థ కృషి చేస్తోంది. -
జియోస్టార్ యూట్యూబ్ కంటెంట్ తొలగింపు
భారత బ్రాడ్‌కాస్టింగ్, డిజిటల్ స్ట్రీమింగ్ పరిశ్రమలో ప్రముఖ సంస్థగా ఉన్న జియోస్టార్(Jiostar) మే 1, 2025 నాటికి యూట్యూబ్ నుంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది. పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునేందుకు సంస్థ ఈమేరకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. పే-టీవీ(డబ్బు చెల్లిస్తే టీవీ సర్వీసులు అందించడం) డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్ నుంచి ఉచిత డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌కు చందాదారుల వలసలను అరికట్టడానికి ఈ వ్యూహాత్మక నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.జియోస్టార్ ఇకపై ప్రీమియం కంటెంట్‌ను సబ్స్రిప్షన్ పరిధిలోకి తీసుకురావాలనే వ్యూహానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా చేయడం ద్వారా పెయిడ్ సర్వీసులను పెంచుతూ సబ్‌స్రైబ్‌లను ప్రోత్సహించేందుకు వీలు అవుతుందని కంపెనీ నమ్ముతుంది. జియోసినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ విలీనంతో ఓటీటీ విభాగంలో జియోస్టార్ కీలకంగా మారింది. ఇది బాలీవుడ్, అంతర్జాతీయ సినిమాలు, ప్రాంతీయ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్‌తో సహా విభిన్న కంటెంట్‌ను అందిస్తోంది.బ్రాడ్ కాస్టింగ్ పరిశ్రమపై ప్రభావంయూట్యూబ్ నుంచి కంటెంట్‌ను తొలగించాలన్న నిర్ణయం బ్రాడ్‌కాస్టింగ్ పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టాటా ప్లే, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ వంటి పే-టీవీ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్‌లు ఉచితంగా ప్రీమియం కంటెంట్ అందిస్తున్నాయి. క్రమంగా ఈ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఇదే పంథాను ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో తమ సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునే వీలు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం పే-టీవీ సబ్ స్క్రిప్షన్ల సంఖ్య 8.4 కోట్లుగా ఉంది. ఇది గతంలో ఎక్కువగానే ఉండేది. చందాదారులను నిలుపుకోవడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి కంపెనీలు విభిన్న మార్గాలను అన్వేషిస్తున్నాయి. భారతదేశంలో టీవీ సబ్ స్క్రిప్షన్ మార్కెట్ విలువ రూ.40,000 కోట్లు ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: పండుగ వేళ పసిడి పరుగు.. తులం ఎంతంటే..సవాళ్లు ఇవే..సబ్స్క్రిప్షన్ ఆధారిత మోడల్‌పై కంపెనీలు దృష్టి పెట్టడం ఆదాయ వృద్ధికి అవకాశాలను పెంచేవైనప్పటికీ.. ఉచిత కంటెంట్‌కు అలవాటు పడిన భారతీయ వినియోగదారులు ఎంత మేరకు పెయిడ్ సబ్ స్క్రిప్షన్లకు మారుతారో గమనించాల్సి ఉంటుంది. ఏదేమైనా జియోస్టార్ కంటెంట్ లైబ్రరీ, లైవ్ స్పోర్ట్స్, ప్రాంతీయ కంటెంట్ వంటి ప్రత్యేక సదుపాయాలు వీక్షకులను సబ్‌స్క్రైబ్ చేసుకునే దిశగా ఆకర్షిస్తుందని కంపెనీ విశ్వసిస్తుంది. -
ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్: జియోస్టార్ సరికొత్త రికార్డ్
జియోస్టార్ టీవీ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో లైవ్ స్పోర్ట్స్ ప్రసార అనుభవాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూనే ఉంది. ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 'ఇండియా vs పాకిస్తాన్' మ్యాచ్‌ను 20.6 కోట్లమంది వీక్షించారు. ఇది బీఏఆర్సీ చరిత్రలోనే ఎక్కువమంది వీక్షించిన రెండవ క్రికెట్ మ్యాచ్‌గా (వరల్డ్ కప్ మ్యాచ్‌లు మినహా) నిలిచింది.2025 ఫిబ్రవరి 23న జరిగిన ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా జరిగిన భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌ను 20.6 కోట్లమంది వీక్షించారు. ఈ సంఖ్య 2023లో అహ్మదాబాద్‌లో జరిగిన ఓడీఐ ప్రపంచ కప్ మ్యాచ్ కంటే దాదాపు 11% ఎక్కువ. ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఇండియా 2023లో జరిగిన మ్యాచ్‌తో పోలిస్తే రేటింగ్లలో 10% కంటే ఎక్కువ. వ్యూయ్స్ టైమ్ కూడా 2609 కోట్ల నిమిషాలుగా నమోదైంది.భారతదేశంలో జరుగుతున్న క్రీడా కార్యక్రమాలతో జియోస్టార్ కొత్త మైలురాళ్లను చేరుకుంటోంది. అభిమానుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి, మా ప్రేక్షకుల సంఖ్యను విస్తరించడానికి మేము కట్టుబడి ఉన్నామని జియోస్టార్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్‌ను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు.