కాటికాపర్ల కోసం గాలింపు
శిశువు మృతదేహం మిస్సింగ్ ఘటనపై దర్యాప్తు
బంజారాహిల్స్: ఖననం చేసిన శిశువు మృతదేహం మిస్సింగ్ పై బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పంజగుట్ట శ్మశానవాటిక కాటికాపరి జగన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న చిన్న అలి యాస్ శ్రావణ్‌కుమార్, అక్షయ్, మరో ఇద్దరు మహిళా కాటికాపర్ల కోసం గాలింపు చేపట్టారు. వారిని విచారిస్తే వాస్తవం వెలుగు చూస్తుందని పోలీసులు భావిస్తున్నారు. అమావాస్య రోజున మృతశిశువుతో ఏమైన క్షుద్రపూజలు చేయడానికి మాయం చేశారా? అన్న కోణంలో పోలీసులు అనుమానితులపై నిఘా పెట్టారు. పరిసరాల్లోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. స్థానికులను ప్రశ్నిస్తున్నారు. కాటికాపర్ల నివా సాల వద్ద కూడా నిఘా పెట్టారు.


