సాక్షి, హైదరాబాద్: మహా హైదరాబాద్‌లో పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం మరో అడుగు వేస్తోంది. కేపీహెచ్‌బీలోని ప్రైమ్ లొకేషన్‌లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. హౌసింగ్ బోర్డు 47 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఇలాంటి బహుళ అంతస్తుల టవర్స్ నిర్మాణం చేపట్టడం విశేషం. అంతకు ముందు 1980లో బోర్డు కేపీహెచ్‌బీలో ఫేజ్ 1,2లో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటి వరకు ఇలాంటి బహుళ అంతస్తుల టవర్స్ నిర్మించలేదు. ఈ ప్రాజెక్ట్ ఆ చరిత్రను మార్చనుంది
రూ. 46.20 కోట్లతో మొదటి దశ పనులు
అత్యంత ఖరీదైన కేపీహెచ్‌బీ కాలనీలోని ఫేజ్ 7–9, గోకుల్ ఫ్లాట్స్ మధ్యలోని మలేషియా టౌ¯న్ షిప్ ఎదురుగా ఉన్న సుమారు 5.87 ఎకరాల విస్తీర్ణంలో రూ.46.20 కోట్ల అంచనా వ్యయంతో 4 టవర్లను నిరి్మంచనున్నారు. మొదటి దశ కింద 4 టవర్ల ద్వారా 480 ఇళ్లు నిరి్మంచనున్నారు. రెండవ దశలో 680 ప్లాట్లను నిరి్మంచేందుకు కూడా స్థలాన్ని కేటాయించారు. ఏడాది వ్యవధిలోనే మొదటిదశ నిర్మాణ పనులను పూర్తిచేసి లబి్ధదారులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే నగరంలోని 16 నియోజకవర్గాల్లో 7,680 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి డిమాండ్ సర్వే నిర్వహించి దరఖాస్తులు స్వీకరించగా, మొదటి ప్రాజెక్టుగా కేపీహెచ్‌బీలోనే పనులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వ భూమిపైనే నిర్మాణం జరుగుతుంది ఒక్కో ఇల్లు మార్కెట్ విలువ రూ.40 నుంచి రూ.58 లక్షల మధ్య ఉన్నా, లబి్ధదారులు కేవలం రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తం ప్రభుత్వ సబ్సిడీగా అందుతుంది. ఈ నెల 19న టెండర్లను ఖరారు చేసి, నిర్మాణ పనుల్ని వేగవంతం చేయనున్నారు
దరఖాస్తుల వరద
క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్) పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 7,340 ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆగస్టు 10 వరకు 46,121 దరఖాస్తులు వచ్చాయి. గడువును ఆగస్టు 15 వరకు పొడిగించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోనే 5,233, ఖైరతాబాద్‌లో 4,394, కుత్బుల్లాపూర్‌లో 4,121, నాంపల్లిలో 3,613 దరఖాస్తులు వచ్చాయి. మహేశ్వరంలో కేవలం 471 మాత్రమే వచ్చాయి. ప్రతి దరఖాస్తుదారు రూ.10 వేల ఈఎండీ చెల్లించాల్సి ఉంది. ఎంపిక కాని వారికి ఈ మొత్తం తిరిగి ఇస్తారు. ఆగస్టు 20 నుంచి లాటరీ ప్రక్రియ మొదలుపెట్టి, నెలాఖరు లోపు కేటాయింపులు పూర్తి చేయాలని హౌసింగ్ శాఖ నిర్ణయించింది.



