హైదరాబాద్‌లో జియోస్టార్‌ రోడ్‌షో | Jiostar Road Show in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో జియోస్టార్‌ రోడ్‌షో

May 29 2025 7:20 PM | Updated on May 29 2025 7:41 PM

Jiostar Road Show in Hyderabad

హైదరాబాద్‌: తెలుగు ఆడియెన్స్‌కు, దక్షిణాదిలో ప్రకటనకర్తలకు మరింత చేరువయ్యే క్రమంలో హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించినట్లు జియోస్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తెలిపింది.  ప్రతి నెలా ప్రాంతీయంగా 90 శాతం మంది తమ స్టార్‌ మా, స్టార్‌ మా మూవీస్‌ తదితర చానల్స్‌లో కంటెంట్‌ను వీక్షిస్తున్నట్లు వివరించింది.

దీంతో పెద్ద ఎత్తున వీక్షకులకు చేరువ కావడానికి ప్రకటనకర్తలకు ఇదొక అవకాశం కాగలదని పేర్కొంది. నటులు ఆమని, శ్రీముఖి, అవినాష్, ప్రభాకర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  24,000 గంటల తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్, 1,800 పైగా టైటిల్స్‌తో జియోహాట్‌స్టార్‌ వద్ద అత్యధిక స్థాయిలో కంటెంట్‌ ఉన్నట్లు జియోస్టార్‌ రెవెన్యూ హెడ్‌ అజిత్‌ వర్గీస్‌ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement